PJTSAU: ఫ్రొఫెసర్ జయశంకర్, శ్రీ కొండా లక్ష్మణ్ వర్సిటీల్లో బీఎస్సీ కోర్సులు, వివరాలు ఇలా!
బీఎస్సీ కోర్సులో చేరాలంటే ఇకపై మొదటి సంవత్సరం రూ.11 లక్షల ఫీజు చెల్లించాలని నిర్ణయించింది. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మిగిలిన మూడేళ్లు ఏటా రూ.లక్ష చొప్పున చెల్లించాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(హైదరాబాద్), శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (ములుగు, సిద్దిపేట జిల్లా) 2022-23 విద్యా సంవత్సరానికి సెల్ఫ్ ఫైనాన్స్ విభాగం కింద వ్యవసాయ బీఎస్సీ డిగ్రీలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. ఈ కోర్సులకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఎంసెట్ ర్యాంకర్లు డిసెంబర్ 28, 29 తేదీల్లో వర్సిటీలో జరిగే ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని జయశంకర్ వర్సిటీ సూచించింది. ఈడబ్ల్యుఎస్ రిజర్వుడ్ కేటగిరీ తప్ప మిగిలిన కోటాల విద్యార్థులందరూ ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని స్పష్టంచేసింది. ఏజీ బీఎస్సీ కోర్సులో 154, బీఎస్సీ (కమ్యూనిటీ సైన్స్)లో 10, హార్టీకల్చర్ బీఎస్సీలో 40 సీట్లు ఉన్నాయి.
అగ్రికల్చర్, హార్టికల్చర్ బీఎస్సీ ఫీజులు ఖరారు..
సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ కింద అగ్రికల్చర్ బీఎస్సీ, హార్టికల్చర్ బీఎస్సీ కోర్సు ఫీజులను ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఖరారు చేసింది. బీఎస్సీ కోర్సులో చేరాలంటే ఇకపై మొదటి సంవత్సరం రూ.11 లక్షల ఫీజు చెల్లించాలని నిర్ణయించింది. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మిగిలిన మూడేళ్లు ఏటా రూ.లక్ష చొప్పున చెల్లించాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. అలాగే హార్టికల్చర్ బీఎస్సీ కోర్సుకైతే మొదటి ఏడాది రూ.6 లక్షలు, మిగిలిన మూడేళ్లపాటు ఏటా రూ.లక్ష చొప్పున చెల్లించాలని తెలిపింది.
ఫీజుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
కోర్సుల వివరాలు...
➥ బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్(నాలుగేళ్లు): 154 సీట్లు
➥ బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ (నాలుగేళ్లు): 40 సీట్లు
➥ బీఎస్సీ(ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ (నాలుగేళ్లు): 10 సీట్లు
అర్హత: ఇంటర్మీడియట్(బైపీసీ) ఉత్తీర్ణతతోపాటు తెలంగాణ రాష్ట్ర ఎంసెట్-2022 ర్యాంకు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఎంసెట్‌లో పొందిన ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్: అన్ని కేటగిరీల (ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ) వారికి డిసెంబరు 28, 29 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
వేదిక: University Auditorium,
PJTSAU, Rajendranagar,
Hyderabad.
Also Read:
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రవేశాలు, కోర్సుల వివరాలు ఇలా!
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. టిస్ సంస్థ ముంబయి, హైదరాబాద్, తుల్జాపూర్, గువాహటి క్యాంపస్‌లలో మొత్తం 60 కోర్సులను అందిస్తోంది. వీటిలో 57 పీజీ, 3 పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. టిస్ ముంబయి క్యాంపస్‌లో 38, హైదరాబాద్‌లో 10, తుల్జాపూర్‌లో 4, గువాహటిలో 8 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 2023 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సులు!
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని డా.వైఎస్సాఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి పలు విభాగాల్లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. డిసెంబరు 28, 29 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
వైఎస్సార్ హెల్త్ వర్సిటీలో ఎంపీటీ కోర్సు, వివరాలు ఇలా!
విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనుబంధ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఎంపీటీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.5,900 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.4,956 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..