Glass Tumbler Symbol Issue: ఏపీ ఎన్నికల్లో కీలక పరిణామం - కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు !
Elections 2024 : ఏపీలో కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. కానీ రిజర్వ్ సింబల్ ను కేటాయించకూడదని విపక్షాలు అభ్యంతరం చెుతున్నాయి.
Glass Symbol Politics : ఆంధ్రప్రదేశ్ లో జనసేన గుర్తు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారుతోంది. నామినేషన్ల ఉపసంహహరణ గడువు ముగియడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలబడిన వారికి రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్ లో ఉన్న వాటిని అభ్యర్థులకు ఎంచుకునే అవకాశం కల్పించారు. ఒక గుర్తు కోసం ఎక్కువ మంది పోటీ పడితే డ్రా తీసి గుర్తు కేటాయించారు. అయితే ఇలా కేటాయించిన సింబల్స్ లో కొన్ని నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు ఉంది. విజయనగరంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. ఎన్నికల సంఘం ఆ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేసిందని ఇండిపెండెంట్లకు ఇవ్వకూడదని టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పారు.అయితే అలాంటి ఆదేశాలు తమకు రాలేదని.. చెప్పి రిటర్నింగ్ అధికారి గాజు గ్లాస్ గుర్తు కేటాయించార.
జగ్గంపేటలో ఇండిపెండెంట్ గా సూర్యచంద్ర
అలాగే జగ్గంపేటలో జనసేన పార్టీకి చెందిన సూర్యచంద్ర ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. ఆక్కడ కూడా ఆయనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. తాను జనసేన అభ్యర్థినేనని ఆయన ప్రచారం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అక్కడ కూడా వివాదాస్పదమయింది. టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పినా రిటర్నింగ్ అధికారులు గుర్తుల కేటగిరిలో గ్లాస్ ఉందని చెప్పి కేటాయించారు. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్. అయితే జనసేనకు గుర్తింపు లేకపోవడంతో ఆ గుర్తు ఫ్రీ సింబల్ కేటగిరిలో ఉంది. తర్వాత జనసేన పార్టీ విజ్ఞప్తి మేరకు ఆ గుర్తును జనసేన పార్టీకి కేటాయించారు. అయితే జనసేన పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు కేటాయిస్తారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ అక్కడ ఓ స్వతంత్ర అభ్యర్థి గాజు గ్లాస్ గుర్తును దక్కించుకుని పోటీ చేశారు.
గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ కేటగిరిలో
అయితే ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన ఎన్డీఏ కూటమి నేతలు గాజు గ్లాస్ గుర్తును జనసేనకు రిజర్వ్ చేయాలని ఏపీలో జనసేనకు మాత్రమే కేటాయించాలని ఆ పార్టీ పోటీ చేయకపోతే ఎవరికీ కేటాయించవద్దని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. ఈ మేరకు ఈసీ గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ కేటగిరిలో పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. అయితే కొన్ని చోట్ల ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించడం వివాదాస్పదమవుతోంది. నిజానికి గాజు గ్లాస్ సింబల్ ను రిజర్వ్ చేయకపోతే అన్ని చోట్లా స్వతంత్రులకు కేటాయించాల్సి ఉంది. కానీ అన్ని చోట్లా ఇలా కేటాయించినట్లుగా సమాచారం రాలేదు.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. గుర్తుల కేటాయింపు తర్వాత ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది బరిలో ఉన్నారు. ఎవరికి ఏ గుర్తు అన్నది ప్రకటించే అవకాశం ఉంది. గాజు గ్లాస్ గుర్తుపై ఈసీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఒక వేళ రిజర్వ్ చేయకపోతే జనసేన పోటీ చేయని అన్ని చోట్లా స్వతంత్రులకు కేటాయిస్తారు. రిజర్వ్ చేస్తే ఇప్పటికే కేటాయించిన వారికి మార్పులు చేస్తారని అంచనా వేస్తున్నారు.