Bigg Boss 6 telugu: శ్రీసత్యను శ్రీహాన్ ఎత్తుకోగానే అర్జున్ కళ్లల్లో అసూయ చూడాల్సిందే
Bigg Boss 6 telugu: బిగ్ బాస్ హౌస్‌లో ఈ రోజు కామెడీ బాగా పండింది.
Bigg Boss 6 telugu: నామినేషన్స్ డే అనుకున్నంత హీట్ మీద సాగలేదు కానీ, ఈ రోజు కామెడీ మాత్రం బాగా పండేలా కనిపిస్తుంది. ప్రోమో చూశాక నవ్వకుండా ఎవరూ ఉండలేరు. ముఖ్యంగా ఫైమా చేసిన కామెడీ నేటి ఎపిసోడ్లో హైలైట్ అయ్యేలా ఉంది.
ఇక ప్రోమోలో ఏముందంటే... బిగ్‌బాస్ బర్త్ డే సందర్భంగా పార్టీ ఏర్పాడు చేశారని, ఆ పార్టీకి ఇంటి సభ్యులందరినీ ఆహ్వానించినట్టు చెప్పాడు బిగ్‌బాస్. తన పుట్టినరోజు సందర్భంగా తనను ఎంటర్టైన్ చేయమని చెప్పాడు. ఒక్కొక్కరు తమకొచ్చిన కళతో వినోదం పంచడానికి ప్రయత్నించారు. ముందుగా సూర్య చిరంజీవి వాయిస్‌ను మిమిక్రీ చేశారు. చిరు గొంతును ఉన్నది ఉన్నట్టు దించేశాడు సూర్య.
అర్జున్ కళ్లలో అసూయ
ఇక శ్రీహాన్, శ్రీసత్య కలిసి డ్యాన్సు చేశారు. సీతారామంలోని ‘ఓ సీతా’ పాటకు ఇద్దరూ చక్కగా డ్యాన్సు చేశారు. మధ్యలో శ్రీసత్యను ఎత్తుకున్నాడు శ్రీహాన్. ఆ సమయంలో అర్జున్‌నే చూపించారు ప్రోమోలో. అతని కళ్లలో బాధ, అసూయ అన్నీ క్లియర్‌గా కనిపించాయి. శ్రీసత్య అనుగ్రహం కోసం ఆమె చుట్టూ అతను ఎంతగా తిరుగుతున్నాడో ప్రేక్షకులందరికీ తెలిసిందే. ముఖ్యంగా తన ఆటను పక్కనపెట్టి మరీ ఆమెకే ఫేవర్ చేస్తూ కనిపించాడు. అలాంటి అమ్మాయి వేరే వాళ్లతో డ్యాన్సు చేస్తుంటే ఏ ప్రేమికుడైన అసూయ పడకుండా ఉంటాడా.
ఫైమా సూపర్ కామెడీ
ఇక ఫైమా చిన్న స్కిట్ ప్లే చేసింది. ఆ స్కిట్‌లో ఆమె హావభావాలు మామూలుగా లేవు. నవ్వలేక చచ్చిపోయారు ఇంటి సభ్యులు. అర్జున్ ఫైమా లవర్ గా నటించాడు. వచ్చీ రానీ ఇంగ్లిష్ మాట్లాడుతూ నవ్వించింది ఫైమా. అతడిని ఉద్దేశించి ‘నన్ను చంపేద్దామని చూస్తున్నావ్ కదా, అంటే నువ్వు ఎవరినో చూసుకున్నావ్. లెట్స్ బ్రేకప్ అర్జున్. ఇకపై నువ్వు ఈ అందాన్ని దక్కించుకోలేవు. ఈ అందం నీకు దక్కదు’ అంటూ కామెడీ చేసింది. దానికి సూర్య సోఫా నుంచి కిందపడినట్టు నటించాడు. ఇంటి సభ్యులంతా తెగ నవ్వారు.
గీతూ - చికెన్
ఇక గీతూని కన్షెషన్ రూమ్‌కి పిలిచాడు బిగ్‌బాస్. అక్కడ చికెన్, డ్రింకు పెట్టాడు. ఆ చికెన్ తినాలంటే మంచి గాసిప్పు ఒకటి చెప్పమన్నాడు. దానికి గీతూ ‘సూర్య - ఇనయా మధ్య ఏదో జరుగుతోంది’ అని చెప్పింది. ఈ గాసిప్పుకు బిగ్‌బాస్ ‘చికెన్ వాసన చూడవచ్చు’ అని చెప్పాడు. తరువాత గీతూ ‘బాలాదిత్య పదే పదే దీపూ దీపూ (సుదీప) అని పిలుస్తుంటే మంట పుడుతోంది’ అంది. దానికి బిగ్‌బాస్ అంత మంటలో చికెన్ తినగలరా అని అడిగాడు బిగ్ బాస్. దీంతో గీతూ తన స్టైల్లో రెస్పాండ్ అయింది. మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ చూసి నవ్వుకోవచ్చని అర్థమవుతోంది.
Also read: ఇనయాను మళ్లీ రెచ్చగొట్టిన శ్రీహాన్, టైటిల్ కొట్టి తీరుతా అంటూ శపథం చేసిన ఇనయా, నామినేషన్స్ డే హీట్
Also read: ఏం ఫిట్టింగ్ పెట్టావు బిగ్‌బాస్, ఇలాంటి నామినేషన్ అని పాపం ఊహించి ఉండరు, నామినేషన్లో ఆ ఎనిమిది మంది