RRR & Radhe Shyam: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్' వాయిదా వేస్తున్నారా?డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారా?
'ఆర్ఆర్ఆర్'ను, 'రాధే శ్యామ్'ను జనవరిలో విడుదల చేయడం లేదని, వాయిదా వేస్తున్నారని కొంత మంది... డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నారని మరికొంత మంది... సోషల్ మీడియాలో సవాలక్ష కామెంట్లు! ఏది నిజం?
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాను జనవరి 7న విడుదల చేయడం లేదా? వాయిదా వేస్తున్నారా? జనవరి 14న 'రాధే శ్యామ్' విడుదల సందేహమేనా? దానిని వాయిదా వేస్తున్నారా? లేదంటే డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారా? రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో కొంత మంది చేస్తున్న పోస్టులు చూస్తే... అటువంటి అనుమానాలే కలుగుతాయి. రెండూ పాన్ ఇండియా సినిమాలే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డాయి. ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ వాయిదా పడతాయా? అంటే...
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్...
ఏపీలో కొంత మంది థియేటర్లను స్వచ్ఛందంగా మూసి వేయడం ఒకటి... ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించడంతో సెకండ్ షోలు వేసే వీలు లేకుండా పోవడం మరొకటి... కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ ఉండటం మరొకటి... ఈ మూడు కారణాలను సో కాల్డ్ సోషల్ మీడియా రాయళ్లు చూపిస్తున్నారు. భారీ బడ్జెట్, తారాగణంతో 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్' తీశారు. రెండు సినిమాలకు పెట్టుబడి తిరిగి రావాలంటే... సినిమాలు కొనుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లాలంటే... 100 శాతం ఆక్యుపెన్సీ కావాలి. టికెట్ రేట్స్ ఎక్కువ ఉండాలి.
Also Read: 'ఆర్ఆర్ఆర్' ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుంది? క్లారిటీ ఇచ్చిన టీమ్!
టికెట్ రేట్స్ పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాల్లోనూ టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు. 'ఆర్ఆర్ఆర్' విడుదల సమయానికి ఏపీలోనూ టికెట్ రేట్స్ పెంచుకునే విధంగా జీవో వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నైట్ కర్ఫ్యూలను 'ఆర్ఆర్ఆర్' టీమ్ గానీ, 'రాధే శ్యామ్' టీమ్ గానీ పట్టించుకోవడం లేదు. కరోనా మరీ విజృంభించి, లాక్ డౌన్ విధించే పరిస్థితి వస్తే తప్ప... వాయిదా వేసే అవకాశాలు లేవు. రెండు సినిమాలు ముందుగా ప్రకటించిన విడుదల తేదీలకు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. డైరెక్ట్ ఓటీటీ విడుదల అనేది నిర్మాతల ఆలోచనల్లో కూడా లేదు. థియేటర్లలో విడుదలైన రెండు మూడు నెలల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.
Also Read: కన్నీళ్లు పెట్టుకున్న పూజా హెగ్డే... ఆలోచనలో పడ్డ ప్రభాస్!
Also Read: 'ఆర్ఆర్ఆర్'కు కరోనా అలా కలిసొచ్చింది. లేదంటేనా...
Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి కథియవాడి'
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్‌లో మిస్టేక్... రాజమౌళి చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?
Also Read: Radhe Shyam Story: టీజర్‌లో అంతులేని కథ... మీరు గమనించారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి