Actress Archana: ఆ హీరో అలాంటి మెసేజ్‌లు పెట్టేవాడు, రిప్లై ఇవ్వలేదని సినిమా నుంచి తీసేశారు: అర్చన
ఇటీవల సినీ నటి అర్చన ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్ లు వస్తుంటారు. అయితే అందరూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేరు. సరైన సినిమా పడకపోతే సినిమాలకు దూరం అవ్వాల్సిందే. కొంతమంది హీరోయిన్లు ఇతర కారణాల వలన ఇండస్ట్రీకి దూరం అవుతారు కూడా. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టి గ్లామర్ బ్యూటీ గా పేరు తెచ్చుకొని తర్వాత సరైన అవకాశాలు రాక సతమతమవుతున్న హీరోయిన్ లలో తెలుగు అమ్మాయి అర్చన కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది అర్చన. ‘తపన’ సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత సరైన అవకాశాలు రాక టాలీవుడ్ కు దూరమైంది. పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇటీవల అర్చన ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇంటర్వ్యూలో అర్చన ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. తాను సినిమా రంగంలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చానని తెలిపింది. సపోర్ట్ లేని వాళ్లు అంటే అందరూ అడ్వాంటేజ్ గా తీసుకుంటారని చెప్పింది. తనకు తన ఫ్యామిలీ అండగా ఉందని, అందుకే తను అలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకోగలిగానని చెప్పింది అర్చన. అయినా తనకు కూడా చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపింది. కెరీర్ ప్రారంభంలో తాను సినిమాల్లో చేస్తున్నపుడు కొంత మంది ఇబ్బంది పెట్టేవారని, కమిట్మెంట్ ఇవ్వకపోతే అవకాశాలు లేకుండా చేస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగు ఇండస్ట్రీలోనే తెలుగు అమ్మాయిలకు సరైన అవకాశాలు వచ్చేవి కాదని చెప్పింది. వాళ్లు చెప్పినట్టు చేస్తే అవకాశాలు ఇస్తారని, యాక్టింగ్ మాత్రమే చూసి చాన్స్ లు ఇవ్వరని వ్యాఖ్యానించింది.
ఇది కేవలం ఒక్క టాలీవుడ్ లోనే కాదని ఇతర భాషల్లో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. కన్నడ భాషలో సినిమాలు చేసినపుడు కూడా తనకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పింది. తాను మలయాళంలో ఓ సినిమా చేస్తున్నపుడు ఆ సినిమా హీరో తనకు అసభ్యకరంగా మెసేజ్ లు చేసేవాడని, తాను రిప్లై ఇవ్వలేదని ఆ మూవీ నుంచి తనను తీయించేశారని చెప్పింది. కానీ తను అవన్నీ పట్టించుకోకుండా తర్వాత కెరీర్ మీద దృష్టి పెట్టానని చెప్పుకొచ్చింది అర్చన.
కెరీర్ ప్రారంభంలో ‘నేను’, ‘తపన’, ‘కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను’ వంటి సినిమాల్లో సోలో హీరోయిన్ గా నటించింది అర్చన. తర్వాత హీరోయిన్ గా అంతగా అవకాశాలు రాకపోవడంతో ‘నువ్ వస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో త్రిష ఫ్రెండ్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఎక్కువగా సహాయ పాత్రలే వచ్చాయి. దీంతో కన్నడ, మలయాళం లో కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అంతే కాదు తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా కూడా చేసింది అర్చన. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది.