అన్వేషించండి
Advertisement
Prabhas: ప్రభాస్‌ని అలా పిలిస్తే వచ్చే రియాక్షన్ చూస్తే తట్టుకోలేరు... ఇంతకీ ఆయన్ని ఏమని పిలవాలి మరి!
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన హీరో ప్రభాస్ ఇప్పుడు యూనివర్సల్ స్టార్ అయిపోయారు. ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ని అభిమానించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆయన్ని అభిమానిస్తుంటారు. బహుశా టాలీవుడ్ లో హేటర్స్ లేని హీరో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ అనే చెప్పాలి. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ హీరో ఇప్పుడు యూనివర్సల్ స్టార్ అయిపోయారు. ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారు. కానీ అసలు ప్రభాస్ హీరో అవ్వాలనే అనుకోలేదట.
'హీరో' అనే పిలిచేవారు..
ప్రభాస్ కుటుంబంలో వాళ్ల పెదనాన్న కృష్ణంరాజు తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో సినిమా చేశారు. ప్రభాస్ తండ్రి సూర్య నారాయణ రాజు నిర్మాతగా పని చేశారు. వాతావరణమే ఉన్నప్పటికీ ప్రభాస్ మాత్రం హీరో అవ్వాలని అనుకోలేదట. బిజినెస్ చేయాలని కల ఉండేదట. కానీ ప్రభాస్ స్నేహితులు మాత్రం ఆయన్ని 'హీరో' అనే పిలిచేవారు. చదువు పూర్తయిన తరువాత సడెన్ గా హీరో అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని ఇంట్లో చెబితే అందరూ షాకయ్యారట. ఆ తరువాత యాక్టింగ్ నేర్చుకోమని వైజాగ్ సత్యానంద్ దగ్గరకు పంపారట. యాక్టింగ్ నేర్చుకున్న సమయంలోనే 'ఈశ్వర్' సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అప్పటినుండి ఇక వరుస సినిమాలతో దూసుకుపోయారు.
విశ్వామిత్రుడి గెటప్ లో డార్లింగ్..
ఎన్టీఆర్-రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'యమ దొంగ' అనే సినిమాను విశ్వామిత్రా క్రియేషన్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ సినిమా కోసం స్పెషల్ గా ఏమైనా చేద్దామనుకున్నారు. అలా టైటిల్ పడే సమయంలో ప్రభాస్ విశ్వామిత్రుడిగా కనిపించరు. నిజానికి ప్రభాస్ కి ఆ గెటప్ వేయడం ఇష్టం లేదట. కానీ రాజమౌళి కన్విన్స్ చేయడంతో ఒప్పుకున్నారు.
అలా పిలిస్తే అసలు నచ్చదు..
ప్రభాస్ 'రాజు'ల కమ్యూనిటీకి చెందినవారు. అయన పెదనాన్నను ఇండస్ట్రీలో అందరూ కృష్ణంరాజు అనే పిలుస్తారు. కానీ ప్రభాస్ మాత్రం తన పేరు వెనుక రాజుని యాడ్ చేసుకోలేదు. తనకి కులం, గొడవలు అంటే అసలు నచ్చదు. ఎవరైనా ప్రభాస్ రాజు అని పిలిస్తే మన డార్లింగ్ కి అసలు నచ్చదట. సెట్స్ లో రాజమౌళి అప్పుడప్పుడు ప్రభాస్ రాజు అని పిలిచి ఏడిపించేవాళ్లట.
రాజమౌళితో ఫన్నీ ఇన్సిడెంట్..
'బాహుబలి' ప్రమోషన్స్ కోసం బాంబే నుండి తిరిగి వస్తున్న సమయంలో ప్రభాస్.. రాజమౌళిని తెగ టెన్షన్ పెట్టేశారు. బోర్డింగ్ టైమ్ అయిపోతున్నా కూడా ప్రభాస్ మాత్రం కదిలేవారు కాదట. రాజమౌళి ఎన్ని సార్లు అడిగినా.. ఎప్పుడు వెళ్లాలో నేను చెప్తాను అంటూ అందరినీ వెయిట్ చేయించారట. ఇంతలో ఎయిర్ పోర్ట్ లో పనిచేసే లేడీ వచ్చి బోర్డింగ్ లైన్ లో 15 మంది ఉన్నారని చెప్పగా.. ఐదుగురు ఉన్నప్పుడు వచ్చి చెప్పమని ప్రభాస్ చెప్పారట. ఇక టెన్షన్ తట్టుకోలేక రాజమౌళి 'నువ్ ఐదుగురు ఉన్నప్పుడు రా.. నేను వెళ్లిపోతున్నా' అంటూ చెప్పి వెళ్లిపోయారట. ఆ తరువాత ఫ్లైట్ ఎక్కే ద్గగర క్యూ చాలా పెద్దగా ఉందట. అప్పుడు ప్రభాస్.. రాజమౌళి దగ్గరకు వెళ్లి 'చెప్పా కదా క్యూ ఉంటుందని.. అందుకే నాతో రావాలి' అంటూ కౌంటర్ వేశారట.
బాలీవుడ్ మీడియా స్టాండింగ్ ఒవేషన్..
బాహుబలి పార్ట్ 2 రిలీజ్ ప్రమోషన్స్ కోసం టీమ్ మొత్తం ముంబైకి వెళ్లింది. ప్రెస్ మీట్ కోసం 400 కెపాసిటీ గల థియేటర్ ను బుక్ చేశారు. సాధారణంగా అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోల ప్రెస్ మీట్ ఉంటేనే ఆ థియేటర్ సగం ఖాళీగా ఉంటుంది. అలాంటిది ప్రభాస్ ప్రెస్ మీట్ అనేసరికి మొత్తం బాలీవుడ్ మీడియా వచ్చేసింది. థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. అప్పుడు ప్రభాస్ మెట్ల మీద నుండి నడిచి వస్తుంటే.. మొత్తం అందరూ నిల్చొని స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారట. ఆ తరువాత ప్రభాస్ తో ఫోటోల కోసం ఎగబడ్డారట.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆధ్యాత్మికం
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion