అన్వేషించండి

Traffic Signal History Telugu: రోడ్డు మీద రెడ్‌ పడగానే బ్రేక్ వేస్తారు! ట్రాఫిక్ లైట్స్ ఐడియా ఎవరికి వచ్చింది? వ్యవస్థ ఎప్పుడు ఎలా ప్రారంభమైంది? 

ప్రపంచంలోనే మొట్టమొదటి గ్యాస్ ఆధారిత ట్రాఫిక్ సిగ్నల్‌ను 1868లో లండన్‌లో ప్రారంభించగా, ఎలక్ట్రిక్ సిగ్నల్ 1914లో అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో 1928లో కోల్‌కతాలో ఏర్పాటు చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • లండన్‌లో 1868లో మొదటి ట్రాఫిక్ లైట్ పేలిపోయింది.
  • అమెరికా 1914లో ఎలక్ట్రిక్, 1920లో మూడు రంగుల సిస్టమ్.
  • భారత్‌లో మొదటి ట్రాఫిక్ సిగ్నల్ 1928లో కోల్‌కతాలో.
  • సిగ్నల్ రంగుల ఎంపిక వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు.

Traffic Signal History Telugu: రోజూ ఉదయం ఆఫీసుకో, కాలేజీకో బయల్దేరడమే ఒక పెద్ద అడ్వేంచర్ టాస్క్. సిటీ రోడ్ల మీదకు రాగానే చుట్టుముట్టే వందల వాహనాలు, అందులో వెహికల్స్ చేసే హారన్ మోత తలనొప్పి కలిగిస్తాయి. ఇలా వస్తుండగానే జంక్షన్ రాగానే కరెక్ట్‌గా పడే రెడ్‌లైట్‌. ఛా... కరెక్ట్‌గా నేను వచ్చేసరికే రెడ్‌ సిగ్నల్ పడాలా అని ఎన్నిసార్లు విసుక్కొని ఉంటారో కాదా. ఇలా రెడ్ సిగ్నల్ పడగానే స్మార్ట్ ఫోన్ వైపో, సిగ్నల్ బోర్డుపై ఉన్న కౌంట్‌డౌన్‌ వైపో చూసే అలవాటు అందరికీ ఉంటుంది. రద్దీగా ఉండే చౌరాస్తాల్లో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తూ, మన ప్రయాణాన్ని సేఫ్ చేసే ఈ మూడు రంగుల సిగ్నల్స్‌ లేకపోతే మన సిటీ లైఫ్‌ అస్తవ్యస్తం అవుతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. కానీ అసలు ఈ ట్రాఫిక్ లైట్స్ ఐడియా ఎవరికి వచ్చింది? ప్రపంచంలోనే మొట్టమొదటి సిగ్నల్ ఎక్కడ ప్రారంభమైంది, భారత్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చిందో చూద్దాం. 

నేడు మనం వాడే అత్యాధునిక ఏఐ పవర్డ్‌ అడాప్టివ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వెనుక ఒక శతాబ్దానికిపైగా సాగిన అద్భుతమైన చరిత్ర ఉంది. మోటారు కార్లు కూడా సిగా రాని కాలంలో గుర్రపు బండ్ల హడావుడిని కంట్రో చేయానికి పుట్టిన ఈ వ్యవస్థ, నేడు గ్లోబల్ డిజిటల్ నెట్‌వర్క్‌గా మారింది. అంతేకాదు. మొట్టమొదటి సిగ్నల్ లైట్‌ కేవలం కొన్ని రోజులకే పేలిపోయింది.. ఈ ఇంట్రెస్టింగ్‌ స్టోరీని, దానికి సంబంధించిన మైండ్ బ్లోయింగ్‌ డిజిటల్ సీక్రెట్స్ ఉన్నాయి. 

లండన్‌ మొదలైన ఫస్ట్‌ ట్రాఫిక్ లైట్‌

కార్ల వాడకం ఇంకా ఊపందుకోని రోజుల్లోనే ట్రాఫిక్ సమస్య మొదలైంది.19వ శతాబ్దం నాటి బ్రిటన్‌లోని లండన్ నగర వీధుల్లో గుర్రపు బండ్లు, కాలినడకన వెళ్లే జనాలు, నెట్టుడు బండ్ల వల్ల విపరీతమైన రద్దీ ఏర్పడేది. ముఖ్యంగా లండన‌లోని బ్రిటిషన్‌ పార్లమెంట్‌ వెలుపల ఉండే గ్రేట్‌ జార్జ్ స్ట్రీట్, బ్రిడ్జ్‌ స్ట్రీట్‌ కూడళ్ల వద్ద ప్రజాప్రతినిధులు రోడ్డు దాటడానికి తీవ్ర ఇబ్బంది పడేవారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి జాన్ పీక్‌ నైట్‌ అనే బ్రిటిష్‌ రైల్వే సిగ్నల్ ఇంజినీర్‌ ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. 

