News
News
X

Bigg Boss 6 telugu: కెప్టెన్సీ పోటీలో ఆ ముగ్గురు అమ్మాయిలు, ఇంటి కెప్టెన్ కీర్తి? వరస్ట్ కంటెస్టెంట్ ఆ హీరో?

Bigg Boss 6 telugu: బిగ్‌బాస్ ఇంటికి తొలి మహిళా కెప్టెన్ రాబోతోంది.

FOLLOW US: 
 
Bigg Boss 6 telugu: బిగ్‌బాస్ ఇంట్లో తొలి మహిళా కెప్టెన్ రాబోతోంది. కెప్టెన్సీ టాస్కులో చివరికి ముగ్గురు అమ్మాయిలు మిగిలారు. ఆరోహి సంచాలక్‌గా మారి ఆట ఆడించింది. కెప్టెన్సీ కంటెండర్లుగా చివరికి సుదీప, శ్రీ సత్య, కీర్తి మిగిలారు. వీరికి ఫిజికల్ టాస్కు ఇచ్చారు. వీరిలో ఎవరు గెలిచారో చూడాలంటే ఎపిసోడ్  వీక్షించాల్సిందే. 

ఇక ప్రోమోలో వరస్ట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పమని అడిగారు బిగ్‌బాస్. ఇందులో భాగంగా లాన్ ఏరియాలో ఓ పోస్టుబాక్సులాంటిది పెట్టారు. పేపర్ పై పేరు రాసి అందులో వేయమని చెప్పారు బిగ్‌బాస్. అలాగే కారణం కూడా చెప్పమన్నారు. శ్రీహాన్ పేపరుపై కీర్తి పేరు రాశాడు. ఇక రేవంత్ ఇనయా సుల్తానా పేరు చెప్పాడు. ఆమె ఫెయిర్ గేమ్ ఆడడం లేదని చెప్పాడు. ఎక్కువ మంది అర్జున్ కళ్యాన్ పేరును సజెస్ట్ చేశారు. సుదీప, ఫైమా, రాజశేఖర్, చంటి, ఆరోహి అర్జున్ నే నామినేట్ చేశారు. కనుక ఆయనే వెళ్లే వరస్ట్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్సు ఉంది. 

అలా చేయడమే కొంప ముంచింది..
అర్జున్ కళ్యాణ్ అందరికీ టార్గెట్ అవ్వడానికి కారణం... బీబీ హోటల్ లో శ్రీ సత్య చుట్టూ తిరుగుతూ డబ్బులన్నీ ఆమెకే ఇచ్చాడు. ఆయన ఆడిన ఆట మాత్రం పెద్దగా లేదు. ఏదడిగినా రెండింతలు ఎక్కువిస్తా అంటూ శ్రీసత్యతో చెప్పుకొచ్చాడు. ఆమె మాత్రం టాస్కు వరకు అర్జున్ ను వాడుకుని తరువాత వదిలేసింది. అలాగే సూర్య, కీర్తి కూడా అర్జున్ నే నామినేట్ చేశారు. శ్రీసత్య చేత పనేమీ పెద్దగా చేయించుకుండానే డబ్బులు ఇచ్చేశాడని కారణంగా చెప్పారు. ఇక శ్రీసత్య ఫైమాను నామినేట్ చేసింది. ఇక గీతూ ఇక్కడ కూడా తన పర్సనల్ రివేంజ్ తీర్చుకునే ప్రయత్నం చేసింది. చంటిని వరస్ట్ అంటూ చెప్పింది. ఆదిరెడ్డి కూడా చంటి పేరునే ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇచ్చిన సీక్రెట్ టాస్కును చేయకపోవడంపై ఆయన మాట్లాడారు. 

News Reels

ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం కీర్తి ఇంటి కెప్టెన్ అయింది, ఇక వరస్ట్ కంటెస్టెంట్ గా అర్జున్ కళ్యాన్ జైలుకెళ్లబోతున్నాడు.  

