అన్వేషించండి

Triptii Dimri: త్రిప్తి దిమ్రి దెబ్బకు ఆ ఇద్దరు హీరోయిన్లు ఔట్ - అరుదైన క్రెడిట్ కొట్టేసిన ‘యానిమల్‘ బ్యూటీ

Triptii Dimri: ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి రోజు రోజుకు మరింత క్రేజ్ తెచ్చుకుంటోంది. తాజాగా IMDBలో మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీగా గుర్తింపు పొందింది.

Triptii Dimri becomes most popular Indian celebrity on IMDB: ‘యానిమల్’ మూవీ నటి త్రిప్తి దిమ్రి కెరీర్ లో మైల్ స్టోన్ గా మిగిలింది. ఈ చిత్రంతో కనీవినీ ఎరుగని రీతిలో పాపులారిటీ సంపాదించుకుంటోంది. ఈ సినిమాలో ఆమె చిన్న పాత్రే చేసినా, అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించింది. ఆమె అందం, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 'నేషనల్ క్రష్' అనే బిరుదును కూడా సంపాదించుకుంది. ఈ చిత్రంలో ఆమె అందానికి అభిమానులు ఫిదా అయ్యారు.

IMDBలో మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీగా త్రిప్తి

ప్రస్తుతం త్రిప్తి దిమ్రి స్టార్ కిడ్స్ ను సైతం వెనక్కి నెట్టి మరీ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంటోంది. ‘ది ఆర్చీస్‌’లో తొలిసారిగా నటించిన స్టార్ కిడ్స్ సుహానా ఖాన్,  కుషీ కపూర్‌‌లను సైతం క్రేజ్ లో వెనక్కి నెట్టేసింది. IMDBలో మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది.

IMDB తాజాగా పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ కు సంబంధించి లేటెస్ట్ ఎడిషన్ విడుదల చేసింది. ఈ లిస్టులో త్రిప్తి దిమ్రి టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రెండో స్థానంలో నిలిచారు. ‘ది ఆర్చీస్‌’ దర్శకుడు జోయా అక్తర్, ‘డుంకీ’ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, ‘కేజీఎఫ్’ స్టార్ హీరో యష్ తో పాటు మరికొంత మంది సెలబ్రిటీలు ఈ లిస్టులో ప్లేస్ దక్కించుకున్నారు. 

‘యానిమల్’తో త్రిప్తికి ఓరేంజిలో పాపులారిటీ  

‘యానిమల్’ సినిమా తర్వాత త్రిప్తి దిమ్రి పాపులారిటీ ఓ రేంజిలో పెరిగింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోవర్ల సంఖ్య పెద్ద మొత్తంలో పెరిగింది. ఈ సినిమా విడుదలకు ముందుకు ఆమె ఇన్ స్టాలో కేవలం 6 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల అయ్యాక, ఆమె ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 320 శాతం పెరిగింది. ఇప్పుడు ఆమె ఇన్ స్టాలో 3.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

‘మామ్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ

త్రిప్తి దిమ్రి 2017లో శ్రీదేవి నటించిన ‘మామ్’ చిత్రంతో తన నటనా జీవితాన్ని మొదలు పెట్టింది. ఆమె ఇటీవల ‘ఖలా’, ‘బుల్బుల్’ లాంటి సినిమాల్లో నటించింది. చక్కటి నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా ‘యానిమల్’ సినిమాలో నటించింది. ఇందులో ఆమె నటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి.  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మమ విక్కీ  కౌశల్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్రొయేషియాలో కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ఇందులో త్రిప్తి, విక్కీ రొమాంటిక్ గా కనిపించారు.  విక్కీ ఆమెను తన చేతులతో పైకి ఎత్తాడు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: ‘జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్’ నుంచి ‘మోయే మోయే’ వరకు, 2023లో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన టాప్ మీమ్స్ ఇవే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?
వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?
Dhurandhar 2 Trailer : ధురంధర్ 2 ట్రైలర్ రివ్యూ - వయలెన్స్‌తో పాటు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ వేరే లెవల్
ధురంధర్ 2 ట్రైలర్ రివ్యూ - వయలెన్స్‌తో పాటు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ వేరే లెవల్
Gaddar Awards 2025 : గద్దర్ అవార్డ్స్... బెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి - బెస్ట్ యాక్టర్‌గా చై, హీరోయిన్ రష్మిక
గద్దర్ అవార్డ్స్... బెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి - బెస్ట్ యాక్టర్‌గా చై, హీరోయిన్ రష్మిక
Vishwanath And Sons Movie : సూర్య ఫస్ట్ తెలుగు మూవీ రీమేకా? - విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ
సూర్య ఫస్ట్ తెలుగు మూవీ రీమేకా? - విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ

వీడియోలు

Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam
Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
ఢిల్లీని
ఢిల్లీని "దెయ్యాల నగరం"గా మార్చిన ఇరాన్ పాలకుడు ఎవరో తెలుసా?
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Best First Car India: బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV, ఎలక్ట్రిక్ వరకు - ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లకు బెస్ట్ కార్లు
మొదటి కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ ఆప్షన్లు ఇవే!
Embed widget