Dr. YSRUHS: వైఎస్సార్ హెల్త్ వర్సిటీలో ఎంపీటీ కోర్సు, వివరాలు ఇలా!
సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనుబంధ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఎంపీటీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.5,900 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.4,956 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సు వివరాలు..
* మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ (ఎంపీటీ) కోర్సు
స్పెషాలిటీ: న్యూరాలజీ, కార్డియో పల్మనరీ, స్పోర్ట్స్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్.
కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.
అర్హత: కనీసం 55% మార్కులతో బీపీటీ కోర్సు ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 31.12.2022 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 48 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.5,900. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.4,956 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం: డిగ్రీ స్థాయిలో కోర్సులో అకడమిక్ మెరిట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, రిజర్వేషన్ల ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరితేదీ: 28.12.2022.
Also Read:
టీఎస్‌సెట్-2022 షెడ్యూలు విడుదల, దరఖాస్తు ఎప్పుడంటే?
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్)-2022 షెడ్యూలును ఉస్మానియా విశ్వవిద్యాలయం డిసెంబరు 22న విడుదల చేసింది. డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. చివరిసారిగా 2019లో సెట్ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాలు సెట్ నిర్వహించలేదు. తాజాగా టీఎస్‌సెట్-2022 నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలో ఆన్‌లైన్ ద్వారా టీఎస్ సెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
టీఎస్ సెట్-2022 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రవేశాలు, కోర్సుల వివరాలు ఇలా!
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. టిస్ సంస్థ ముంబయి, హైదరాబాద్, తుల్జాపూర్, గువాహటి క్యాంపస్‌లలో మొత్తం 60 కోర్సులను అందిస్తోంది. వీటిలో 57 పీజీ, 3 పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. టిస్ ముంబయి క్యాంపస్‌లో 38, హైదరాబాద్‌లో 10, తుల్జాపూర్‌లో 4, గువాహటిలో 8 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 2023 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
జేఈఈ మెయిన్-2023 పరీక్షల షెడ్యూలు ఇలా!
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రెండు విడతల్లో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. తొలి విడత పరీక్షలు జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించింది. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 12 వరకు తొలి విడత జేఈఈ మెయిన్ దరఖాస్తుల స్వీకరించనున్నట్లు పేర్కొంది.
జేఈఈ మెయిన్-2023 పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..