News
News
X

Vishwak Sen Reply To Arjun : సైలెంట్‌గా విశ్వక్ సేన్ లీకులు - 'రాజయోగం' టీజర్ లాంచ్‌లో అర్జున్‌కు రిప్లై?

విశ్వక్ సేన్ తనతో, తన చిత్ర బృందంతో ప్రవర్తించిన తీరు ఏమాత్రం బాలేదని అర్జున్ సర్జా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. దానిపై విశ్వక్ సేన్ స్పందించలేదు కానీ తనకు రెస్పెక్ట్ ఇవ్వలేదని లీకులు ఇస్తున్నారట.

FOLLOW US: 
 
యువ కథానాయకుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) మీద అర్జున్ సర్జా (Arjun Sarja) తీవ్ర ఆరోపణలు చేశారు. అతనితో సినిమా చేయడం లేదని ప్రకటించారు. తన 40 ఏళ్ళ నట జీవితంలో విశ్వక్ సేన్ వంటి నటుడిని ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ విధంగా ఎవరి గురించి మాట్లాడలేదని చెప్పారు. వృత్తి పట్ల అతనికి నిబద్ధత లేదని తెలిపారు. దర్శక, నిర్మాతలు అంటే అతనికి మర్యాద లేదా? అని ప్రశ్నించారు.
 
అర్జున్ సర్జా ప్రెస్‌మీట్ పెట్టి మరీ విశ్వక్ సేన్ గురించి చెప్పడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది. యువ హీరోల ప్రవర్తనపై మరోసారి డిస్కషన్ మొదలు అయ్యింది. అయితే... అర్జున్ చేసిన ఆరోపణలపై ఇప్పటి వరకు విశ్వక్ సేన్ స్పందించలేదు. ఆదివారం సాయంత్రం 'రాజయోగం' సినిమా టీజర్ విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అందులో అర్జున్ చేసిన ఆరోపణలకు బదులు ఇవ్వనున్నట్టు తెలిసింది. అయితే... దాని కంటే ముందు తనకు రెస్పెక్ట్ ఇవ్వని కారణంగా ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టు సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం.
 
విశ్వక్ చెప్పిన మార్పులు చేయలేదు!?
మాటలు, పాటలు, సంగీతం విషయంలో విశ్వక్ సేన్ కొన్ని మార్పులు చేయమని అడిగారని... అయితే చిన్న మార్పు చేయడానికి కూడా అర్జున్ అంగీకరించలేదని, అసలు సినిమా సెట్స్‌లో రెస్పెక్ట్ లేదని, అందుకని వాకౌట్ చేయాలని అతడు డిసైడ్ అయ్యాడని విశ్వక్ సేన్ టీమ్ నుంచి లీకులు వచ్చాయి. తనకు సరైన గౌరవం లభించని చోటు తాను ఉండాలని విశ్వక్ సేన్ అనుకోవడం లేదని వారు పేర్కొన్నారట. 

Arjun Vs Vishwak Sen : అర్జున్ వర్సెస్ విశ్వక్ సేన్ వివాదం చూస్తే... మొత్తం అంతా 'రెస్పెక్ట్' చుట్టూ తిరుగుతోంది. విశ్వక్ సేన్ టీమ్ నుంచి 'హీరో చెప్పిన మార్పులు చేయలేదు' అని ఒక్క వెర్షన్ మాత్రమే వినబడుతోంది. కానీ, అక్కడ అర్జున్ చాలా విషయాలు చెప్పుకొచ్చారు.

Also Read : విశ్వక్ సేన్‌తో ఎప్పటికీ సినిమా చేయను - తెర వెనుక ఏం జరిగిందో వివరించిన అర్జున్
 
విశ్వక్ సేన్‌కు ప్రొఫెషనలిజం లేదని అర్జున్ అన్నారు. మార్నింగ్ షూటింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు క్యాన్సిల్ చేయమని మెసేజ్ వచ్చిందన్నారు. హీరో కోరడంతో రెండుసార్లు షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందన్నారు. ఇవన్నీ పెద్ద ఆరోపణలు. వీటికి విశ్వక్ సేన్ ఏం సమాధానం ఇస్తారనేది చూడాలి. 

తెలుగులో టాప్ రైటర్లలో ఒకరైన సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు, 'పుష్ప' సినిమాకు అద్భుతమైన సాహిత్యం అందించిన చంద్రబోస్ తమ సినిమాకు రాసిన పాటలు నచ్చలేదని విశ్వక్ సేన్ చెప్పాడని అర్జున్ వెల్లడించారు. స్క్రిప్ట్ డిస్కషన్ కోసం పిలిస్తే రాలేదన్నారు. విశ్వక్ టీమ్ నుంచి వస్తున్న వెర్షన్‌కు ఒక విధంగా అర్జున్ ముందుగా సమాధానం చెప్పినట్టు అయ్యింది.

News Reels

ఇంతకు ముందు రెండు మూడు సందర్భాల్లో తనపై విమర్శలు వచ్చినప్పుడు విశ్వక్ సేన్ ఆవేశంగా స్పందించిన దాఖలాలు ఉన్నాయి. మరి, ఇప్పుడు ఆయన ఏ విధంగా స్పందిస్తారో? అటు వైపు ఉన్నది సాధారణ దర్శకుడు, నిర్మాత కాదు! ఇండస్ట్రీలో 40 ఏళ్ళ నుంచి ఉంటున్న కథానాయకుడు. తెలుగులోనూ ఆయనకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో ఆయన పరిచయాలు, నటనలో అనుభవం పక్కన పెడితే... తన దగ్గర వాట్సాప్ చాటింగ్ ఉందని, సెలూన్ నుంచి మన సినిమా కోసం రెడీ అవుతన్నాని విశ్వక్ సేన్ పంపిన ఫోటోలు ఉన్నాయని అర్జున్ చెబుతున్నారు. ఇప్పుడు తనపై పడిన మచ్చను తొలగించుకోవాల్సిన అవసరం విశ్వక్ సేన్‌కు ఉంది.

Published at : 06 Nov 2022 10:47 AM (IST) Tags: arjun Vishwak sen Vishwak Reply To Arjun RaajahYogam Teaser launch

సంబంధిత కథనాలు

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్

Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

టాప్ స్టోరీస్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం  - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!