Shanmukh: ‘ఏం చేస్తాడో చెయ్యనివ్వండి..’ షన్ముఖ్‌పై దీప్తి సునైనా కామెంట్స్

బిగ్ బాస్‌ సీజన్ 5లో టాప్-5లోకి చేరిన షన్ముఖ్ జస్వంత్ గురించి అతడి గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునైనా తొలిసారి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది.

FOLLOW US: 

‘బిగ్‌బాస్  సీజన్ 5’ ముగింపు దశకు వచ్చేసింది. వచ్చే వారం విజేత ఎవరో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. వీరిలో ఐదుగురికి ఐదుగురు జనం మెచ్చినవారే. ఈ ఐదుగురిలో సిరి కాస్త వీక్‌గా కనిపించినా.. టాస్కుల్లో గెలిచేందుకు ఆమె చూపించే పట్టుదల ప్రేక్షకులకు నచ్చింది. అయితే, ఈ టాప్-5లో ప్రధాన పోటీ సన్నీ, షన్ముఖ్ మధ్యే ఉన్నట్లు తెలుస్తోంది. లక్ బాగుంటే.. శ్రీరామ చంద్ర కూడా వారికి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. వాస్తవానికి షన్ను ‘బిగ్ బాస్’లోకి అడుగు పెట్టేప్పుడే విజేత అతడే అని చాలామంది తెల్చేశారు. కానీ, చివరికి వచ్చే సరికి లెక్కలు తప్పాయి. కొంతమందికి షన్ను తీరు నచ్చలేదు. సిరితో ‘అతి’ స్నేహం అతడి గేమ్ ప్లాన్‌ను అటూ ఇటూ చేసింది. కాజల్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ‘‘మీకు హగ్గులిచ్చేవారే అర్హుల్లా కనిపిస్తారా’’ అంటూ పలువురు మండిపడ్డారు కూడా. 

అయితే.. తాను ఎలా ఉండాలో అలాగే ఉండాలని షన్ను అనుకున్నాడు. తన క్యారెక్టర్ ఇంతేనని చూపించాడు. అక్కడక్కడ షన్ను సైకోనా? అనేలా కూడా ప్రవర్తించాడు. అయితే, ఇప్పుడు షన్ను టాప్‌-5లోకి వచ్చేశాడు. ఇప్పటివరకు పడిన ఓట్లు ఓ లెక్క.. ఈ వారం రోజులు పడే ఓట్లు మరోలెక్క. కాబట్టి.. ఈ వారం షన్ను హౌస్‌లో అందరితో కలిసిపోయి అలరిస్తే.. తప్పకుండా టఫ్ ఫైట్ ఉంటుంది. అయితే, సాధారణ ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న సన్నీకి కాజల్ ఓట్లు కూడా తోడు కానున్నాయి. కాబట్టి.. షన్ను అంత ఈజీగా విన్నర్ కాలేడేమో అనిపిస్తోంది. పైగా.. అతడిపై బయట నెగటివ్ ప్రచారం బాగా నడుస్తోంది. అది ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు తాజాగా షన్న గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునైనా చేసిన ఈ వ్యాఖ్యలే నిదర్శనం. 

Also Read: పెళ్లిలో ‘అతి’.. అంత ఎత్తు నుంచి కిందపడిన వధువరులు, వీడియో వైరల్

షన్ను గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా చేయని దీప్తి సునైనా తొలిసారి అతడి ఫొటోను పెట్టి.. స్పందించింది. ఈ సందర్భంగా అతడిపై నెగటివ్ ప్రచారం చేస్తున్న వ్యక్తులపై ఆ అసహనం వ్యక్తం చేసింది. ‘‘బిగ్ బాస్ చూసి ఒక వ్యక్తి క్యారెక్టర్‌ను డిసైడ్ చేయకండి. అది కేవలం ఒక షో మాత్రమేనని గుర్తుంచుకోండి. అతడు చాలా మంచి వ్యక్తి. అతడు ఏం చేయాలని అనుకుంటున్నాడో అది చేయనివ్వండి. అతడినే నిర్ణయించుకోనివ్వండి. మీ ఎక్స్‌పెక్టేషన్లను అతడు అందుకోవాలని ఎక్స్‌పెక్ట్ చేయకండి. మీకు నచ్చినట్లు కాకుండా వాడికి నిచ్చినట్టు ఉండనివ్వండి. అతడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఎవరూ ద్వేషాన్ని కోరుకోరు. ప్లీజ్.. మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేయండి. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ నా సపోర్ట్ షన్ముఖ్‌కే. అతడిని నేను సంతోషంగా చూడాలని అనుకుంటున్నా’’ అని దీప్తి పేర్కొంది. 

View this post on Instagram
 
A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina)

Also Read: కోతి నోటిలో నోరు పెట్టి.. ఊపిరి పోశాడు.. చచ్చి బతికిన వానరుడు!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Published at : 13 Dec 2021 09:19 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 Deepthi Sunaina Shanmukh jaswanth బిగ్ బాస్ 5 తెలుగు బిగ్ బాస్ 5 Bigg Boss 5 Telugu finalists షన్ముఖ్ జస్వంత్

సంబంధిత కథనాలు

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్

Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు  అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ

Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

RR Vs CSK: మెరుపు ఆరంభం లభించినా తడబడ్డ చెన్నై - రాజస్తాన్ లక్ష్యం ఎంతంటే?

RR Vs CSK: మెరుపు ఆరంభం లభించినా తడబడ్డ చెన్నై - రాజస్తాన్ లక్ష్యం ఎంతంటే?

MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు

MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు

Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్

Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్

Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !

Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !