Pavitra Lokesh Ann Naresh: నరేష్‌పై పవిత్రా లోకేష్ వ్యాఖ్యలు వైరల్ - ద్వంద్వార్థాలతో ట్రోలింగ్ - ఆమె అసలు చెప్పింది వేరు !
Pavitra Lokesh: నటి పవిత్రా లోకేష్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. సోషల్ మీడియా వచ్చాక మంచి మాటల్ని కూడా బుతులుగా ప్రచారం చేస్తున్నారు.

Actress Pavitra Lokesh is being trolled on social media: నటుడు నరేష్ 65వ పుట్టిన రోజు వేడుకలు గత ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా ఆయన తో సహజీవనం చేస్తున్న నటి పవిత్రా లోకేష్ చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది అసభ్యంగా ఉంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెుతున్నారు.
#PavitraLokesh SHOCKING Comment - #Naresh garu energy is Equal to 10 People in WORK and I Can’t Handle Him 😳😳😳😳😳pic.twitter.com/nFpSPDl6qV
— GetsCinema (@GetsCinema) January 20, 2025
నరేష్ 65వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పవిత్ర లోకేష్ చేసిన ఓ కామెంట్ వైరల్ అవుతోంది. నరేష్‌ని ఆకాశానికి ఎత్తేసేలా ప్రశంసలు కురిపించింది. తను ఎంతలా కష్టపడతాడో , పనివిషయంలో ఎంత సిన్సియర్ గా వ్యవహరిస్తారో చెప్పేందుకు ప్రయత్నించింది. నరేష్ ఎనర్జీ పదిమందితో సమానం. ఆ రేజ్ ఎనర్జీ ఈ ఏజ్ లో ఎవరికీ సాధ్యం కాదు. రాత్రయితే చాలు నేను అలసిపోతాను కానీ తాను అస్సలు అలసిపోరు. వర్క్ విషయంలో ఆయన చాలా ఎనర్జిటిక్ గా, డెడికేటెడ్ గా ఉంటారని చెప్పుకొచ్చింది.
#TFNExclusive: Visuals of Actor @ItsActorNaresh's birthday celebrations in Hyderabad!!🎊#Naresh #PavitraLokesh #TeluguFilmNagar pic.twitter.com/2kXbVEmaWr
— Telugu FilmNagar (@telugufilmnagar) January 19, 2025
ఆమె మాట్లాడిన మాటల్ని వెనుకా-ముందు కట్ చేసేశారు. డబుల్ మీనింగ్ వచ్చేలా ఉండే ఆ కొంచెం వీడియో బిట్ ను వైరల్ చేస్తున్నారు. పూర్తి వీడియో ఇక్కడ చూడవచ్చు.
10 మందికి ఉండే ఎనర్జీ నరేష్ కు ఉంటుంది..#NareshVK #PavitraLokesh #NareshPressMeet pic.twitter.com/QMyL703HZK
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) January 19, 2025
ఆ వీడియోల కింద అసభ్య కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి పేరుకు ముందు హిజ్ ఎక్సలెన్సీ అని రాసుకునే విజయకృష్ణా నరేష్ తీరు చాలా సందర్భాల్లో అతిగానే ఉంటుంది. అంతమాత్రాన ఆమె మంచిగా మాట్లాడినప్పుడు కూడా ఇలా వక్రీకరిస్తే ఎబ్బెట్టుగానే ఉంటుంది.ఇప్పుడు ఆ వీడియోల ట్రోలింగ్ విషయంలో అదే జరుగుతోంది. నరేష్ వర్క్ విషయంలో ఎంత డెడికేటెడ్ గా ఉంటాడో చెప్పిన పవిత్రా లోకేష్ పరువు తీస్తున్నారని అనుకోవచ్చు.
పవిత్రా లోకేష్ కన్నడ నటి. ఆమెకు సినిమాల ద్వారానే తెలుగు నేర్చుకున్నారరు. తన తెలుగును ఇలా చేస్తున్నారని ..తన భాషను ఇలా తన వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా వాడేస్తున్నారని తెలిస్తే ఇక ఆమె తెలుగులో మాట్లాడటం మానేసే అవకాశాలు ఉన్నాయి. ఇక కన్నడలో మాట్లాడినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆమె ఓ వ్యక్తి సుగుణాలను చెబితే దాన్ని ఘోరంగా వక్రీకరించడం.. ఆ వ్యక్తిని మానసికంగా ఇబ్బంది పెట్టేదే.
Also Read: టాలీవుడ్ డబ్బు గోడౌన్లన్నీ గుర్తించేసిన ఐటీ - ఇండస్ట్రీలోని వ్యక్తులే సమాచారం ఇచ్చారా ?





















