(Source: ECI/ABP News/ABP Majha)
Monkey Viral Video: కోతి నోటిలో నోరు పెట్టి.. ఊపిరి పోశాడు.. చచ్చి బతికిన వానరుడు!
చలనం లేకుండా రోడ్డుపై పడివున్న ఆ కోతిని చూసి అతడి మనసు చలించిపోయింది. వెంటనే దాన్ని ఒడిలో పెట్టుకుని ఊపిరి ఊది ప్రాణం పోశాడు.
తోటి మనిషి ప్రాణం కోసం విలవిల్లాడుతుంటే.. వీడియోలు, ఫొటోలు తీస్తూ ఆనందించే రోజులివి. అలాంటిది ఆ వ్యక్తి రోడ్డుపై నిర్జీవంగా పడివున్న కోతిని చూసి చలించిపోయాడు. వెంటనే దాని ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించాడు. జంతువు కదా.. దాని నోట్లో నోరు పెడితే ప్రమాదం ఏమో.. అని ఆలోచించలేదు. తనకు తెలిసిన వైద్యాన్ని దానికి అందించాడు. చనిపోయిందని అనుకున్న ఆ కోతి ప్రాణాలను నిలిపాడు.
తమిళనాడులోని పెరంబలుర్‌లో ఓ కోతిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో కోతి చలనం లేకుండా పడి ఉంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కార్ డ్రైవర్ ఎం.ప్రభు.. ఆ కోతిని చూసి చలించిపోయాడు. వెంటనే దాన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ, దాని పల్స్ పడిపోతున్నట్లు తెలుసుకుని.. వెంటనే ప్రథమ చికిత్స అందించాలని నిర్ణయించుకున్నాడు. ఆ కోతిని తన ఒడిలోకి తీసుకుని.. దాని నోటిలో తన నోరు పెట్టి ఊపిరి ఊదాడు. ఆ తర్వాత దాని ఛాతి మీద ఒత్తుతూ.. సీపీఆర్ చేశాడు. (చనిపోయిన వెంటనే పది నిమిషాల లోపు ఛాతి మీద రెండు చేతులతో ఒత్తడం ద్వారా తిరిగి ప్రాణాలు పోసే అవకాశం ఉంటుంది. దాన్నే సీపీఆర్.. అని అంటారు). దీంతో ఆ కోతి ఊపిరి పీల్చుకుంది. ఆ వెంటనే ప్రభు స్థానిక ప్రభుత్వ వెటర్నరీ ఆఫీసుకు తరలించారు.
తిరుసెల్వమ్ అనే వ్యక్తి ట్వీట్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. నెటిజనులు ప్రభును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తన పేరుకు తగినట్లే.. ప్రభు ఆ కోతికి ప్రాణం పోసి దేవుడయ్యాడని అంటున్నారు. ఈ వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు. ఆ కోతి ప్రాణాలను కాపాడిన తర్వాత అతడిలో కనిపించిన ఆనందాన్ని చూస్తే.. ప్రభుకు సెల్యూట్ కూడా చేస్తారు.
వీడియో:
A 38-year-old man from #Perambalur tried to resuscitate a wounded monkey by breathing into its mouth. @NewIndianXpress @xpresstn #humanitywithheart pic.twitter.com/iRMTNkl8Pn
— Thiruselvam (@Thiruselvamts) December 12, 2021
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి