Allu Arjun: బన్నీకి రేర్ గిఫ్ట్ ఇచ్చిన అభిమాని.. ఇంతకీ ఏంటంటే..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కేరళ అభిమాని ఒకరు 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్ను బహుమానంగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా బన్నీకి అభిమానులు ఉన్నారు. కేరళలో అయితే బన్నీను మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. ఆయన సినిమాలకు కేరళలో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తుంటాయి. బన్నీ కూడా తన సినిమాలను ప్రమోట్ చేయడానికి కేరళ, కర్ణాటక ప్రాంతాలకు తిరుగుతుంటారు. తన అభిమానులతో టచ్ లోనే ఉంటాడు.
Also Read: రూమర్స్ పై సమంత రియాక్షన్.. ఫైనల్ గా ఫ్యాన్స్ కు క్లారిటీ..
తాజాగా అల్లు అర్జున్ కి ఓ అభిమాని అరుదైన గిఫ్ట్ ను అందించారు. కేరళలో పుట్టి దుబాయ్ లో సెటిల్ అయిన మల్టీ మిలియనీర్ రియాజ్ కిల్టన్‌కి బన్నీ అంటే ఎంతో అభిమానం. అతడిని ఒక్కసారైనా కలవాలని అనుకున్నారు. షూటింగ్ కోసం ఇటీవల యూఏఈ వెళ్లిన బన్నీను రియాజ్ కలిశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కి 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్ ను బాహుబతిగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విషయాన్ని రియాజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో రియాజ్ బన్నీకి గిఫ్ట్ ఇచ్చిన వీడియోను షేర్ చేశారు.
ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'పుష్ప' సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చి టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈరోజే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న రష్మిక మందనా లుక్ ను విడుదల చేశారు. ఇందులో రష్మిక గ్రామీణ యువతీ శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు.
Also Read: పట్టుచీర, మల్లెపూలు...పుష్పలో రష్మిక ఫస్ట్ లుక్ అదిరిపోలా..!
Also Read: నా శ్వాస ఉన్నంత వరకూ మీరే నా దైవం..బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
Also Read: సామాజిక సేవలో సోనూ మరో అడుగు..శబ్దం, వాసన, రుచిని ఇకపై చక్కగా ఆస్వాదిద్దాం అన్న రియల్ హీరో