రైల్వేల్లో వాడే రెక్కలతో ఉండే సెమాఫోర్‌ సిగ్నలింగ్‌ సిస్టమ్‌ను రోడ్లపై కూడా ఎందుకు వాడకూడదని ఆయన భావించారు. ఆయన డిజైన్ చేసిన సిస్టమ్‌ను 1868 డిసెంబర్‌ 9న లండన వీధుల్లో మొట్టమొదటిసారిగా ఇన్‌స్టాల్ చేశారు. పగలు 20 అుగులు ఎత్తున్న స్తంభానికి ఉన్న రెక్కలు అడ్డంగా ఉంటే ఆగాలి అని అర్థం. అదే రెక్కలు 30 డిగ్రీల యాంగిల్‌కు కిందకు వాలితే జాగ్రత్తగా వెళ్లాలి అని అర్థం. రాత్రివేళల్లో ఈ రెక్కలు కనిపించవు. కాబట్టి గ్యాస్ ఆధారిత లాంతర్లను వాడేవారు. అందులో ఎరుపు రంగులైట్‌ వస్తే ఆగాలని, ఆకుపచ్చ రంగు వస్తే వెళ్లాలని సిగ్నల్స్‌ ఇచ్చేవారు. దీనిని ఒక పోలీస్ కానిస్టేబుల్‌ మాన్యువల్‌గా లీవర్ తిప్పుతూ ఆపరేట్ చేసేవాడు. 

24 రోజుల్లోనే పేలిపోయిన ప్రయోగం 

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ గ్యాస్‌ ట్రాఫిక్‌ లైట్‌ సిస్టమ్‌ ఎక్కువ రోజులు కొనసాగలేదు. సిగా జనవరి 2, 1869న అంటే ప్రారంభించిన కేవలం 24 రోజుల్లోనే భూగర్భంలోని గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా ఆ లాంతర్‌ కాస్తా భారీ పేలుడుకు గురైంది. ఈ దుర్ఘటనలో అక్కడే ఉండి సిగ్నల్ ఆపరేట్‌ చేస్తున్న పోలీస్ అధకారి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో భయపడిపోయిన లండన్ యంత్రాంగం ఆ ప్రాజెక్టును అక్కడితోనే నిలిపేసింది. ఆ తర్వాత దాదాపు ఐదు దశాబ్దాలపాటు బ్రిటన్‌లో మళ్లీ ట్రాఫిక్‌ లైట్ల జోలికి వెళ్లలేదు. 

1914లో అమెరికాలో మొదటి ఎలక్ట్రిక్ విప్లవం 

లండన్‌లో గ్యాస్ లైట్ ఫెయిల్ అయిన తర్వాత ట్రాఫిక్ సిగ్నల్‌ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది మాత్రం అమెరికా దేశమే. 20th సెంచురీ ప్రారంభం నాటికి హెన్రీ ఫోర్డ్ పుణ్యమా అని మోటార్ కార్ల ఉత్పత్తి భారీగా పెరిగింది. రోడ్లపై గుర్రపు బండ్ల స్థానంలో స్పీడ్‌గా వెళ్లేకార్లు వచ్చాయి. దీంతో యాక్సిడెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ తరుణంలో ఎలక్ట్రిసిటీని వాడుకుని సేఫ్ సిగ్నల్ తయారు చేయాలనే అమెరికన్లు ప్రయత్నాలు ప్రారంభించారు. 

1914 ఆగస్టు 5న అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో గల క్లీవ్‌లాండ్‌ నగరంలో ఈస్ట్ 105స్ట్రీట్, యుక్లిడ్‌ ఎవెన్యూ కూడలి వద్ద ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేశారు. జేమ్స్‌ హోగ్‌ అనే ఇన్వెంటర్‌ డిజైన్ చేసిన ఈ సిస్టమ్‌కు అమెరికన్ ట్రాఫిక్ సిగ్నల్ కంపెనీ రూపకల్పన చేసింది. ఇందులో కేవలం రెండు రంగులు మాత్రమే ఉండేవి. అవి రెడ్, గ్రీన్. లైట్లు మారే మందు డ్రైవర్లను అలర్ట్ చేయానికి ఒక పెద్ద బజర్ శబ్దం వచ్చేది.. దీనిని కూడా జంక్షన్ పక్కన ఉన్న ఒక కంట్రోల్ బూత్‌ నుంచి పోలీసులే మాన్యువల్‌గా కంట్రోల చేసేవారు. 

