TISS Admissions: టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రవేశాలు, కోర్సుల వివరాలు ఇలా!
టిస్ సంస్థ ముంబయి, హైదరాబాద్, తుల్జాపూర్, గువాహటి క్యాంపస్‌లలో మొత్తం 60 కోర్సులను అందిస్తోంది. వీటిలో 57 పీజీ, 3 పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి.
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. టిస్ సంస్థ ముంబయి, హైదరాబాద్, తుల్జాపూర్, గువాహటి క్యాంపస్‌లలో మొత్తం 60 కోర్సులను అందిస్తోంది. వీటిలో 57 పీజీ, 3 పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. టిస్ ముంబయి క్యాంపస్‌లో 38, హైదరాబాద్‌లో 10, తుల్జాపూర్‌లో 4, గువాహటిలో 8 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 2023 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సుల వివరాలు..
➨ ఎడ్యుకేషన్ (ఎలిమెంటరీ)
➨ డెవలప్ మెంట్ స్టడీస్
➨ విమెన్ స్టడీస్
➨ ఇంటర్నేషనల్ ఎలక్టోరల్ మేనేజ్ మెంట్ అండ్ ప్రాక్టీసెస్
➨ ఎన్విరాన్ మెంట్ క్లైమేట్ చేంజ్ & సస్టెయినబిలిటీ స్టడీస్
➨ రెగ్యులేటరీ పాలసీ అండ్ గవర్నెన్స్
➨ అర్బన్ పాలసీ అండ్ గవర్నెన్స్
➨ వాటర్ పాలసీ అండ్ గవర్నెన్స్
➨ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
➨ పబ్లిక్ హెల్త్ (హెల్త్ అడ్మినిస్ట్రేషన్ )
➨ పబ్లిక్ హెల్త్ (హెల్త్ పాలసీ, ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ )
➨ పబ్లిక్ హెల్త్ (సోషల్ ఎపిడిమియాలజీ)
➨ యానిమల్ అసిస్టెడ్ థెరపీ ఇన్ కౌన్సెలింగ్
➨ గ్లోబల్ మెంటల్ హెల్త్
➨ అప్లయిడ్ సైకాలజీ (క్లినికల్ అండ్ కౌన్సెలింగ్ ప్రాక్టీస్)
➨ లాస్ (యాక్సెస్ టు జస్టిస్ )
➨ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ అండ్ లేబర్ రిలేషన్స్
➨ ఆర్గనైజేషన్ డెవలప్ మెంట్
➨ చేంజ్ అండ్ లీడర్ షిప్
➨ సోషల్ ఆంత్రప్రెన్యూర్ షిప్
➨ ఎనలిటిక్స్ (సెల్ఫ్ ఫైనాన్స్ )
➨ మీడియా అండ్ కల్చరల్ స్టడీస్
➨ సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్ షిప్
➨ డెవలప్ మెంట్ పాలసీ
➨ ప్లానింగ్ అండ్ ప్రాక్టీస్
➨ సస్టెయినబుల్ లైవ్లీహుడ్ అండ్ నేచురల్ రిసోర్సెస్ గవర్నెన్స్
➨ సోషల్ వర్క్ ఇన్ రూరల్ డెవలప్ మెంట్
➨ సోషల్ వర్క్ (చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీస్ / కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్ మెంట్ ప్రాక్టీస్ / క్రిమినాలజీ అండ్ జస్టిస్ / దళిత్ ,
➨ ట్రైబల్ స్టడీస్ అండ్ యాక్షన్ / లైవ్ లీ హుడ్స్ అండ్ సోషల్ ఆంత్రప్రెన్యూర్ షిప్స్ / మెంటల్ హెల్త్ / పబ్లిక్ హెల్త్ / ఉమెన్ సెంటర్డ్ ప్రాక్టీస్ / కౌన్సెలింగ్ )
➨ డిజాస్టర్ మేనేజ్ మెంట్
➨ డిజాస్టర్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ జియోస్పేషియల్ టెక్నాలజీస్ (ఏడాది వ్యవధి కోర్సు)
➨ ఎడ్యుకేషన్, ఎకాలజీ.
➨ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, నేచురల్ రిసోర్స్ అండ్ గవర్నెన్స్, రూరల్ డెవలప్ మెంట్ అండ్ గవర్నెన్స్
➨ ఎన్విరాన్ మెంట్ అండ్ సస్ట్టెయినబుల్ డెవలప్ మెంట్
➨ లేబర్ స్టడీస్ అండ్ సోషల్ ప్రొటెక్షన్
➨ పీస్ & కాన్ ఫ్లిక్ట్ స్టడీస్
➨ సోషియాలజీ అండ్ సోషల్ ఆంత్రపాలజీ
➨ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్
➨ బీఎడ్, ఎంఎడ్.. తదితర కోర్సులు.
హైదరాబాద్ క్యాంపస్‌లో..
ఎంఏ | ఎడ్యుకేషన్, సిటీస్ అండ్ గవర్నెన్స్, నేచురల్ రిసోర్సెస్ అండ్ గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, డెవలప్ మెంట్ స్టడీస్, రూరల్ డెవలప్ మెంట్ అండ్ గవర్నెన్స్, ఉమెన్ స్టడీస్. |
పీజీ డిప్లొమా | సిటీస్ అండ్ గవర్నెన్స్, నేచురల్ రిసోర్సెస్ అండ్ గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ కోర్సులు. |
అర్హతలు: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష (టిస్-నెట్) ద్వారా. స్టేజ్-1 పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి స్టేజ్-2 ఆన్‌లైన్ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది ఎంపికలో స్టేజ్-1, 2 రెండింటికీ సమాన వెయిటేజీ ఉంటుంది.
పరీక్ష విధానం: టిస్ నెట్ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 100 నిమిషాలు. ప్రశ్నలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. జనరల్ అవేర్ నెస్-40 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ-30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథ్స్ అండ్ లాజికల్ రీజనింగ్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్, రీజనింగ్, మ్యాథ్స్ విభాగాల్లోని ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్‌లో కటాఫ్ మార్కులు పొందడం తప్పనిసరి. పరీక్షపై అవగాహన కోసం టిస్ వెబ్‌సైట్‌లో మాక్ టెస్టు అందుబాటులో ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.01.2023.
➥ TISS NET స్టేజ్-1 పరీక్ష తేది: 2023, జనవరి 28 - ఫిబ్రవరి 28 మధ్య.
Notification
Online Application
Programmes Details
Also Read:
జేఈఈ అడ్వాన్స్‌డ్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఐఐటీ, ఎన్ఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్-2023 నోటిఫికేషన్ గురువారం (డిసెంబరు 22) విడుదలైంది. గువాహటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, నిట్‌లలో ప్రవేశం కల్పిస్తారు. బీటెక్, బీఎస్, బీఆర్క్, డ్యూయల్ డిగ్రీ (బీటెక్ + ఎంటెక్), డ్యూయల్ డిగ్రీ (బీఎస్ + ఎంఎస్), ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్ 2023లో అర్హత సాధించిన 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.
జేఈఈ మెయిన్-2023 పరీక్షల షెడ్యూలు ఇలా!
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రెండు విడతల్లో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. తొలి విడత పరీక్షలు జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించింది. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 12 వరకు తొలి విడత జేఈఈ మెయిన్ దరఖాస్తుల స్వీకరించనున్నట్లు పేర్కొంది.
జేఈఈ మెయిన్-2023 పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..