By: ABP Desam | Updated at : 13 Dec 2021 11:27 PM (IST)
Image Credit: Star Maa/Hotstar
Bigg Boss 5 Telugu Episode 100 Live Update: ఈ రోజు ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 100 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. 98వ రోజు మానస్, సన్నీలు స్విమ్మింగ్ పూల్ వద్ద మాట్లాడుకుంటూ.. ఫస్ట్ వీక్ నుంచి 15వ వారం వరకు ఉండటమంటే మాటలు కాదంటూ ఆశ్చర్యపోవడం కనిపించింది. మానస్.. సన్నీతో మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ వీకే వెళ్లిపోతాం అనుకున్నాం మనమిద్దరం’’ అని అన్నాడు. సన్నీ స్పందిస్తూ.. ‘‘టెన్షన్‌గా ఉంది మచా.. గేమ్‌కు దగ్గర్లో ఉన్నాం. ఇంకో వారం మచా.. ఇది ఎట్లాగైనా గెలవాలి. ఇది నా డ్రీమ్. మా అమ్మకు కప్పిస్తా. ఏదైనా చేసి బరాబర్ 100 పర్శంట్ ఇస్తా’’ అని అన్నాడు.
జెస్సీ కొట్టేవాడేమో..: సిరితో షన్ను మాట్లాడుతూ.. ‘‘అందరికీ క్లియర్ చేసుకోవల్సింది ఏమిటంటే.. నీకు దెబ్బ తగిలిన తర్వాత ఒకరి కోసం ఒకరం ఉన్నాం. మిగతా హౌస్‌మేట్స్ ఎవరినీ పట్టించుకోకుండా నిన్నే చూసుకుంటున్నా. అదెలా కంటిన్యూ అయిపోతాం కదా. బ్యాక్ టూ గేమ్‌లోకి వచ్చేయాలనే ఆలోచనలో ఉండం కదా. ఏది ఏమైనా అది మన మంచికే’’ అని అన్నాడు. షన్ను, సిరి మాట్లాడుతూ.. ‘‘జెస్సీగాడు మాకు రాడ్ వేసేశాడు. కొట్టడం ఒక్కటే లేటు. వాడు మాకు హింట్ ఇచ్చాడు’’ అని అన్నాడు. దీంతో శ్రీరామ్.. ‘‘14వ వారాల తర్వాత హింట్ ఏమిటీ బ్రో.. 2వ వారం నుంచే హింటు ఇస్తూనే ఉన్నారు. చూసుకుందాంలే అని పట్టించుకోలేదు’’ అని శ్రీరామ్ అన్నాడు.
సన్నీ చైనీస్.. సిరి ఇంగ్లీష్: 99వ రోజు మార్నింగ్.. షన్ను, మానస్, శ్రీరామ్ మద్య సరదా సంభాషణ జరిగింది. శ్రీరామ్, షన్ను.. చైనా, థాయ్ భాషల్లో మాట్లాడుకుంటూ ఫన్ నింపారు. సిరి అకస్మాత్తుగా.. ఇంట్లో 60 ఎగ్స్ ఉన్నాయ్.. రెండేసి గుడ్లతో ఆమ్లేట్ వేసుకుందామని ఇంగ్లీష్‌లో చెప్పడంతో సన్నీ, శ్రీరామ్ సెటైర్లు వేశారు. ఆ తర్వాత బిగ్ బాస్.. శ్రీరామ్‌ను మాత్రమే గార్డెన్ ఏరియాలోకి రావాలని ఆహ్వానించాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్‌లో స్వీట్ జర్నీని చూపించాడు. అవన్నీ చూసి శ్రీరామ చంద్ర ఆనందంలో మునిగిపోయాడు. అక్కడ ఐస్ టాస్క్ సంబంధించిన వస్తువులు చూసి.. జీవితంలో ఆ టాస్క్‌ను మరిచిపోలేనని శ్రీరామ్ అన్నాడు.
అప్పుడు పాటతో.. ఇప్పుడు మనసుతో దగ్గరయ్యారు: ‘‘ఎంతోమంది మనసులకు నీ గొంతు ఎంతో దగ్గర. ఈ సారి మీ మనసును వారికి పరిచయం చేయడానికి బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. మీ పాటే కాకుండ మీ మాటతో ఆటతో లక్షలమందిని పలకరించే అవకాశం బిగ్ బాస్ ఇల్లు ఇచ్చింది. ఇందులో నూరు శాతం విజయం సాధించారు. మీకు లభించే ప్రేమే అందుకు సాక్షి. మీ ప్రయాణం ఒకో గాయకుడిగా మొదలై.. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని ఇతర సభ్యులకు మీరు దగ్గరయ్యారు. మీరు మీ స్నేహితుల కోసం నిలబడిన తీరు ప్రపంచానికి కొత్త శ్రీరామ్‌ను గుర్తుచేశాయ్. ఎంతమంది మిమ్మల్ని లోన్ రేంజర్ అన్నా.. మీరు వన్ మ్యాన్ ఆర్మీలా మీరు మీ లక్ష్యం వైపు వెళ్లారు’’ అని బిగ్ బాస్ తెలిపాడు. అనంతరం బిగ్ బాస్ ఇంట్లో శ్రీరామ్ ప్రయాణాన్ని చూపించారు. శ్రీరామ్ తన చెల్లితో ఉన్న చిత్రాన్ని తన వెంట తీసుకెళ్లడానికి సెలక్ట్ చేసుకున్నాడు.
