అన్వేషించండి

Bichagadu 2: నేల విడిచి సాము చేస్తున్నారా? - బిచ్చగాడు 2 ట్రైలర్ లాంచ్ - పూర్తిగా మార్చేశారా?

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన బిచ్చగాడు 2 ట్రైలర్‌ను విడుదల చేశారు.

Bichagadu 2: 2016 సంవత్సరంలో వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ తెలుగులో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. కానీ ఆ తర్వాత ఫెయిల్యూర్‌లతో స్టార్‌డం మెల్లగా తరుగుతూ పోయింది. ఇప్పుడు ‘బిచ్చగాడు 2’ సినిమాతో మరోసారి విజయ్ ఆంటోనీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ‘స్నీక్ పీక్ ట్రైలర్’ను విడుదల చేశారు. ఇందులో ఈ సినిమా కాన్సెప్ట్‌ను రివీల్ చేశారు.

రక్తం, శరీరంలోని ఇతర అవయవాలు మార్చినట్లు మెదడును కూడా ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుందని ఒక శాస్త్రవేత్త ఈ ట్రైలర్‌లో చెబుతారు. ఆయనకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటారు. ఐజక్ న్యూటన్, మహాత్మా గాంధీ, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి మేధావులను మరింత ఎక్కువ కాలం బతికించవచ్చని శాస్త్రవేత్త తెలుపుతారు. మంచి వాళ్లు ఎక్కువ కాలం బతికితే ఓకే, హిట్లర్ వంటి చెడ్డవారు, నియంతలు ఎక్కువ కాలం బతికితే ప్రజలకు నష్టం కదా అని ఎదురుగా కూర్చుని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అంటారు. ఈ ఇంటర్వ్యూ మొత్తాన్ని దేవ్ గిల్ (మగధీర సినిమాలో విలన్) ఇంట్లో కూర్చుని చూస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ట్రైలర్‌ను క్లోజ్ చేశారు.

ట్రైలర్‌లో విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖర్చుకు వెనకాడకుండా ఒక పెద్ద హీరో సినిమా మీద పెట్టినంత ఖర్చు ఈ సినిమా మీద పెట్టినట్లు విజువల్స్ చూసి చెప్పేయవచ్చు. లావిష్ బిల్డింగ్‌లు, ఫారిన్ లొకేషన్లతో చూడటానికి విజువల్ ట్రీట్‌లా ఉంది. 2023 సమ్మర్ సీజన్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కాన్సెప్ట్‌తో సినిమాలు మనకు కొత్తేమీ కాదు. 2019లో పూరి కమ్‌బ్యాక్ బ్లాక్‌బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ కాన్సెప్ట్ కూడా ఇదే. ఇక హాలీవుడ్‌లో కూడా దీనిపై కోకొల్లలుగా సినిమాలు వచ్చాయి. మరి ‘బిచ్చగాడు 2’ ప్రత్యేకత ఏంటో మరింత కంటెంట్ వస్తే కానీ చెప్పలేం. ‘బిచ్చగాడు’ సినిమాలో మదర్ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం అదే. కానీ సీక్వెల్‌లో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటూ నేల విడిచి సాము చేస్తున్నారు. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఉందా? లేకపోతే పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ రూట్ తీసుకుందా? తెలియాలంటే సమ్మర్ వరకు ఆగాల్సిందే.

‘బిచ్చగాడు-2’ షూటింగ్ గత షెడ్యూలు మలేషియాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విజయ్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. దీంతో హుటాహుటిన విజయ్‌ను కౌలలాంపూర్ హాస్పిటల్‌కు తరలించారు. 

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘బిచ్చగాడు-2’ షూటింగ్‌లో భాగంగా నీటిలో ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా విజయ్ ఆంటోని వాటర్ బోటును నడుపుతున్నాడు. వేగంగా వెళ్తున్న బోటు ఒక్కసారే అదుపు తప్పింది. నేరుగా వెళ్లి కెమేరా సిబ్బందితో వెళ్తున్న పెద్ద బోటును ఢీకొట్టింది. దీంతో విజయ్‌కు గాయాలయ్యాయి. వెంటనే అతడిని హుటాహుటిన ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆయన గాయాల నుంచి వేగంగానే కోలుకున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Vidudala OTT: డిసెంబర్ 20న విజయ్ సేతుపతి ‘విడుదల 2’... ఓటీటీలో ఫ్రీగా ప్రీక్వెల్ చూసేయండి - ఎందులోనో తెలుసా?
డిసెంబర్ 20న విజయ్ సేతుపతి ‘విడుదల 2’... ఓటీటీలో ఫ్రీగా ప్రీక్వెల్ చూసేయండి - ఎందులోనో తెలుసా?
Look Back 2024: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
Embed widget