Ammayi garu Serial Today March 24: రాఘవను సూర్య ముందు నిలబెట్టి నిజం చెప్పించేందుకు రాజు చేసిన ప్రయత్నం ఎందుకు విఫలమయ్యింది..?
Ammayi garu Today Episode : రాఘవను తన తండ్రి ముందు నిలబెట్టి నిజం చెప్పించి తల్లిదండ్రులను కలపాలనుకున్న అమ్మాయిగారి ప్రయత్నాలు ఫలించాయా లేదో నేటి ఏపిసోడ్‌లోచూద్దాం..?

Ammayi garu Serial Today Episode
పాఠశాల భవనం నిర్మాణానికి విరూపాక్ష, సీఎం సూర్య ఇద్దరూ కలిసి శంకుస్థాపన చేస్తారు. అది చూసి అమ్మాయిగారు ఎంతో సంతోషపడుతుంది. విరూపాక్ష కళ్లలో నలకపడటంతో...అది సూర్య తీయడం చూసి వారి కూతురు ఆనందానికి అవదుల్లేవ్..ఇంతలో రూప రాజుకు ఫోన్ చేయగా...రాఘవ దొరికాడని చెబుతాడు. వెంటనే ఇక్కడికి తీసుకురావాలని చెప్పడంతో వారిద్దరూ బయలుదేరతారు. రూప వాళ్ల అమ్మను పిలిచి ఈరోజు ఎలాగైనా రాజు రాఘవను నాన్న ముందు నిలబెడతాడని...నిజం బయటపడుతుందని చెప్పడంతో విరూపాక్ష ఎంతో సంతోషిస్తుంది. ఈరోజు నాన్న, నువ్వు కలవబోతున్నారని చెబుతుంది.
అయ్యగారికి అమ్మగారి గురించి నిజం చెప్పి.....వారిద్దరిని ఒకటి చేయాలన్ని నేను ప్రయత్నించిన ప్రతిసారీ ఎవరో అడ్డుపడుతున్నారని రాఘవ రాజుతో అంటాడు. ఎవరో నన్ను ఫాలో అవుతున్నారని చెబుతాడు. ఇవాళ ఎవరు అడ్డుపడినా నిన్ను సీఎం సార్ ముందు నిల్చుండబెట్టే పూచీ నాదని రాజు మాటిస్తాడు. అక్కడ సూర్య సమక్షంలో విరూపాక్ష పార్టీలో చేరే కార్యక్రమం సాగుతుండగా...ముఖాలు కప్పుకుని దీపక్‌తోపాటు వాళ్ల అమ్మకూడా అక్కడికి వస్తుంది. వాళ్లిద్దరూ కలిసి సభలో గొడవ చేసేందుకు ఒకడి మద్యం తాగించి అక్కడికి తీసుకొస్తారు. వాడు భార్యాభర్తలిద్దరి గురించి వాగుతాడు. భర్త పేరు చెప్పులోలేని భార్యను ఎన్నుకున్నందుకు సిగ్గుపడుతున్నాం అంటాడు. ఈ మాటలకు విరూపాక్షతోపాటు రూప కూడా ఎంతో బాధపడుతుంది. అతని మాటలు పట్టించుకోవద్దని ..స్టేజీ మీద ఉన్న పెద్దలు సర్దిచెప్పడంతో విరూపక్ష మళ్లీ మాట్లడటం మొదలుపెడుతుంది. తాను సూర్యగారి పార్టీలో ఎందుకు చేరబోతున్నానో వివరిస్తుంది. అప్పుడు మళ్లీ కలుగజేసుకున్న తాగుబోతోడు...వాళ్ల పార్టీ అభ్యర్థి నచ్చకే కదా నీకు ఓట్లు వేసి గెలిపించింది.ఇప్పుడు మళ్లీ ఆ పార్టీలో చేరడమేంటని నిలదీస్తాడు. దీంతో ఆమె కొంత నొచ్చుకుంటుంది. తాము మద్యం తాగించి తీసుకొచ్చిన ప్లాన్ వర్కవుట్ అవుతున్నందుకు దీపక్‌తోపాటు వాళ్ల అమ్మ చాలా సంతోషిస్తుంటారు. కానీ అప్పుడే మైక్ అందుకున్న సూర్య...విరూపాక్షకు అండగా నిలుస్తాడు. ఆమె గొప్పతనం పదిమందికి తెలియజేస్తాడు. దీంతో విరూపాక్షతోపాటు రూప కూడా ఎంతో సంతోషిస్తుంది. మా వ్యక్తిగత జీవితాల ప్రస్తావన ఇక్కడ అనవసరమన్న సూర్య....ఇది పార్టీ కార్యక్రమమని చెబుతాడు. ఆమె గొప్ప రాజకీయ నాయకురాలని పొగుడుతాడు. తమ ప్లాన్ బెడిసికొట్టడంతో దీపక్, వాళ్ల అమ్మ ఆశ్చర్యపోతారు. ఆమెకు మంత్రి పదవి ఇస్తానన్న వద్దునుకుని స్కూల్ కట్టించి ఇస్తే చాలని చెప్పొందంటాడు. అందుకే ఈరోజు ఈ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేయడానికి వచ్చామని చెబుతాడు. ఇలాంటి భూమి పూజలు ఎన్నో చూశామని తాగుబోతువాడు మళ్లీ వాదనకు దిగగా....ఈసారి విరూపాక్ష భర్తకు అండగా నిలుస్తుంది. ఆయన గొప్పతనం గురించి చెప్పడంతో అందరూ చప్పట్లతో స్వాగతిస్తారు. వారిద్దరూ ఒకరినొకరు పొడుగుకోవడం చూసి దీపక్,వాళ్ల అమ్మ ఆశ్చర్యపోతుంటారు. ఈలోగా రాజు రాఘవను అక్కడికి తీసుకొస్తాడు. అతన్ని సీఎం వద్దకు తీసుకెళ్తుండగా...దీపక్ చూస్తాడు. అప్పుడే టపాసులు కాల్చడంతో మొత్తం పొగ వస్తుంది. ఆ గ్యాప్‌లో దీపక్ రాఘవను తప్పించడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

