Karthika Nair: ‘రంగం’ బ్యూటీని కట్టుకోబోయేది ఇతడే - ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేసిన కార్తీక
Karthika Nair Husband: నటి కార్తీక త్వరలో పెళ్లి పీటలను ఎక్కబోతున్నది. రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా తన జీవిత భాగస్వామి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
Actress Karthika Nair Husband Photos Goes Viral: సీనియర్ నటి రాధ వారసురాలిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కార్తీక నాయర్. తొలి సినిమాతోనే చక్కటి హిట్ అందుకుంది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసింది. అయితే, సినిమా పరిశ్రమలో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరం అయ్యింది. దుబాయ్ లో తన కుటుంబానికి సంబంధించిన హోటల్స్ బిజినెస్ ను చూసుకుంటుంది. రోజు రోజుకు తమ హోటల్స్ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ ముందుకు సాగుతోంది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఎంగేజ్ మెంట్ చేసుకుని అందరినీ షాక్ కి గురి చేసింది. నిశ్చితార్థపు ఫోటోలను అభిమానులతో పంచుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఫోటోల్లో కాబోయే భర్త ఎవరు? అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు.
కాబోయే భర్తను పరిచయం చేసిన కార్తీక
తాజాగా ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టింది. ఇందులో తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేసింది. అతడి పేరు రోహిత్ మీనన్ అని వెల్లడించింది. అతడితో చిరునవ్వులు చిందిస్తూ దిగిన పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. “నిన్ను కలవడం డెస్టినీ, నిన్ను ఇష్టపడటం ఒక మ్యాజిక్, మన జీవన ప్రయాణానికి కౌంట్ డౌన్ మొదలయ్యింది” అంటూ ఈ పోస్టుకు ఆమె క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు.
View this post on Instagram
త్వరలో పెళ్లి వివరాలను ప్రకటించే అవకాశం
వాస్తవానికి గత కొద్ది రోజులుగా కార్తీక ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కోలీవుడ్ కోడై కూసింది. రీసెంట్ గా ఆమె షేర్ చేసిన నిశ్చితార్థం ఫోటోతో ఆ వార్తలు నిజమేనని తేలిపోయాయి. త్వరలోనే ఆమె పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. అయితే, వివాహానికి సంబంధించిన వివరాలను ఫ్యామిలీ మెంబ్సర్ స్వయంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2009లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కార్తీక
ఒకప్పుడు సౌత్ సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా సత్తా చాటింది రాధ. పలువురు టాలీవుడ్ స్టార్ హీరోయిలతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించింది. అభిమానుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సీనియర్ నటి రాధ వారసురాలిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది నటి కార్తీక. ‘జోష్’ సినిమాతో హీరోయిన్‌గా వెండితెర పైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా కనిపించింది. 2009లో వచ్చిన ఈ మూవీతో తెలుగు వారికి దగ్గరైంది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. 2011లో విడుదలైన 'రంగం' సినిమా కార్తీక కెరీయర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో జూ. ఎన్టీఆర్ 'దమ్ము' చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత అల్లరి నరేష్తో కలిసి ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా అంతగా ప్రేక్షకులకు రీచ్ కాకపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. 2015 తర్వాత నుంచి కార్తీక వెండితెరకు పూర్తిగా దూరం అయ్యింది.