అన్వేషించండి

Mahesh Babu: పండుగాడి యూఫోరియా - 'పోకిరి' స్పెషల్ షోలకి షాకింగ్ బుకింగ్స్!

ఒక్క హైదరాబాద్ లోనే 'పోకిరి' సినిమా ఇప్పటికి పాతిక షోలు వేస్తే దాదాపుగా అన్నీ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఫుల్ అయిపోయాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజుని(ఆగస్టు 9) గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పెద్ద హీరోల పుట్టినరోజులప్పుడు వారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాలను హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం లాంటి పెద్ద నగరాల్లో స్పెషల్ షోలు వేస్తుంటారు. అవి కూడా మహా అయితే ఒకట్రెండు షోలే. కానీ ఈసారి మహేష్ ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో 'ఒక్కడు', 'పోకిరి' సినిమాల స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. 

Pokiri Special Showa: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో సైతం డబుల్ డిజిట్ నెంబర్స్ లో షోలు ప్లాన్ చేశారు. ఒక్క హైదరాబాద్ లోనే 'పోకిరి'(Pokiri) సినిమా ఇప్పటికి పాతిక షోలు వేస్తే దాదాపుగా అన్నీ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఫుల్ అయిపోయాయి. ఇప్పుడు ఈ షోలను పెంచే ఛాన్స్ ఉంది. ఏపీ, తెలంగాణాలో అయితే సుమారు 100 నుంచి 150 మధ్య ప్రీమియర్లను ఫిక్స్ చేశారు. కొన్ని చోట్ల టికెట్స్ కోసం ఒత్తిడి తట్టుకోలేక అదనపు థియేటర్లను జోడిస్తుంటే అప్పటికప్పుడు ఆ టికెట్స్ అమ్ముడైపోతున్నాయి. 

దీన్ని బట్టి మహేష్ బాబు మేనియా అర్ధం చేసుకోవచ్చు. యూట్యూబ్ లో ఫ్రీగా ఈ సినిమాను చూసే సౌకర్యం ఉన్నప్పటికీ.. ఈ రేంజ్ క్రేజ్ వస్తుందంటే పండుగాడి యూఫోరియా అలాంటిది. 'పోకిరి' మాత్రమే కాదు.. 'ఒక్కడు' కూడా ఇదే తరహాలో ఒక రోజు ముందు ఆగస్టు 8కి షోలు వేస్తున్నారు. ప్రసాద్ ఐమాక్స్ లో ఏడు షోలు ఫుల్ కావడానికి ఎక్కువ సమయం పట్టేలా లేదు. ఆ షోకి దర్శకుడు గుణశేఖర్ తో పాటు పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించబోతున్నారు. 

ఈ షోల ద్వారా వచ్చే డబ్బులన్నీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఖాతాల్లోకి వెళ్లడం లేదు. సినిమా రైట్స్ కోసం కొంత మొత్తాన్ని చెల్లించి, థియేటర్లకు అద్దెలు ఇచ్చి.. మిగిలిన డబ్బుని మహేష్ బాబు పేరుతో ఉన్న ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్స్ కి ఉపయోగించనున్నారట. ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మొత్తానికి తమ అభిమాన హీరో పుట్టినరోజుకి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారన్నమాట. మొత్తానికి మహేష్ బాబు అభిమానులు ట్రెండ్ సెట్ చేయబోతున్నారన్నమాట. ఈ లెక్కన రాబోయే రోజుల్లో ఇతర ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోల బ్లాక్ బస్టర్స్ ను ఇలా స్పెషల్ షోగా వేసుకొని మురిసిపోయేలా ఉన్నారు!

Also Read : ఆల్రెడీ 50 శాతం రికవరీ చేసిన కళ్యాణ్ రామ్ - 'బింబిసార' ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Also Read : హీరోలకు సంతోషాన్ని ఇచ్చిన 'బింబిసార', 'సీతా రామం'... కంగ్రాట్స్ చెబుతూ చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్ ట్వీట్స్

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget