Allu Arjun: 'బింబిసార' సినిమాకి అల్లు అర్జున్ రివ్యూ!
తన స్టైల్ లో 'బింబిసార'కి రివ్యూ చెప్పేశారు బన్నీ. ముందుగా 'బింబిసార' టీమ్ కి కంగ్రాట్స్ చెప్పారు.
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా నటించిన 'బింబిసార' (Bimbisara) సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆగస్టు 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు తొలి ఆట నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలిరోజు ఈ సినిమాకి ఆరున్నర కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకి రూ.13 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. అలా చూసుకుంటే మొదటిరోజే సగం రికవరీ వచ్చేసింది. ఈ సినిమా చూసిన అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా పాజిటివ్ ట్వీట్స్ పెడుతున్నారు.
Allu Arjun's Review for Kalyan Ram Bimbisara Movie: ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, రాఘవేంద్రరావు, రామ్ పోతినేని ఇలా చాలా మంది సినిమాను ఉద్దేశిస్తూ పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్(Allu Arjun) వంతు వచ్చింది. తన స్టైల్ లో 'బింబిసార'కి రివ్యూ చెప్పేశారు బన్నీ. ముందుగా 'బింబిసార' టీమ్ కి కంగ్రాట్స్ చెప్పారు. ఎంతో ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా ఈ సినిమాను తెరకెక్కించారని.. తన పెర్ఫార్మన్స్ తో సినిమాకి మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చారని కళ్యాణ్ రామ్ ని పొగిడేశారు. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో కళ్యాణ్ రామ్ ఎప్పుడూ ముందుంటారని అన్నారు. తొలి సినిమాతోనే అద్భుతాన్ని తెరకెక్కించారని దర్శకుడు వశిష్టను ప్రశంసించారు. ఫైనల్ గా 'బింబిసార' సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని చెప్పారు.
తొలిరోజు ఆరున్నర కోట్లు రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.4. కోట్లు వసూళ్లు రాబట్టింది. రెండు రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా రూ.12.37 కోట్లు సాధించినట్లు సమాచారం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో నాలుగు కోట్లు సాధిస్తే సరిపోతుంది. కానీ ఈ సినిమా జోరు చూస్తుంటే అంతకుమించి కలెక్షన్స్ రావడం ఖాయమనిపిస్తుంది.
'బింబిసార'లో నందమూరి కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశారు. బింబిసారుడిగా, దేవదత్తుడిగా... నటుడిగా రెండు పాత్రలో వైవిధ్యం చూపించారు. కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon), వరీనా హుస్సేన్ (Warina Hussain) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, వరికుప్పల యాదగిరి పాటలు రాశారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం అందించారు. చిరంతన్ భట్ స్వరాలు అందించారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె ఈ సినిమాను నిర్మించారు.
Also Read: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం - రెండో పెళ్లి చేసుకోబోతున్న హృతిక్ మాజీ భార్య!
Also Read: పండుగాడి యూఫోరియా - 'పోకిరి' స్పెషల్ షోలకి షాకింగ్ బుకింగ్స్!