అన్వేషించండి

Arjun Sarja On Vishwak Sen : విశ్వక్ సేన్‌తో ఎప్పటికీ సినిమా చేయను - తెర వెనుక ఏం జరిగిందో వివరించిన అర్జున్

కథ నేరేట్ చేసినప్పుడు తనకు పిచ్చి పిచ్చిగా నచ్చిందని చెప్పిన విశ్వక్ సేన్... చెప్పిన టైమ్‌కు షూటింగ్‌కు రాలేదని, షెడ్యూల్స్ క్యాన్సిల్ చేశామని అర్జున్ తెలిపారు. విశ్వక్ ప్రవర్తన బాలేదన్నారు.

అర్జున్ సర్జా (Arjun Sarja) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన్ను 'యాక్షన్ కింగ్' అంటుంటారు. ఆయన హీరో మాత్రమే కాదు... దర్శకుడు, నిర్మాత. ఆయన దర్శకత్వంలో కుమార్తె ఐశ్వర్యను తెలుగుకు పరిచయం చేస్తూ...  విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమా స్టార్ట్ చేశారు. రెండు మూడు రోజులుగా ఈ ప్రాజెక్టుపై రూమర్స్ వినిపిస్తున్నాయి. సినిమా నుంచి హీరో తప్పుకొన్నారనే మాటలు వినిపించాయి. అసలు, తెర వెనుక ఏం జరిగిందో అర్జున్ వివరించారు.
 
మొదటి నుంచి విశ్వక్ సేన్ ప్రవర్తన బాలేదు : అర్జున్
కథ నేరేట్ చేసినప్పుడు తనకు పిచ్చి పిచ్చిగా నచ్చిందని విశ్వక్ సేన్ (Vishwak Sen) చెప్పారని అర్జున్ తెలిపారు. ఆ తర్వాత ఆయన తనను, తన చిత్ర బృందాన్ని చాలా ఇబ్బంది పెట్టారని యాక్షన్ కింగ్ పేర్కొన్నారు. విశ్వక్ సేన్ చెప్పిన టైమ్‌కు షూటింగ్‌కు రాలేదన్నారు. ఆయన ప్రవర్తన వల్ల రెండు సార్లు షెడ్యూల్స్ క్యాన్సిల్ చేశామన్నారు.

దర్శకుడిగా, నిర్మాతగా హార్ట్ అయ్యా!
కథ నేరేట్ చేసిన తర్వాత విశ్వక్ సేన్ ఒక రెమ్యూనరేషన్ చెప్పారని... తాను అంత ఇవ్వలేనని చెప్పానని అర్జున్ తెలిపారు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామని, ఓ ఏరియా రైట్స్ ఇవ్వమని అడిగితే సరే అన్నానని, కొంత అడ్వాన్స్ ఇచ్చానని ఆయన వివరించారు. ఆ తర్వాత స్టోరీ డిస్కషన్స్ కోసం ఎన్ని ఫోన్స్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. కాస్ట్యూమ్స్ కోసం డిజైనర్‌ని పంపిద్దామని ఫోన్స్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. తన జీవితంలో అన్ని కాల్స్ ఎవరికీ చేయలేదన్నారు. తాను గానీ, తన టీమ్ గానీ తప్పు చేయలేదన్నారు. విశ్వక్ సేన్‌కు ప్రొఫెషనలిజం లేదన్నారు. దర్శక, నిర్మాతలు అంటే అసలు గౌరవం లేదన్నారు. తానొక దర్శకుడిగా, నిర్మాతగా హార్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు. 

ఒకసారి విదేశాలు వెళ్లి వచ్చానని, స్కిన్ ట్యాన్ అవ్వడం వల్ల కొంత రెస్ట్ తీసుకుని ఫ్రెష్‌గా సెట్‌కు వస్తానంటే ఓకే అన్నామని, షెడ్యూల్  క్యాన్సిల్ చేశానని అర్జున్ చెప్పారు. ఆ తర్వాత మరోసారి కొత్త షెడ్యూల్ వేస్తే... తెల్లవారితే షూటింగ్ అనగా, ఉదయం నాలుగు గంటలకు క్యాన్సిల్ చేయమని విశ్వక్ సేన్ నుంచి మెసేజ్ వచ్చిందని ఆయన తెలిపారు. వర్క్ పట్ల విశ్వక్ సేన్‌కు కమిట్మెంట్ లేదన్నారు. తనకు వంద కోట్లకు వస్తాయని చెప్పినా... ఎప్పటికీ అతనితో సినిమా చేయనని చెప్పేశారు. 

దర్శకుడిగా తనకు ఒక విజన్ ఉంటుందని, టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు, చంద్రబోస్ రాసిన పాటలు నచ్చలేదని మధ్యలో ఇబ్బంది పెట్టారని, అతని ప్రవర్తన ఏమాత్రం బాలేదని అర్జున్ వివరించారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్, నిర్మాతల మండలిలో విశ్వక్ గురించి కంప్లయింట్ చేస్తున్నామని, తనకు జరిగినట్టు మరొకరికి జరగకూడదని కోరుకుంటున్నట్టు తెలిపారు. తనది మంచి కథ అని, త్వరలో మరొక హీరోతో సినిమా తీస్తామన్నారు. 

Also Read : 'కొరమీను' కథలో మీసాలు ఎక్కడ తీసేశారో తెలిసింది

టాప్ హెడ్ లైన్స్

Crazy Kalyanam OTT : ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ కల్యాణం - అనుపమ కొత్త మూవీకి బిగ్ ట్విస్ట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ కల్యాణం - అనుపమ కొత్త మూవీకి బిగ్ ట్విస్ట్... ఎందులో చూడొచ్చంటే?
Godavari Serial Today November 19th: 'గోదావరి' సీరియల్: శివుడికి గుండెపోటు! అలకనంద మీద ఆకర్ష్‌కి అనుమానం వచ్చిందా! జాను, సంజు షాక్!
'గోదావరి' సీరియల్: శివుడికి గుండెపోటు! అలకనంద మీద ఆకర్ష్‌కి అనుమానం వచ్చిందా! జాను, సంజు షాక్!
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Nindu Manasulu Serial Today November 19th: నిండు మనసులు: 'మా నాన్నే దోషి.. హత్య చేశాడు' షాక్ ఇచ్చిన గణ, ప్రేరణ! తలదించుకున్న రాజశేఖరం!
నిండు మనసులు: 'మా నాన్నే దోషి.. హత్య చేశాడు' షాక్ ఇచ్చిన గణ, ప్రేరణ! తలదించుకున్న రాజశేఖరం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
Personal Rapid Transit: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్‌!
హైదరాబాద్‌లోకి 'డ్రైవర్‌ అవసరం లేని పాడ్ ట్యాక్సీలు'.. 35 కి.మీ. PRTS నెట్‌వర్క్‌!
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
Samantha : బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
CM Revanth Reddy Siddipet Public Meeting: సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
Litton Das World Record:  టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
Embed widget