By: ABP Desam | Updated at : 25 Dec 2022 07:03 PM (IST)
Edited By: omeprakash
హార్టికల్చర్ పీజీ, పీహెచ్‌డీ కోర్సులు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని డా.వైఎస్సాఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి పలు విభాగాల్లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. డిసెంబరు 28, 29 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
కోర్సు వివరాలు:
1) ఎంఎస్సీ(హార్టికల్చర్)
సీట్లు: 57
కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.
విభాగాలు: ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ & ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ ఏరోమాటిక్ క్రాప్స్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్, ప్లాంట్ పాథాలజీ, ఎంటమాలజీ.
అర్హత: బీఎస్సీ (హార్టికల్చర్)/ బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్.
2) పీహెచ్‌డీ (హార్టికల్చర్)
సీట్లు: 24
కోర్సువ్యవధి: 3 సంవత్సరాలు.
విభాగాలు: ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ & ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ ఏరోమాటిక్ క్రాప్స్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్, ప్లాంట్ పాథాలజీ, ఎంటమాలజీ.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ
వయోపరిమితి: 40 సంవత్సరాలకు మించకూడదు.
కోర్సు అందించే కళాశాలలు: కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్-వెంకటరామన్నగూడెం(పశ్చిమగోదావరి), కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్-అనంతరాజుపేట(వైఎస్ఆర్ జిల్లా).
ఎంపిక విధానం: ఐసీఏఆర్ ఏఐఈఈఏ (పీజీ)-2022, ఐసీఏఆర్ ఏఐసీఈ జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ) 2022 సాధించిన ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను రిజిస్ట్రార్, డా.వై.ఎస్.ఆర్. హార్టికల్చరల్ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, వెంకటరామన్నగూడెం, తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ (ఆఫ్‌లైన్): 31.12.2022.
కౌన్సెలింగ్ తేదీ:
* ఎంఎస్సీ కోర్సులకు - 09.01.2023.
* పీహెచ్‌డీ కోర్సులకు - 10.01.2023.
వేదిక: College of Horticulture,
Venkataramannagudem,
West Godavari Dist.
Also Read:
జేఈఈ అడ్వాన్స్‌డ్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఐఐటీ, ఎన్ఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్-2023 నోటిఫికేషన్ గురువారం (డిసెంబరు 22) విడుదలైంది. గువాహటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, నిట్‌లలో ప్రవేశం కల్పిస్తారు. బీటెక్, బీఎస్, బీఆర్క్, డ్యూయల్ డిగ్రీ (బీటెక్ + ఎంటెక్), డ్యూయల్ డిగ్రీ (బీఎస్ + ఎంఎస్), ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్ 2023లో అర్హత సాధించిన 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి
జనవరిలో ఎంసెట్ నోటిఫికేషన్! ఈ సారికి 'ఇంటర్' వెయిటేజీ లేనట్లే?
తెలంగాణ ఎంసెట్ 2023 నోటిఫికేషన్ జనవరిలో విడుదలకానుంది. ఒకపక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలను వెల్లడించడం, మరోవైపు ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూలును ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణ ఎంసెట్ నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలుపెట్టింది. 2023 జనవరిలో పరీక్షల తేదీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. దీనికోసం మండలి అధికారులు త్వరలో సమావేశం కానున్నారు.
తెలంగాణ ఎంసెట్ 2023 పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్'తో పరీక్షలకు అనుమతి!
ICAI CA Results: సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల
Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్ ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
TSWRES Inter Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?