ఈ సారి నామినేషన్స్ లో ఎక్కువమందే ఉన్నారు. ఆదివారం కీర్తి, అర్జున్ కళ్యాణ్ నేరుగా నామినేట్ అయ్యారు. 
1. సుదీప
2. కీర్తి
3. ఆరోహి
4. గీతూ
5. శ్రీహాన్
6. ఇనయా
7. రాజశేఖర్
8. సూర్య
9. అర్జున్
10. రేవంత్

వీరిలో ఇనయా, రేవంత్, గీతూ ఎలిమినేట్ అయ్యే అవకాశం సున్నా. శ్రీ సత్యా ఈ వారం బాగా ఆడింది కాబట్టి ఆమె కూడా సేవ్ అవుతుంది. ఇక వీరిలో కీర్తి, వాసంతి, రాజశేఖర్, అర్జున్... వీరిలో ఎవరో ఒకరు ఈ వారం ఇంటికి వెళ్లే ఛాన్సు ఉన్నట్టు సమాచారం. ఇక వీరిలో చాలా వీక్ కంటెస్టెంట్లుగా కనిపిస్తున్నది కీర్తి, రాజశేఖర్. కీర్తి పెద్దగా ఆడటానికి ఇష్టం కూడా చూపించడం లేదు. ఆమెకు తెలుగు సరిగా రాకపోవడం కూడా మైనస్ గా మారింది. వాసంతి కూడా కామ్ గోయింగ్ గర్ల్ కావడం వల్ల ఫ్యాన్స్ తక్కువగా ఉన్నారు.

Also read: ఇంట్లో అమ్మాయి కెప్టెన్ అవ్వాలి అంటూ శ్రీహాన్‌ పై పగ తీర్చుకున్న ఇనయా

Also read: రేవంత్‌కి జీవితంలో మర్చిపోలేని కానుక ఇచ్చిన బిగ్‌బాస్, ప్రేక్షకుల కళ్లు కూడా చెమర్చేలా

Published at : 30 Sep 2022 07:33 PM (IST) Tags: Bigg Boss 6 Telugu inaya sulthana Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Revnath

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఇంట్లో 'బాంబ్' పెట్టేసిన బిగ్ బాస్ - కన్ఫెషన్ రూంలోకి వెళ్లనన్న శ్రీసత్య, రేవంత్ సీరియస్

Bigg Boss 6 Telugu: ఇంట్లో 'బాంబ్' పెట్టేసిన బిగ్ బాస్ - కన్ఫెషన్ రూంలోకి వెళ్లనన్న శ్రీసత్య, రేవంత్ సీరియస్

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలో ఆదిరెడ్డి, శ్రీహాన్ - వీరు మరీ ఇంత పిరికి వాళ్లా?

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలో ఆదిరెడ్డి, శ్రీహాన్ - వీరు మరీ ఇంత పిరికి వాళ్లా?

BiggBoss 6 Telugu: రోహిత్ వర్సెస్ ఆదిరెడ్డి, ఇద్దరిలో గెలుపు ఎవరిది - రేవంత్ గొడవలు ఇక ఆపడా?

BiggBoss 6 Telugu: రోహిత్ వర్సెస్ ఆదిరెడ్డి, ఇద్దరిలో గెలుపు ఎవరిది - రేవంత్ గొడవలు ఇక ఆపడా?

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఇంట్లో దెయ్యం, అరుపులతో భయపెట్టేసిన ఆ కంటెస్టెంట్

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఇంట్లో దెయ్యం, అరుపులతో భయపెట్టేసిన ఆ కంటెస్టెంట్

Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్, విన్నర్ ప్రైజ్ మనీ పెంచేందుకు వింత టాస్కులు

Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్, విన్నర్ ప్రైజ్ మనీ పెంచేందుకు వింత టాస్కులు

టాప్ స్టోరీస్

Why Vijaysaireddy Lost Post : అసభ్య ట్వీట్లే పదవిని దూరం చేశాయా ? విజయసాయిరెడ్డికి " ప్యానల్ వైస్ చైర్మన్" పోస్ట్ ఎలా దూరం అయింది ?

Why Vijaysaireddy Lost Post :  అసభ్య ట్వీట్లే పదవిని దూరం చేశాయా ? విజయసాయిరెడ్డికి

KTR Support : చదువుల సరస్వతికి మంత్రి కేటీఆర్ సాయం, వైద్య విద్యకు ఆర్థిక భరోసా!

KTR Support : చదువుల సరస్వతికి మంత్రి కేటీఆర్ సాయం, వైద్య విద్యకు ఆర్థిక భరోసా!

Ponnam Prabhakar : ఏపీ, తెలంగాణ మళ్లీ కలవడం కల, రాజకీయ లబ్ధి కోసమే సజ్జల సమైక్యరాగం - పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ, తెలంగాణ మళ్లీ కలవడం కల, రాజకీయ లబ్ధి కోసమే సజ్జల సమైక్యరాగం - పొన్నం ప్రభాకర్

Sajjala On United State ; ఏపీ, తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !

Sajjala On United State ;  ఏపీ,  తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !