By: ABP Desam | Updated at : 16 Sep 2021 02:27 PM (IST)
Image Credit: Star Maa/Hotstar
హింసాత్మకంగా మారిన ‘బిగ్ బాస్’ హౌస్‌లో ప్రేమను నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంట్లో లవ్ ట్రాక్ క్రియేట్ చేయడానికి కష్టపడుతున్న కాజల్ ఈ సారి.. హమీద, షన్నులను కలిపేందుకు ఓ సరదా ప్రయత్నం చేస్తున్నట్లు తాజా ప్రోమో ద్వారా తెలుస్తోంది. అంతేకాదు.. షన్ను పుట్టిన రోజు సందర్భంగా బిగ్ బాస్.. ఇప్పటివరకు ఏ హౌస్ మేట్‌కు ఇవ్వని బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు చూపించారు.
నిన్నటివరకు తన్నుకుంటూ.. తిట్టుకుంటూ.. బిగ్ బాస్ హౌస్ కంటే చేపల మార్కెట్ బెటర్ అనిపించేలా ప్రవర్తించిన కంటెస్టులు ఈ రోజు కాస్త కుదురుగా ఉన్నట్లు కనిపిస్తోంది. గురువారం విడుదల చేసిన ప్రోమోలో కాజల్.. షణ్ముఖ్ జస్వంత్‌ను ఇంటర్వ్యూ చేస్తూ కనిపించింది. హమీదాలో నీకు నచ్చే మూడు క్వాలిటీలు చెప్పు అని అడిగింది. మరి ఇందుకు షన్ను ‘షీ ఈజ్ హార్డ్’ అని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఎడిటింగ్ వీడియో కావడం వల్ల ఆ సమాధానం హమీదా కోసం చెప్పిందా కాదా అనేది తెలియరాలేదు.
Also Read: నాడు కమల్ హాసన్‌పై విమర్శలు.. నేడు అంతా ఆయన బాటే, ఓటీటీలో సినిమాలు.. థియేటర్లకు ముప్పు?
బయట దీప్తి.. ఇంట్లో హమీద: ఈ రోజు ఇంట్లో హమీదా, షన్ను, రవి, కాజల్ మధ్య సరదా సంభాషణ జరగనున్నట్లు ప్రోమోలో చూపించారు. షన్నుకు హమీదాకు మధ్య లవ్ ట్రాక్ నడిపేందుకు రవి.. SD (షన్ను - దీప్తి) అక్షరాలతో ఉన్న షన్ను పిల్లలో H (హమీదా) కూడా చేర్చి.. SDH అని మార్చాలని షణ్ముఖ్‌తో అన్నాడు. హమీదా కూడా ఇంట్లో ఉన్నన్ని రోజులు SH (షన్ను - హమీద), బయటకు వెళ్లిన తర్వాత SD చేసుకో అంటూ హమీదా చెప్పడంతో ఒక్కసారే నవ్వులు విరిశాయి. హమీదా షన్ను.. ‘‘రా.. చేయి పట్టుకో’’ అనడం, అది చూసి లహరీ ‘‘దీప్తీ ఇక్కడ కూడా ఒక కన్నేసి ఉంచండి’’ అనడం ఫన్నీగా ఉంది. షణ్ముఖ్ పుట్టిన రోజు సందర్భంగా బిగ్ బాస్ దీప్తి వీడియో మెసేజ్‌ను అందించాడు. ఈ సందర్భంగా దీప్తి షన్నుకు ‘ఐ లవ్ యు’ చెప్పి.. సందేహాలను పటాపంచలు చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ బయట బాణాసంచాలను కాల్చుతూ షన్నుకు గ్రాండ్‌గా విసెష్ చెప్పాడు.
‘బిగ్ బాస్ 5’ ప్రోమో:
Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!
Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకీ, వరుణ్ చిందులు - ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాల’ సాంగ్ రిలీజ్
O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!
Gold Silver Price Today 18th May 2022 : గోల్డ్ ప్రియులకు షాకింగ్ న్యూస్, నేడు భారీగా పెరిగిన బంగారం రేట్స్, స్వల్పంగా పెరిగిన వెండి
Fat Removal Surgery: కొవ్వును కరిగించే లైపోసక్షన్ ఆపరేషన్ ఎలా చేస్తారు? అది ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది?
Weather Updates : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
Horoscope Today 18th May 2022: ఈ రాశివారు పనితీరు మార్చుకోకుంటే ఇబ్బందులు తప్పవ్, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి