Bangarraju Movie: షూటింగ్ మొదలెట్టిన ''బంగార్రాజు'', ఈ సారి కూడా సంక్రాంతి బరిలో దిగడం ఫిక్సా..!
చాలా కాలంగా ఎదురుచూస్తున్న సస్పెన్స్‌కు చెక్ పెడుతూ 'బంగార్రాజు'' మూవీకి ఇటీవలే కొబ్బరి కాయ కొట్టిన నాగ్ అండ్ టీమ్...తాజాగా షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు.
మనం లాంటి ఫీల్ గుడ్ మూవీ తరువాత కింగ్ నాగార్జున, నాగచైతన్య కలిసి నటించబోతున్న సినిమా బంగార్రాజు. నాగార్జున-కృష్ణ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్ ఈసినిమా. ఇటీవలే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేయగా..ఇవాల్టి నుంచి షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈసినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుగుతోంది.
Our shoot begins…. The father & son multi-starrer on its way to entertain you! #SoggallaShootingBegins@iamnagarjuna @chay_akkineni @meramyakrishnan @IamKrithiShetty @kalyankrishna_k @anuprubens @ZeeStudios_ @lemonsprasad pic.twitter.com/7ycJ7WXimx
— Annapurna Studios (@AnnapurnaStdios) August 25, 2021
కాగా ఈసినిమాలో నాగార్జునకు జోడిగా రమ్యకృష్ణ..నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. ఈసినిమాను నాగార్జున తన హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మిస్తుండగా…అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. సోగ్గాడే చిన్నినాయన సినిమా సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అవడంతో ఈ మూవీని కూడా సంక్రాంతి బరిలోనే దింపాలనే యోనచలో ఉన్నారు. మరి సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలే లైన్ లో ఉండడంతో ఏ చేస్తారో చూడాలి.
Also Read: అప్పుడు బీచ్‌లో జలకన్యలా.. ఇప్పుడు దేవకన్యలా తళుకులీనుతున్న కృతిసనన్
సోగ్గాడే చిన్నినాయన సినిమాలో అమాయకంగా ఉండే కొడుకు కోసం తండ్రి పైనుంచి కిందకు వస్తే... ఇప్పుడు తాతను మించి అనిపించుకున్న మనవడిని కంట్రోల్ చేయడానికి బంగార్రాజు వస్తాడట. కళ్యాణ కృష్ణ తయారు చేసిన సినిమా స్క్రిప్ట్ సూపర్ గా వచ్చిందని, అందుకే నాగ్ ఇంతలా వెయిట్ చేసి మరీ స్టార్ట్ చేసాడని తెలుస్తోంది.
Also Read: ‘బిగ్‌బాస్-5’ బిగ్ అప్‌డేట్: క్వారంటైన్‌లో కంటెస్టెంట్లు.. టెలికాస్ట్ తేదీ ఇదేనా?
మరోవైపు నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా చేస్తూనే ఈసినిమా షూటింగ్ లో కూడా పాల్గొననున్నాడు. ఈసినిమాలో కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read: ఎవర్నీ బాధపెట్టాలని అనుకోలేదు.. వారికి నా క్షమాపణలు: సమంత
Also Read: సమంత కాలికి ఒకే చెప్పు.. సిండ్రెల్లాతో పోల్చుకున్న బ్యూటీ.. ఇంట్రెస్టింగ్ ఫొటో వైరల్
Also Read: మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్.. కొడుకు కోసం రాత్రికి రాత్రే..
Also Read: మెగాస్టార్‌తో మెహర్ రమేష్.. ఈ ఫ్లాప్ చిత్రాల దర్శకుడు ఈసారైనా హిట్ కొడతాడా?