అన్వేషించండి

Ram Charan: ఎన్టీఆర్ కల ఇదే, దానిని సజీవంగా ఉంచేందుకు కలిసికట్టుగా కృషి చేద్దాం- రామ్ చరణ్

ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు రామ్ చరణ్ తెలిపారు. తెలుగు వారంతా ఐక్యంగా ఉండాలనేదే ఎన్టీఆర్ కల అన్నారు. దానిని సజీవంగా ఉంచేందుకు ప్రయత్నిద్దామంటూ ట్వీట్ చేశారు.

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి గొప్పతనాన్ని ఖండాంతరాలకు చాటి చెప్పిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు. ఆయన శత జయంతి ఉత్సవాలు హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ వేడుకకు హాజరు అయ్యారు. ఎన్టీ రామారావుతో తనకు ఉన్న పరిచయాన్ని, ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని వేదికపై గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమాకు గర్వకారణమైన ఎన్టీఆర్  100వ జన్మదిన వేడుకలకు హాజరు కావడం నిజంగా గౌరవంగా భావిస్తున్నట్లు తాజాగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “తెలుగు సినిమాకు గర్వకారణమైన ఎన్టీఆర్  100వ జన్మదిన వేడుకలకు హాజరు కావడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను.  నేను ఆ మహనీయుడి నుంచి నేర్చుకున్న విషయాలలో కీలకమైనది ‘ఐక్యమత్యమే మహాబలం’. ఆయన ఈ కలను సజీవంగా ఉంచేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం” అంటూ పిలుపునిచ్చారు.  

తెలుగు జాతి గొప్పతనాన్ని చాటారు!

ఇక ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాళ్లో పాల్గొన్న రామ్ చరణ్ ఎన్టీఆర్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు.  ''ఇప్పుడు విదేశాల్లో మన తెలుగు సినిమా గురించి చాలా గొప్ప‌గా మాట్లాడుతూ ఉన్నారు. సౌత్ ఇండియ‌న్ సినిమా బావుంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ,  ఆ రోజుల్లోనే ఎన్టీఆర్‌ గారు మ‌న ప‌వ‌ర్ ఏంటో చూపించారు. ఆయన్ను మనం ఎప్ప‌టికీ మ‌ర‌చిపోకూడ‌దు. గుర్తు చేసుకుంటూనే ఉండాలి'' అన్నారు. “రాముడి గురించో, కృష్ణుడి గురించో మాట్లాడ‌టం కంటే... మనం వారి గురించి మ‌న‌సుల్లో ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి వాటిని ఎక్కువ‌ అనుభూతి చెందాలే త‌ప్ప మాట్లాడ‌కూడ‌దు. వాళ్ల విజ‌యాల‌ను, అటువంటి మహనీయులు వేసిన మార్గాల‌ను గుర్తు చేసుకుంటూ... ఆ మార్గాల్లో న‌డుస్తుంటే వ‌చ్చే ఆనందం అంతా ఇంతా కాదు. నాతో స‌హా ప్ర‌తి రోజూ సినిమా సెట్, షూటింగుకు వెళ్లే ప్ర‌తి ఆర్టిస్ట్ ఆయ‌న పేరుని గుర్తుకు తెచ్చుకోకుండా ఉండ‌రు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ అంటే ఏంటి? అని మ‌న పొరుగు రాష్ట్రాల‌తో పాటు దేశ, విదేశాల్లో చాటి చెప్పిన లెజెండ్ ఎన్టీ రామారావు గారు. అటువంటి వ్య‌క్తి ప‌ని చేసిన చిత్ర పరిశ్రమలో మేం అందరం ప‌ని చేస్తున్నామంటే అంత కంటే గర్వకారణం ఇంకేముంది!?'' అన్నారు.    

ఎన్టీఆర్ తో కలిసి  బ్రేక్ ఫాస్ట్ చేయడం జీవితాంతం మ‌ర‌చిపోలేను

చిన్నతనంలో ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి కలిశానని రామ్ చరణ్ తెలిపారు. ''నేను, పురంధ‌ర‌రేశ్వ‌రి గారి అబ్బాయి రితేష్‌ స్కేటింగ్ క్లాసుల‌కు వెళ్లే వాళ్లం. ఓ రోజు  నేను, రితేష్ స్కేటింగ్ చేసుకుంటూ, వాళ్ళ ఇంటి నుంచి కింద‌కు వెళితే రామారావు గారి ఇల్లు వచ్చింది. అప్పుడు ఉద‌యం ఆరున్న‌ర అవుతుంది. ఆయ‌న అప్ప‌టికే రెడీ అయి టిఫిన్‌ చేయడానికి కూర్చున్నారు. అంద‌రికీ తెలిసిన‌ట్లే చికెన్ పెట్టుకుని తింటున్నారు. నన్ను చూసి, నాకు కూడా టిఫిన్ పెట్టారు. అది నాకు క‌లిగిన అదృష్టం. ఆయ‌న‌తో క‌లిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన ఆ క్ష‌ణాల‌ను జీవితాంతం మ‌ర‌చిపోలేను'' అని రామ్ చరణ్ తెలిపారు.

Read Also: రానాకు కల్లు దావత్ ఇచ్చిన గంగవ్వ, నిషాలో నిజం చెప్పి ‘పరేషాన్’ చేసిన బళ్లాల దేవుడు!

టాప్ హెడ్ లైన్స్

Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Mysaa New Release Date : రష్మిక 'మైసా' రిలీజ్ వాయిదా - అఫీషియల్ అనౌన్స్‌మెంట్... అసలు రీజన్ ఏంటంటే?
రష్మిక 'మైసా' రిలీజ్ వాయిదా - అఫీషియల్ అనౌన్స్‌మెంట్... అసలు రీజన్ ఏంటంటే?
Anil Ravipudi : రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్లిపోయిన అనిల్ రావిపూడి - ఎందులో తెలుసా?
రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్లిపోయిన అనిల్ రావిపూడి - ఎందులో తెలుసా?
Emotional Drama OTT : ఓటీటీలోకి వచ్చేసిన 'రంగస్థలం' - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన 'రంగస్థలం' - ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Hyderabad Crime News: డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
Embed widget