Bimbisara Box Office Collection : ఆల్రెడీ 50 శాతం రికవరీ చేసిన కళ్యాణ్ రామ్ - 'బింబిసార' ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Bimbisara Collection Day 1 : నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన 'బింబిసార' సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. థియేట్రికల్ రెవెన్యూ బావుందని టాక్.
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా నటించిన 'బింబిసార' (Bimbisara Movie) కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆగస్టు 5న... థియేటర్లలో నిన్న విడుదలైన సినిమాకు తొలి ఆట నుంచి ప్రేక్షకుల స్పందన బావుంది. థియేటర్లకు జనాలు వచ్చారు. ఓపెనింగ్స్ బావున్నాయని ట్రేడ్ వర్గాల నుంచి వినిపించింది. వసూళ్ళలో కూడా ఆ పాజిటివిటీ కనిపించింది.
Bimbisara First Day Collections In Telugu States : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'బింబిసార'కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అందించారు. తొలి రోజు ఈ సినిమాకు రూ. 6.30 కోట్ల షేర్ లభించింది. ఆయన లాస్ట్ బెస్ట్ ఓపెనింగ్స్ కంటే ఇది డబుల్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రాంతాల వారీగా 'బింబిసార' ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే...
నైజాం : రూ. 2.15 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 90 లక్షలు
సీడెడ్ : రూ. 1.29 కోట్లు
నెల్లూరు : రూ. 26 లక్షలు
గుంటూరు : రూ. 57 లక్షలు
కృష్ణా జిల్లా : రూ. 34 లక్షలు
తూర్పు గోదావరి : రూ. 43 లక్షలు
పశ్చిమ గోదావరి : రూ. 36 లక్షలు
ఏపీ, తెలంగాణ... మొత్తం 6.30 కోట్ల రూపాయల షేర్ లభించింది. గ్రాస్ వసూళ్లు చూస్తే... 9.30 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాల సమాచారం.
ఆల్రెడీ 50 శాతం రికవరీ'బింబిసార'
రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను సుమారు 13.5 కోట్ల రూపాయలకు విక్రయించారు. ఆరున్నర కోట్లు అంటే సుమారు 50 శాతం రికవరీ అయినట్టే! ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ రావడంతో సినిమా భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.
అమెరికాలో వసూళ్లు ఎలా ఉన్నాయి?
అమెరికాలో కూడా 'బింబిసార' సినిమాకు మంచి వసూళ్లు లభిస్తున్నాయి. అక్కడ ఈ సినిమా 165 లొకేషన్లలో విడుదల అయ్యింది. తొలి రోజు 74, 628 డాలర్లు కలెక్ట్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 32 లక్షల రూపాయలు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే... ఈ సినిమా రూ. 7.27 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ వసూళ్లు చూస్తే... రూ. 11.50 కోట్లు ఉన్నాయి. వీకెండ్ తర్వాత నిర్మాతలకు లాభాలు వస్తాయని చెప్పవచ్చు. డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా మంచి మొత్తం వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read : ‘బింబిసార’ రివ్యూ: మద గజ మహా చక్రవర్తిగా నందమూరి కళ్యాణ్ రామ్ మెప్పించారా? లేదా?
'బింబిసార'లో నందమూరి కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశారు. బింబిసారుడిగా, దేవదత్తుడిగా... నటుడిగా రెండు పాత్రలో వైవిధ్యం చూపించారు. బింబిసారకు జోడీగా కేథరిన్ కనిపించారు. మరో కథానాయికగా ఎస్సై వైజయంతి పాత్రలో సంయుక్తా మీనన్ నటించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె చిత్రాన్ని నిర్మించారు. వశిష్ఠ దర్శకత్వం వహించారు.