(Source: ECI/ABP News/ABP Majha)
పెళ్లిలో ‘అతి’.. అంత ఎత్తు నుంచి కిందపడిన వధువరులు, వీడియో వైరల్
పెళ్లిలో వధువరులు సాహసం చేస్తే.. ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుంది. కాబ్టటి.. పెళ్లిలో ఇలాంటి విన్యాసాలు చేయకండి.
ఈ రోజుల్లో పెళ్లంటే.. గుణశేఖర్ సెట్ అంత ఉండాలి. లేకపోతే.. అది అసలు పెళ్లే కాదు. ఆకాశాన్ని తాకేంత పందిరి లేకపోయినా.. ఆర్భాటాలు మాత్రం భారీగా ఉండాలి. ఆ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటారు. సెలబ్రిటీల పెళ్లికి ఏ మాత్రం తక్కువ కాకుండా పెళ్లి ఏర్పాట్లు ఉండాలని అనుకుంటారు. వారి ఆలోచనకు తగినట్లే ఇవెంట్ మేనేజర్లు కూడా.. భారీ సెట్టింగులతో కళ్లు జిగేల్ అనే మెరుపులతో పెళ్లిని పండగలా మార్చేస్తారు. సరికొత్త ఆలోచనలతో వధువరులను దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవదూతల్లా చూపించే ప్రయత్నం చేస్తారు. అయితే, ఒక్కోసారి ఆ ప్రయత్నాలు బెడిసి కొడుతూ ఉంటాయి. ప్రమాదాలకు దారి తీస్తాయి. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం.
చత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో కళ్లు చెదిరే సెట్టింగులతో పెళ్లి వేడుకను నిర్వహించారు. గుర్రపు బండ్లపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వధువరులను.. ఉయ్యాల లాంటి ప్లాట్‌ఫాం మీదకు ఎక్కించారు. ఆ తర్వాత వారిని పైకి ఎత్తారు. ఆ వెంటనే బాణాసంచాలను కాల్చారు. అయితే, వారి బరువుకు ఆ ఊయల ఆగలేదు. వరుడిపై ఉన్న తాడు తెగిపోవడంతో.. వధువరులిద్దరు అంత ఎత్తు నుంచి కిందపడిపోయారు. ఈ ఆకస్మిక ప్రమాదానికి షాకైన వారి కుటుంబికులు, అతిథులు భయంతో కేకలు పెడుతూ.. స్టేజ్ మీదకు ఎక్కారు. లక్కీగా వధువరులిద్దరు చిన్న గాయాలతో తప్పించుకున్నారు. తమ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వారికి క్షమాపణలు తెలియజేసింది. 30 నిమిషాల తర్వాత వివాహ వేడుకను కొనసాగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘‘పెళ్లి చేసుకోండి.. కానీ, సాహసాలు చేయకండి’’ అని హెచ్చరిస్తున్నారు. లేనిపోని ఆర్భటాలు, అత్యుత్సాహానికి పోయి.. ఇలాంటి స్టంట్లు చేయొద్దని మరికొందరు అంటున్నారు. ఈ వీడియో చూసి మీ అభిప్రాయం కూడా చెప్పండి.
వీడియో:
Unfortunate accident at Raipur Wedding yesterday.
— Amandeep Singh 💙 (@amandeep14) December 12, 2021
Thank God all are safe.
source : https://t.co/yal9Wzqt2f pic.twitter.com/ehgu4PTO8f
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి