By: ABP Desam | Updated at : 19 Apr 2023 12:20 PM (IST)
Photo@Akhil Akkineni/Instagram
అక్కినేని అఖిల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, అమల దంపతుల ముద్దుల కొడుకు. బీభత్సమైన సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఆయన ఇప్పటికీ పలు సినిమాలు చేసినా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఏజెంట్’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్భంగా కాకినాడలో నిర్వహించిన ఏర్పాటు చేసిన ‘ఏజెంట్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ వేడుకలో పాల్గొన్న ఓ అభిమాని పెళ్లెప్పుడు చేసుకుంటారు? అని అడిగాడు. దీనికి అఖిల్ ఫన్నీగా సమాధానం చెప్పాడు. “అప్పుడే పెళ్లి చేసుకోమంటారా?” అంటూ ఎదురు ప్రశ్న వేశారు. దీంతో ఈవెంట్ కు హాజరైన వాళ్లంతా గట్టిగా నవ్వారు. గత కొంత కాలంగా ఆయన పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. తాజాగా వాటిని ఖండించారు అఖిల్. అవన్నీ కేవలం రూమర్లుగా అభివర్ణించారు. ఇప్పుడు తాను పెళ్లి చేసుకోవడంలేదన్నారు. ప్రస్తుతం సింగిల్ గా ఉండటానికే ఇష్టపడుతున్నట్లు వెల్లడించాడు. తనకు క్రెకెట్ అంటే ప్రాణం అన్నారు. ప్రతి బాల్ ను సిక్స్ గా ఎలా మలచాలనే ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు. అందరూ ఆటలు ఆడాలని పిలుపునిచ్చాడు.
అఖిల్ వివాహం నిజానికి ఎప్పుడో జరగాలి. కానీ, అనివార్య కారణాల వల్ల నిశ్చితార్థం జరిగాక, పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. జీవీకే రెడ్డి మనుమరాలు శ్రీయా భూపాల్ తో ఆయన ప్రేమలో పడ్డాడు. 2017 డిసెంబర్‌లో వీరి నిశ్చితార్ధం కూడా జరిగింది. 2018లో వీరి పెళ్లి ఇటలీలో ఘనంగా నిర్వహించాలని ఇరు కుటుంబ సభ్యులు భావించారు. పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులకు ఆహ్వానాలు కూడా అందించారు. కానీ, పెళ్లికి కొద్ది రోజుల ముందు వివాహం క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ కు గురి చరేశారు. అయితే, వీరి పెళ్లి ఎందుకు ఆగిపోయింది? అనే విషయం ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. అయితే, పెళ్లికి ముందు అఖిల్, శ్రీయ మధ్య గొడవలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అఖిల్ కు కొంత మంది అమ్మాయిలతో ఉన్న ఎఫైర్ల విషయం బయటకు వచ్చింది, అది తెలిసి శ్రీయ పెళ్లి క్యాన్సిల్ చేయించిందని ఊహాగానాలు వినిపించాయి. అటు అఖిల్ ఆస్తుల విషయంలో జరిగిన గొడవ కూడా నిశ్చితార్థం క్యాన్సిల్ కావడానికి ఓ కారణం అని అప్పట్లో వార్తలు వినిపించాయి. వార్తలు ఏంటనేది మాత్రం బయటకు తెలియదు.
ఇక అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో స్పై థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.
Read Also: 'ఏజెంట్' చూసేది మమ్ముట్టి కోసమా? అఖిల్ కష్టాన్ని ఎవరూ గుర్తించరా?
Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?
SPB Birth Anniversary: ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ To గిన్నిస్ వరల్డ్ రికార్డ్, ఎస్పీ బాలు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు!
Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల
Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?
Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి
TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు