News
News
X

Ram Charan - Venkatesh: అమెరికాలో చెర్రీ, వెంకీ మామ - అవార్డులన్నీ రామ్ చరణ్‌కే అంటూ వెంకటేష్ కామెంట్స్!

రామ్ చరణ్ పేరు గ్లోబల్ వైడ్ గా ఓ రేంజ్ లో వినిపిస్తోంది. దీంతో చెర్రీ పై వరుసగా ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చరణ్ పై విక్టరీ వెంకటేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

FOLLOW US: 
Share:

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో అంతర్జాతీయంగా ఈ సినిమాకు ప్రశంసలు అందుతున్నాయి. అంతేకాకుండా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డులను అందుకుంటోంది. ఈ సినిమా టీమ్ మొత్తం అమెరికాలో పర్యటిస్తూ వరుసగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం హీరో రామ్ చరణ్ కూడా గత కొన్ని రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇటీవలే హెచ్సీఏ అవార్డుల్లో పాల్గొన్నారు. ఏకంగా ఐదు విభాగాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు హెచ్సీఏ అవార్డులు వరించాయి. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి అంతర్జాతీయ వేదికపై అవార్డులు అందుకున్నారు. రామ్ చరణ్ కూడా ఈ వేడుకలో ప్రజెంటర్ గా వ్యవహరించడం విశేషం. తాజాగా హీరో రామ్ చరణ్ అమెరికాలోని ఓ తెలుగు కుటుంబంలోని పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఇదే పెళ్లికి హీరో విక్టరీ వెంకటేష్ కూడా వెళ్లారు. దీంతో వీరిద్దరు కలసి కాసేపు మాట్లాడుకున్నారు. కలసి ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఈ సందర్భంగా వెంకటేష్ పెళ్లి వేదికపై నిల్చొని హంగామా చేశారు. తర్వాత వెంకటేష్ మైక్ తీసుకొని రామ్ చరణ్ గురించి మాట్లాడారు. ‘నాటు నాటు’ అంటూ అందర్నీ గర్వపడేలా రామ్ చరణ్ చేస్తున్నాడని అన్నారు. అన్ని అవార్డులు రామ్ చరణ్ కే వస్తున్నాయంటూ చమత్కరించారు. దీంతో రామ్ చరణ్.. ‘‘థాంక్యూ వెంకీ మామ’’ అని అన్నారు. దీంతో వేదికపై నవ్వులు పూచాయి. స్టేజీ మీద చరణ్, వెంకటేష్ సరదాగా మాట్లాడుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 24 న కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్(హెచ్సీఏ) అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగాల్లో  అవార్డులు దక్కడం విశేషం. అంతేకాకుండా ఈ అవార్డుల కార్యక్రమంలో రామ్ చరణ్ తన పక్కనే ఉండటం ఎంతో గౌరవంగా ఉందని హాలీవుడ్ నటి చెప్పడంతో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. 

ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆస్కార్ ఈవెంట్ పూర్తి కాగానే ఆయన ఇండియా తిరిగి వస్తారు. మార్చి 12, 2023న ఆస్కార్ అవార్డ్ వేడుకను నిర్వహించనున్నారు. మూవీ టీమ్ మొత్తం కలసి ఈ వేడుకలో పాల్గొననున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో ఈ టీమ్ లో చేరబోతున్నట్లు సమాచారం. ఇక ఈ వేడుక నుంచి తిరిగి రాగానే రామ్ చరణ్  RC15 షూటింగ్ లో చేరబోతున్నారు. దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ లో మూవీను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీను నిర్మిస్తున్నారు. కియార అద్వానీ రెండో సారి రామ్ చరణ్ సరసన ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించనుంది. 

Published at : 27 Feb 2023 04:04 PM (IST) Tags: RRR Venkatesh Ram Charan Actor ram charan

సంబంధిత కథనాలు

Surveen Chawla: ‘రానా నాయుడు’ బ్యూటీ సుర్వీన్ చావ్లా నటించిన తెలుగు సినిమా మీకు గుర్తుందా?

Surveen Chawla: ‘రానా నాయుడు’ బ్యూటీ సుర్వీన్ చావ్లా నటించిన తెలుగు సినిమా మీకు గుర్తుందా?

RC15 Welcome: రామ్ చరణ్‌కు RC15 టీమ్ సర్‌ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం

RC15 Welcome: రామ్ చరణ్‌కు RC15 టీమ్ సర్‌ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Newsense Teaser 2.0: న్యూస్ రాసే వాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది - నవదీప్ ‘న్యూసెన్స్’ టీజర్ అదిరిందిగా!

Newsense Teaser 2.0: న్యూస్ రాసే వాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది - నవదీప్ ‘న్యూసెన్స్’ టీజర్ అదిరిందిగా!

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా