అన్వేషించండి

Pan India Movie: 1959 నుంచే ‘పాన్ ఇండియా’ ట్రెండ్, తొలి చిత్రం ఇదే!

Pan India Movie.. ఇప్పుడు ఎక్కడ విన్నా వినిపించే మాట ఇదే. సినిమాలకు సంబంధించి ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన ఈ పదం అసలు ఎలా పుట్టింది. అసలు ఇండియాలో Pan India సంస్కృతి ఎప్పుడు మొదలైంది?

ప్యాన్ ఇండియా సినిమా.. ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట ఇదే. అసలు ఎప్పుడు మొదలైంది ఈ ట్రెండ్. 1913లో దాదాసాహెబ్ ఫాల్కే ‘రాజా హరిశ్చంద్ర’ తొలి భారతీయ సినిమాను తీశారు. 1932 లో హెచ్ ఎం రెడ్డి ‘భక్త ప్రహ్లాద’ తెలుగులో మొదటి టాకీ సినిమాను తీశారు. మరి ప్యాన్ ఇండియా సినిమాలు ఎప్పుడు మొదలయ్యాయి. సరిగ్గా ఇదీ అని చెప్పలేం కానీ చాలా సినిమాలు ఓ భాషలో తీసి మిగతా భాషల్లోకి డబ్బింగ్ చేయటం మాత్రం 50ల నుంచే మొదలైంది. అవి కూడా ఎక్కువ కాదు, కేవలం మూడు నాలుగు భాషల్లోకి డబ్ చేసే విడుదల చేసేవారు. విడుదల తేదీల్లో చాలా గ్యాప్ ఉండేది. అంటే హిందీలో రిలీజ్ అయిన ఓ సినిమా తెలుగులో రావాలంటే దాదాపు ఏడాది పట్టేది. 1959 లో కన్నడ నుంచి వచ్చిన ఓ సినిమా ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. డాక్టర్ రాజ్ కుమార్ నటించిన ‘మహిషాసుర మర్ధిని’ ఏకంగా ఏడు భాషల్లోకి డబ్ అయ్యి విడుదలైంది.

ఆ తర్వాత 90 లవరకూ మళ్లీ ప్యాన్ ఇండియా సినిమాల ఊసు లేదు. ఓ సినిమా ఓ భాషల్లో హిట్ అయ్యిందంటే ఆ సినిమా రైట్స్ కొనుక్కుని వేరే భాషల్లో తీసేవాళ్లు తప్ప ప్యాన్ ఇండియా అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. సో అన్నీ రీమేక్ లో లేదా అప్పుడప్పుడు మూడు నాలుగు భాషల్లో డబ్బింగ్ లో వచ్చేవి. 1995 లో షారుఖ్ ఖాన్- కాజోల్ జంటగా ఎవర్ గ్రీన్ క్లాసిక్ దిల్ వాలే దుల్హానియా ఈ ఒరవడి మార్చేసింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం ఇలా చాలా భాషల్లోకి డబ్ అయింది డీడీఎల్ జే. ఆ తర్వాత కొన్ని బాలీవుడ్ సినిమాలు చాలా ఇండియన్ లాగ్వేంజెస్ లో కి డబ్ అయ్యేవి. కానీ ఒరిజినల్‌తో పాటు రిలీజ్ అయ్యేవి కాదు. చాలా తమిళ సినిమాలు తెలుగులో, తెలుగు సినిమాలు తమిళంలో డబ్ అయ్యి రిలీజ్ అయ్యేవి. కానీ వాటిని ప్యాన్ ఇండియా సినిమాలుగా పరిగణించలేం. ఇలా ఎన్ని సినిమాలు వచ్చినా మోడ్రన్ డేస్ లో ప్యాన్ ఇండియా సినిమా అంటే 2010లో శంకర్- సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ సినిమానే అని చెప్పాలి. దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది ‘రోబో’.

కానీ ఈ ప్యాన్ ఇండియా అనే పదాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లిన క్రెడిట్ తెలుగు సినిమాలకే దక్కుతుంది. దానికి ఆద్యుడిగా దర్శకధీరుడు రాజమౌళి పేరునే చెబుతారు. 2015లో విడుదలైన ‘బాహుబలి 1’తో ప్యాన్ ఇండియా సినిమాను ప్రమోట్ చేసిన ఇండస్ట్రీగా టాలీవుడ్ ను నిలిపాడు జక్కన. తెలుగు, తమిళంలో సైమల్టేనియస్ గా విడుదలైన ఈ సినిమా  హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డబ్ అయి తర్వాత విడుదలైంది. మొత్తం దేశం దృష్టిని ఆకర్షించింది బాహుబలి. బాహుబలికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు సైతం దక్కింది ఆ ఏడే. ఇక ఈ సిరీస్ లో 2017లో వచ్చిన ‘బాహుబలి-2’ అయితే భారతీయ భాషలను దాటుకుని జపనీస్, రష్యన్, చైనీస్ లోనూ డబ్ అయ్యి అక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపించటం. రాజమౌళి క్రేజ్‌ను ప్యాన్ ఇండియా సినిమాల సత్తాను చాటింది. ఆ తర్వాత తమిళ్ నుంచి ప్యాన్ ఇండియా సినిమాగా రోబోకి సీక్వెల్‌గా 2.0 విడుదలై శంకర్ స్థాయిని దేశం మొత్తం పరిచయం చేసింది ఆ సినిమా. 

Also Read: వామ్మో, ఎన్టీఆర్ వాడకం మామూలుగా లేదుగా - పక్కా మీమ‌ర్‌లా మాట్లాడిన ఎన్టీఆర్!

ఆ తర్వాత కన్నడ సినిమా తానేమన్నా తక్కువా అన్నట్లు ‘కేజీఎఫ్’ సినిమాతో ప్రశాంత్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ‘కేజీఎఫ్ 2’ కూడా విడుదలకు సిద్ధం అవుతుంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఐకాన్ స్టార్ ట్యాగ్ ఇచ్చిన సుకుమార్ తీసిన పుప్ష సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. క్రికెటర్ల పొలిటికల్ సెలబ్రీటీల వరకూ ఎక్కడ చూసినా తగ్గేదేలే అనటమే. ‘రాధే శ్యామ్’ కోసం ప్రభాస్ అభిమానులు దేశ వ్యాప్తంగా ఎలా ఎదురు చూశారు. అదీ ప్యాన్ ఇండియా సినిమా స్థాయి. ఇప్పుడు ‘RRR’ సినిమాతో మరో సారి దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మ్యాజిక్ చేయటానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ప్యాన్ ఇండియా సినిమాలు అంటే తెలుగు సినిమాలే అనే స్థాయిని అందుకున్న టాలీవుడ్.. ఈ గీతలన్నింటినీ చెరిపేసి త్వరలో ఇండియన్ సినిమా అనే స్టేజ్‌కు చేరుకునే రోజులు ఉన్నాయనేది సినీ విశ్లేషకుల అంచనా. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి దర్శకుల కల కూడా అలాంటి ఇండియన్ సినిమానే. సో ఇదీ ఓవరాల్‌గా ప్యాన్ ఇండియా సినిమాల కథ.

Also Read: 'ఆర్ఆర్ఆర్మూవీ సెన్సార్ రివ్యూ - ఉమైర్ సంధుని ఏకిపారేస్తున్న నెటిజన్లు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget