By: ABP Desam | Updated at : 16 Dec 2022 08:40 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Prakash Raj and Pathan/Instagram
నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా యాక్టీవ్‌గా ఉంటున్నారు. #JustAsking హ్యాష్ ట్యాగ్‌తో రాజకీయ పార్టీలపై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విధివిధానాలకు వ్యతిరేకంగా ఆయన రియాక్ట్ అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమాలో ‘బేషరమ్ రంగ్’ అనే పాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా సన్నివేశాలు ఉన్నాయని ఆ సినిమాను నిషేధించాలంటూ హిందూ సంఘాలు మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో నిరసనకు దిగాయి. అంతే కాదు షారుక్ ఖాన్ దిష్టి బొమ్మను కూడా దహనం చేశారు. ఈ సినిమాపై అక్కడి ప్రభుత్వం కూడా సీరియస్ అయింది.
అయితే తాజాగా ఈ వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. ‘‘కాషాయం ధరించి రేపిస్టులను సత్కరిస్తే, ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే తప్పులేదు. బ్రోకర్ ఎమ్మెల్యేలు, కాషాయ స్వామీజీలు మైనర్లపై అత్యాచారం చేసినా పట్టదు. కానీ ఒక సినిమాలో ఆ డ్రెస్ ధరించకూడదా?’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రకాష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అటు రాజకీయంగానూ చర్చనీయాంశమైంది.
#Besharam BIGOTS.. So it’s okay when Saffron clad men garland rapists..give hate speech, broker MLAs, a Saffron clad swamiji rapes Minors, But not a DRESS in a film ?? #justasking
— Prakash Raj (@prakashraaj) December 15, 2022
….Protesters Burn Effigies Of SRK In Indore. Their Demand: Ban 'Pathaan' https://t.co/00Wa982IU4
కాగా నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీపై ఇలా ఫైర్ అవ్వడం మొదటిసారి కాదు. అంతకు ముందు తమిళ హీరో విశాల్ విషయంలోనూ ప్రకాశ్ రాజ్ ఇలాగే స్పందించారు. గతంలో విశాల్ కాశీ సందర్శించారు. అయితే అక్కడ సౌకర్యాలు బాగున్నాయని, ఏర్పాట్లు బాగా చేశారని, దర్శనం సులభంగా జరుగుతుంది. మోడీజీ హ్యాట్స్ ఆఫ్ అంటూ ట్వీట్ చేశారు. విశాల్ ట్వీట్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్ గా ‘షాట్ ఓకే నెక్ట్స్ ఏంటీ’ అన్నట్టుగా రీట్వీట్ చేశారు. దీంతో ఆ ట్వీట్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. అయితే దానిపై హీరో విశాల్ స్పందించలేదు. మళ్లీ ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ‘పఠాన్’ సినిమాకు మద్దతుగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కొత్త చర్చలకు తెరతీసింది. మరి ఈ వివాదం ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
మరోవైపు ‘పఠాన్’ సినిమాపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. ‘పఠాన్’ ట్రైలర్ పై నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది. ఈ సినిమా హాలీవుడ్ వార్ అండ్ మార్వెల్స్ కు కాపీ లా ఉందని ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్. ఒకానొక సమయంలో ఈ మూవీను బ్యాన్ చేయాలంటూ కూడా కామెంట్లు వచ్చాయి. తర్వాత ‘బేషరమ్ రంగ్’ పాటపై కూడా ఇదే రీతిలో మిశ్రమ స్పందన వస్తోంది. ఈ పాటలో షారుక్-దీపికా కెమిస్ట్రీ బాగుందని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది సినిమా పబ్లిసిటీ కోసం మరీ ఇంత బోల్డ్ గా చేయాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ‘పఠాన్’ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : గోవిందా నామ్ మేరా రివ్యూ: కియారా అద్వానీ కొత్త ఓటీటీ సినిమా ఎలా ఉంది?
Nindu Noorella Saavasam November 29th Episode: చిత్రగుప్తుడి మాటలకు కంటతడి పెట్టుకున్న అరుంధతి.. మనోహరికి చీవాట్లు పెట్టిన అమరేంద్ర!
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Naga panchami November 28th Episode : నన్ను కాటేసి చంపేది నువ్వే.. పంచమికి షాక్ ఇచ్చిన మోక్ష!
Animal: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?
Krishna Mukunda Murari promo: కృష్ణని పేరు పెట్టి పిలిచిన మురారి.. గతం గుర్తుకురావడంతో టెన్షన్ పడుతున్న ముకుంద!
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
IND Vs AUS, Match Highlights: మాక్స్ వెల్ మెరుపు శతకం, మూడో టీ20లో టీమిండియాకు తప్పని ఓటమి
/body>