Also Read: ‘ఏం చేస్తాడో చెయ్యనివ్వండి..’ షన్ముఖ్‌పై దీప్తి సునైనా కామెంట్స్
మనసు.. తెలివిని.. ఉపయోగించి ఆడారు: ‘‘మానస్.. అమ్మ ముద్దుల కొడుకుగా. మమాస్ బాయ్‌గా ఇంట్లో అడుగు పెట్టారు. ఇంట్లోకి మీరు అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మీరున్న ప్రపంచం మీకు కొత్తదైనా, చూట్టూ ఉన్న మనుషులు కొత్తవారైనా.. మీ ఓర్పు అందరినీ అర్థం చేసుకొనే తత్వం. మీకు ఈ ఇంట్లో ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చాయి. స్నేహానికి మీరిచ్చే విలువ వారి కోసం ఆఖరి వరకు మీరు నిలబడిన తీరు ప్రతి ఒక్కరి గుండెని హత్తుకుంది. మీ గుండె చప్పుడు కొందరికి ప్రశాంతత తీసుకొస్తే.. మీ భుజం ప్రతి ఒక్కరు తమ మనసులోని భావాలను మీతో పంచుకొని మనసు తేలిక పరుచుకొనే చోటుగా మారింది. ఈ ఇంట్లో మీకు ఎన్నో కొత్త బంధాలు ఏర్పడ్డాయి. ప్రతి బంధాన్ని ఎంతో హూందంగా ధరించారు. మనసు నొప్పించకుండా.. విషయం అర్థమయ్యేలా సున్నితంగా చెప్పడమైనా.. అవసరమొచ్చినప్పుడు గొంతెత్తి నిలదీయడమైనా మీకే చెల్లింది. సమయం వచ్చినప్పుడు మీలోని తుఫాన్‌ను బయటకు తెచ్చి.. ప్రతి టాస్కులో కేవలం మీ కోసమే కాకుండా.. మీ వద్దకు సాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరి కోసం చివరి క్షణం వరకు నిస్వార్థంగా పోరాడారు. కొందరు తెలివితో ఆడతారు కొందరు మనసుతో ఆడతారు. మనసు, తెలివి.. రెండిటినీ సమంగా ఉపయోగించి ఆడటం మీతోనే సాధ్యం. అదే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఎంతోమందికి దగ్గర చేసింది’’ అని బిగ్ బాస్ తెలిపాడు. అనంతరం బిగ్ బాస్‌లో మానస్ జర్నినీ చూపించాడు. అమ్మతో ఉన్న ఫొటో, సన్నీతో ఉన్న ఫొటోలను శ్రీరామ్ తనతో తీసుకెళ్లాడు. ఈ ఎపిసోడ్‌లో మానస్, శ్రీరామ్‌ల జర్నీ మాత్రమే బిగ్ బాస్ చూపించాడు. సిరి, షన్ముఖ్, సన్నీల జర్నీని రేపటి ఎపిసోడ్‌లో చూపించే అవకాశం ఉంది.
Also Read: మాకు లేవా మనోభావాలు.. సమంత స్పెషల్ సాంగ్ పై పురుషుల సంఘం కేసు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Naga Panchami Today Episode మోక్ష కంటే ముందు తానే చనిపోవాలని నిర్ణయించుకున్న పంచమి!
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
Bigg Boss 7 Telugu: శోభాను కాలితో తన్నిన అమర్దీప్ - ఓట్లపై మోనిత ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రియాంకతో వాదన
Bigg Boss 17: ‘బిగ్ బాస్’లో ముద్దులు పెట్టుకున్న కంటెస్టెంట్స్, రాత్రయితే రచ్చే - తిట్టిపోస్తున్న జనం
Rajashekar : జీవిత, జీవితం రెండు ఒక్కటే అనేది డైలాగ్ మాత్రమే - బయట వేరేవిధంగా ఉంటుంది: రాజశేఖర్
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో - ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?
/body>