అన్వేషించండి

Tekkali YSRCP : టెక్కలి వైసీపీ అభ్యర్థిపై రెబల్‌గా భార్య పోటీ - హాట్ టాపిక్‌గా దువ్వాడ ఫ్యామిలీ రాజకీయం !

AP Elections 2024 : టెక్కలి వైెఎస్ఆర్‌సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై ఆయన భార్య రెబల్‌గా పోటీ చేయనున్నారు. కుటంబసమస్యల కారణంగా వారి రాజకీయం శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశమవుతోంది.

Duvvada Vani  will contest against YSRCP candidate Duvvada Srinivas  :  నామినేషన్లు వేసేటప్పుడు భర్తల తరపున భార్యలు.. భార్యల తరపున భర్తలు డమ్మీ నామినేషన్లు వేయడం చేస్తూంటారు. ఏదైనా సాంకేతిక కారణాలతో నామినేషన్ రిజెక్ట్ అయితే భార్య లేదా  భర్త బరిలో ఉంటారని ఇలా చేస్తారు. అయితే  రెబల్ గా పోటీ చేయడం దాదాపుగా లేదు. కానీ  రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని మరోసారి నిరూపితమైంది. భర్తపై భార్య రెబల్ గా పోటీకి దిగుతున్నారు. టెక్కలి నియోజకవర్గంలో ఇలా జరుగుతోంది.  

వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పేరు ఖరారు - అసంతృప్తికి గురైన దువ్వాడ వాణి         

 టెక్కలి ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్‌ సతీమణి వాణి ఎమ్మెల్యే అభ్యర్థిగా టెక్కలి నుంచి పోటీ చేయనున్నట్లు గురువారం ప్రకటించారు.  ఈ నెల 22న ఆమె నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు టెక్కలి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబంలో కొంత కాలంగా నెలకొన్న వివాదం ఆయన్ను వెంటాడుతూనే ఉంది. పార్టీ అధిష్టానం  జోక్యం చేసుకుని ఇరువరి మధ్య రాజీ కుదిర్చారు. ఈ ఒప్పందంలో భాగంగా శ్రీనివాస్‌ స్థానంలో వాణిని గతేడాది మేలో టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసిపి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నియోజకవర్గ సమన్వయకర్తలను మార్పు చేసింది. దువ్వాడ వాణిని మార్చి మళ్లీ శ్రీనివాస్‌కు టిక్కెట్ ఇచ్చారు. 

స్వతంత్రంగా పోటీ చేాయలని దువ్వాడ వాణి నిర్ణయం                                                              

తనను ఇంచార్జ్ గా నియమించినా టిక్కెట్ ఖరారు చేయకపోవడంతో దువ్వాడ వాణి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.  ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ గెలుపునకు సహకరించాలని, ప్రచారంలో పాల్గొనాలని పార్టీ పెద్దలు సూచించినా  ఆమె అంగీకరించలేదు.  దువ్వాడ వాణి టెక్కలి బరిలో ఉంటే దువ్వాడ గెలుపు కష్టంగా మారుతుందన్న చర్చ నడుస్తోంది. 

రాజకీయంగా అనుభవం ఉన్న దువ్వాడ వాణి                

దువ్వాడ వాణి ప్రస్తుతం టెక్కలి జెడ్‌పిటిసి సభ్యులుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె టెక్కలి నుంచి   జెడ్‌పిటిసిగా గెలుపొందారు. ఆమె కాంగ్రెస్‌ హయాంలోనూ టెక్కలి జెడ్‌పిటిసి సభ్యులుగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్‌ పోటీ చేసిన ప్రతి ఎన్నికల ప్రచారంలోనూ కీలకపాత్ర పోషించారు. వాణి తండ్రి సంపతిరావు రాఘవరావు కూడా 1985, 1994, 1996 ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.  ప్రస్తుతం విడాకులు తీసుకోకపోయినప్పటికీ వారిద్దరూ కలిసి లేరని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.                      

 

టాప్ హెడ్ లైన్స్

MPP ZP Schedule: ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ సన్నాహాలు.. సర్పంచికి 25, వార్డు సభ్యులకి 20 గుర్తులు కేటాయింపు
పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ సన్నాహాలు.. సర్పంచికి 25, వార్డు సభ్యులకి 20 గుర్తులు కేటాయింపు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonia Gandhi Autobiography: సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
Bharat Summit Congress vs BJP: భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
Jailer 2 OTT : ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
Anirudh Ravichander Kavya Maran Wedding : అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
Parivarthana Rajaneethi Party Launch: పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget