Punarnavi Bhupalam: పిచ్చి ప్రశ్న వేసిన నెటిజన్, ఊహించని సమాధానం చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాళం ఏ విషయాన్ని అయినా ముఖం మీదే చెప్పేస్తుంది. తాజాగా ఓ నెటిజన్ నుంచి ఎదురైన ప్రశ్నకు అంతే సూటిగా సమాధానం చెప్పింది.
పునర్నవి భూపాళం.. కొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు సినిమాల్లో నటించినా రాని పాపులారిటీ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్-3లో కంటెస్టెంట్ గా బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. చక్కగా తన గేమ్ ఆడుతూనే.. ఓపెన్ మాట్లాడేది. ఎవరో ఏదో అనుకుంటారని మోహమాటపడేది కాదు. తను అనుకున్నదే బయటకు చెప్పేది. ఈ షో అనంతరం తనకు పలు సినిమాల్లో అవకాశం వచ్చినా.. వాటన్నింటికీ నో చెప్పింది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లండన్ లో చదువుతోంది. సైకాలజీలో మాస్టర్స్ చేస్తున్నది. తెలుగు నాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పునర్నవి.. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటిస్తుంది. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్తుంది. తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టాలో లైవ్ లోకి వచ్చింది. లండన్ లోని పలు విషయాలను వెల్లడించింది. అదే సమయంలో నెటిజన్లు ఆమెను రకరకాల ప్రశ్నలు అడిగారు. మీరు ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నారా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. అవును.. అని సమాధానం చెప్పింది. వెంటనే మరో నెటిజన్ .. మీరు వర్జినా? అని క్వశ్చన్ చేశాడు. ఏమాత్రం ఆలోచించకుండా.. ఇలాంటి ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నా అంటూ.. ఆన్సర్ చెప్పింది. ప్రస్తుతం ఆమె చేసిన చిట్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
బిగ్ బాస్ సీజన్-3 హౌస్ నుంచి బయటకు వచ్చిన ఈ అమ్మడు.. అదే సీజన్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి కొద్దిరోజులు సందడి చేసింది. వారి అన్యోన్యత చూసి ప్రేమలో ఉన్నారని అందరూ భావించారు. కానీ, ఆ తర్వాత.. తాము ప్రేమలో లేమని వెల్లడించారు. అనంతరం పునర్నవి ‘కమిట్ మెంటల్’ అనే వెబ్ సిరీస్ చేసింది. జనాలను బాగానే ఆకట్టుకుంది. అదే సమయంలో ఆ వెబ్ సిరీస్ లో ఉన్న హీరో ఉద్భవ్ రఘునందన్ తో ప్రేమలో ఉన్నట్లు.. ఇద్దరికీ నిశ్చితార్థం జరిగినట్లు కలరింగ్ ఇచ్చింది. చివరకు అదంతా ‘కమిట్ మెంటల్’ వెబ్ సిరీస్ ప్రమోషన్ అంటూ పే..ద్ద.. ట్విస్ట్ ఇచ్చింది పునర్నవి. ఆ తర్వాత సినిమాలు, సిరీస్ లు చేయకుండా చదువులకే పరిమితం అయ్యింది. అప్పుడప్పుడు నెటిజన్లతో టచ్ లో ఉంటుంది.
అటు పునర్నవి పలు సినిమాల్లో నటించింది. ‘ఉయ్యాల జంపాల’ మూవీతో వెండి తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘ఎందుకు ఏమో’, ‘సైకిల్’, ‘చిన్న విరామం’ సినిమాల్లో నటించింది. ఈ సినిమాలు ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ షోకు వెళ్లి మంచి పాపులారిటీ సంపాదించింది. చదువు పూర్తయ్యాక ఇండియాకు వచ్చి.. మళ్లీ సినిమా రంగంలోకి అడుగు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
View this post on Instagram
Also Read : ఎన్టీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్న సకల అస్త్రాలకు అధిపతి