UP polls 2022: 'నకిలీ సమాజ్‌వాదీలకు ఓట్ల కోసమే అంబేడ్కర్ గుర్తొస్తున్నారు'
సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. నకిలీ సమాజ్‌వాదీలకు ఓట్ల కోసమే అంబేడ్కర్ గుర్తొస్తున్నారని మోదీ ఆరోపించారు.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఫిబ్రవరి 10న జరగనుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు విమర్శల దాడి చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ.. సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రామ్‌పుర్, బదౌన్, సంభాల్ జిల్లాలకు చెందిన 15 నియోజకవర్గాల ప్రజలతో మోదీ బహిరంగ సభ నిర్వహించారు.
సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీపై ప్రధాని విమర్శలు చేశారు. యూపీలో గత ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. కొంతమంది అవినీతి, కుటుంబ రాజకీయాలు, మాఫియా, గూండారాజ్యాన్ని యూపీలో పెంచిపోషింటారని మోదీ ఆరోపించారు.
అభివృద్ధే ముఖ్యం..
భాజపా విడుదల చేసిన మేనిఫెస్టో ద్వారా రాష్ట్రంలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి విస్తరిస్తుందని మోదీ అన్నారు.
భాజపా మేనిఫెస్టో..
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. 'లోక్ కల్యాణ్ సంకల్ప పత్రం' పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో రైతులు, నిరుద్యోగులకు వరాలజల్లు కురిపించింది భాజపా. లఖ్‌నవూలోని ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్‌లో జరిగిన జన సభలో మేనిఫెస్టోను విడుదల చేశారు.
Also Read: Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్ X కాషాయ కండువా.. వ్యవహారంపై హైకోర్టు ఏమందంటే?
Also Read: BJP Manifesto UP Election: యూపీ మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా.. యువత, రైతులు, మహిళలపై వరాల జల్లు