Balakrishna - Unstoppable 2 Update : వేటకు సిద్ధమైన సింహం - ఈ నెల 14 నుంచి దెబ్బకు థింకింగ్ మారిపోవాలా!
Unstoppable With NBK Season 2 Update : నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ 2' షో గురించి ఆహా ఓటీటీ కొత్త అప్‌డేట్ ఇచ్చింది.
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులకు ఓ గుడ్ న్యూస్. అలాగే, ఓటీటీ వీక్షకులకు కూడా! తెలుగులో సూపర్ డూపర్ హిట్ టాక్ షో అంటే 'ఆహా' ఓటీటీలో వచ్చే 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' (Unstoppable with NBK) అని చెప్పాలి. బాలకృష్ణ హోస్ట్ చేసిన ఫస్ట్ సీజన్ భారీ వీక్షకాదరణ సొంతం చేసుకుంది. త్వరలో రెండో సీజన్ షురూ కానుంది. మరోసారి హోస్ట్‌గా బాలకృష్ణ సందడి చేయనున్నారు.
ఫస్ట్ ఎపిసోడ్ రెడీ...
స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
ఈ నెల (అక్టోబర్) 14న ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుందని 'ఆహా' ఓటీటీ తెలిపింది. ''ప్రశ్నల్లో మరింత ఫైర్! ఆటల్లో మరింత డేర్!! సరదాల్లో మరింత సెటైర్!!!మీకోసం... మరింత రంజుగా... అక్టోబర్ 14 నుంచి 'అన్‌స్టాపబుల్ 2' స్ట్రీమింగ్ కానుంది. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ ఆహాలో విడుదల కానుంది. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా!'' అని ఆహా ఓటీటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
View this post on Instagram
దీపావళికి చిరంజీవితో బాలయ్య?
'అన్‌స్టాపబుల్ 2'కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అతిథిగా రానున్నారని కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దీపావళికి చిరు అథితిగా వచ్చిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. రెండో సీజన్ ఆఖరి ఎపిసోడ్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas) అతిథులుగా రానున్నారని వినికిడి. ఇది ఎంతవరకు నిజమేది త్వరలో తెలుస్తుంది. ఆహా వర్గాలు అయితే అధికారికంగా ఏ విషయాన్నీ వెల్లడించలేదు.
యువ హీరోలతో బాలకృష్ణ సందడి!
Unstoppable 2 Guest List : 'అన్‌స్టాపబుల్ 2'లో ఒక ఎపిసోడ్‌లో యువ హీరోలు విశ్వక్ సేన్ (Vishwak Sen), సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) సందడి చేయనున్నారు. వీళ్ళిద్దరూ హీరోలు మాత్రమే కాదు... రచయితలు కూడా! సినిమాలో మాటలు, పాటలు రాస్తున్నారు. విశ్వక్ సేన్ 'ఫలక్ నుమా దాస్' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ రోజు (ఆదివారం) అన్నపూర్ణ స్టూడియోస్‌లో వాళ్ళిద్దర్నీ బాలకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయినట్టే!
ఇటీవల విజయవాడలో 'అన్‌స్టాపబుల్ 2' టీజర్ విడుదల చేశారు. అందులో బాలకృష్ణ లుక్ వీక్షకులను ఆకట్టుకుంది. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో ప్రశాంత్ వర్మ టీజర్ తెరకెక్కించారనే ప్రశంసలు వినిపించాయి.
Also Read : Kantara in Telugu : తెలుగులో 'కాంతారా' - అల్లు అరవింద్ చేతిలో 'కెజియఫ్' నిర్మాత సినిమా
ఆల్రెడీ 'అన్‌స్టాపబుల్ యాంథమ్' (Unstoppable Anthem) విడుదల చేశారు. 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2' టైటిల్ సాంగ్‌కు యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ (Mahati Swara Sagar) బాణీ అందించారు. యువ గాయకుడు, ర్యాపర్ రోల్ రైడ (Roll Rida) సాహిత్యం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు.
'తను ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంటా... డైలాగు వదిలితే మోగిపోద్ది బాడీ అంతా! మాటలు తప్పుకొని వెళ్ళలేవు రాంగ్ వే...' అంటూ రోల్ రైడ ర్యాప్ స్టైల్‌లో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇది నందమూరి అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Also Read : Anand Mahindra - NTR : కొత్త కారుకు ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న ఆనంద్ మహీంద్రా