By: ABP Desam | Updated at : 13 Dec 2021 12:12 AM (IST)
Edited By: Eleti Saketh Reddy
పుష్ప ప్రమోషన్లలో బన్నీ, రష్మిక
పుష్ప నాలుగు సినిమాల కష్టమని, యూనిట్ మొత్తం చాలా కష్టపడిందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడారు. రష్మిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమా
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘అందరికీ ఫ్యాన్స్ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంది. అభిమానులు నా ఆర్మీ. నేను నా జీవితంలో సంపాదించుకుంది ఏదైనా ఉంటే మీరే(అభిమానులు). మీకన్నా ఏదీ ఎక్కువ కాదు. దేవిశ్రీ ప్రసాద్ ఎప్పటినుంచో జర్నీ కొనసాగుతోంది. ఈ సినిమా కోసం అద్భుతమైన పాటలు ఇచ్చాడు.’
‘దేవిశ్రీ, నేను, సుక్కుగారు కలిసి ప్రయాణం మొదలు పెట్టాం. నాకోసం చక్కని ఆల్బమ్ ఇచ్చావు. ఇప్పుడు కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం కష్టపడుతున్నాడు. చంద్రబోస్ ప్రతి పాటనూ అద్భుతంగా రాశారు. సినిమాటోగ్రాఫర్ కూబా, ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, మౌనిక ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు.’
‘ఈ ఒక్క సినిమా నాలుగు సినిమాల కష్టం. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేషనల్ క్రష్ అయిన రష్మికను ముద్దుగా క్రష్మిక అని పిలుస్తా. మనం చాలా మందితో కలిసి పనిచేస్తాం. మన మనసుకు నచ్చేవారు కొందరే. అలాంటి అమ్మాయే రష్మిక. చాలా టాలెంట్ ఉన్న అమ్మాయి, చక్కని నటి. ఐటమ్ సాంగ్ చేసినందుకు సమంత ధన్యవాదాలు. సునీల్‌ను ఇప్పటివరకూ ఒక రకంగా చూశాం. మంగళం శీనుగా కొత్త సునీల్‌ను చూస్తారు. కొండారెడ్డిగా అజయ్ ఘోష్, దాక్షాయణిగా అనసూయ, రావు రమేశ్, ధనుంజయ చాలా చక్కగా నటించారు. భన్వర్ సింగ్ షెకావత్‌గా ఫహద్ ఫాజిల్ నటన వేరే లెవల్. ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది.’
‘ఈ ఫంక్షన్‌కు సుకుమార్ రాలేదని చెప్పగానే నాకేమీ అర్థం కాలేదు. ఆయనని కన్విన్స్ చేద్దామని నేను ఫోన్‌లో మాట్లాడితే సుక్కు నన్ను కన్విన్స్ చేశారు. నువ్వు వేరు, నేను వేరు, కాదు మనం ఒక్కటే అని సుకుమార్ అన్నారు. నిజంగా ఆయన పడుతున్న కష్టానికి హ్యాట్సాఫ్.’అని అల్లు అర్జున్ మాట్లాడారు.
Also Read: Pushpa Event: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?
Also Read: Naga Chaitanya: ఇది కేవలం జెర్సీ మాత్రమే కాదు.. నాగచైతన్య ఎందుకు అలా అన్నాడంటే?
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ చూసి రామ్, భీమ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా..?
Also Read: ఇక సహించేదే లేదు.. శిక్ష పడేవరకు పోరాడతా.. రవి సీరియస్..
Also Read: 'ఐకాన్' సినిమా అటకెక్కినట్లే.. ఇదిగో క్లారిటీ..
Also Read: 'నువ్ నన్ను భరించావా..? లేక నటించావా..?' మానస్ ని ప్రశ్నించిన పింకీ..
Also Read: రజనీకాంత్ పవర్‌ఫుల్ పంచ్‌లకు ఎవరైనా పడిపోవాల్సిందే... కొన్ని డైలాగులు ఇవిగో
Also Read: ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరో బాలీవుడ్ ఆఫర్ అందుకున్న పూజా హెగ్డే - మొదటిసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్?
షారుక్, సల్మాన్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ పోతినేని!
నవంబర్ నుంచి మార్చ్ కి షిఫ్ట్ అయిన 'సలార్' రిలీజ్?
కేరళలో 'లియో' మూవీని బ్యాన్ చేస్తున్నారా? - ట్రెండింగ్ లో #Kerala Boycott Leo?
రామచందర్ తో పరిచయం ఉన్న మాట వాస్తవమే - కానీ నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు : నవదీప్
ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
BRS Candidates : సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్లో సందడేది ?
Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
/body>