మూడు రంగుల మాడరన్ సిగ్నల్ వ్యవస్థ ఎప్పుడు వచ్చింది?

మనం ప్రస్తుతం చూస్తన్న ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల త్రీ కలర్‌ సిస్టమ్‌ 1920లో రూపుదిద్దుకుంది. డెట్రాయిట్ నగరానికి చెందిన పోలీస్ ఆఫీసర్‌ విలియం పాట్స్‌ మొదటిసారిగా ఎల్లో రంగును లైట్ల మధ్య చేర్చారు. ఆకుపచ్చ నుంచి ఎరుపు రంగులోకి మారే క్రమంలో వెహికల్స్ వేగాన్ని తగ్గించుకోవడానికి ఈ పసుపు రంగు అద్భుతంగా పని చేసింది. ఆ తర్వాత 1923లో గారెట్‌ మోర్గాన్ అనే ఆఫ్రో అమెరికన్ ఇన్వెంటర్ ఆటోమేటిక్ త్రీ పొజిషన్ ట్రాఫిక్ సిగ్నల్ పేటెంట్‌ను సాధించి, కమర్షియల్‌గా సక్సెస్ అయ్యాడు. 

భారత్‌లోకి ట్రాఫిక్ లైట్స్ ఎంట్రీ ఎప్పుడు

భారత్‌లో బ్రిటీష్ పాలన సాగుతున్న కాలంలోనే మెట్రో నగరాలు డెవలప్‌‌ అవ్వడం ప్రారంభించాయి. ఆ కాలంలోనే దేశంలోకి కార్లు రావడం, రోడ్లపై రద్దీ పెరగడం చూసి బ్రిటిష్ పాలకులు భారత్‌లో కూడా ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను ప్రవేశపెట్టాలని భావించారు. 

అయితే, భారత్‌లో మొట్టమొదటి ట్రాఫిక్ సిగ్నల్‌ ఎక్కడ ప్రారంభమైంది అనేదానిపై భిన్నమైన చారిత్రిక రికార్డులు ఉన్నాయి. మెజారిటీ చారిత్రక ఆధారాల ప్రకారం, 1928లోనే అప్పటి దేశ రాజధాని, అత్యంత కీలకమైన పారిశ్రామిక నగరమైన కోల్‌కతాలోని డల్హౌసీ స్క్వేర్‌, ఎస్ప్లానేడ్‌ కూడలి వద్ద మొట్టమొదటి ట్రాఫిక్ లైట్లను ఏర్పాటు చేశారు. 

దీని తర్వాత దేశంలోనే అతి పెద్ద వాణిజ్య నగరంగా ఎదుగుతున్న ముంబైలో 1939లో అధికారికంగా మోడ్రన్ మ్యాన్యువల్‌ ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్‌ చేశారు. ముంబైలోని అత్యంత రద్దీ ప్రాంతమైన హార్నబై రోడ్‌, క్రాఫోర్ట్‌ మార్కెట్‌ సమీపంలో దీనిని పెట్టారు. ఆ రోజుల్లో ట్రామ్‌లు, గుర్రపు బండ్లు, వింటేజ్ బ్రిటిష్ కార్లు ఈ సిగ్నల్‌ ఆధారంగానే కదిలేవి. దక్షిణ భారత్‌లో తమిళనాడులోని చెన్నైలోని ఎగ్నూర్‌ జంక్షన్‌ వద్ద 1953లో మొట్టమొదటి అధికారిక ఆటోమేటెడ్‌ త్రీ కలర్‌ ట్రాఫిక్ సిగ్నల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 1963లో బెంగళూరులోని కార్పొరేషన్ సర్కిల్‌ వద్ద ఫస్ట్ సిగ్నల్‌ వెలిసింది. 

రెడ్, ఎల్లో, గ్రీన్ రంగుల ఎంపిక వెనుకున్న సీక్రెట్ 

ట్రాఫిక్ సిగ్నల్ అనగానే మనకు గుర్తుకువచ్చేది రెడ్, ఎల్లో, గ్రీన్. వీటి ఎంపిక వెనుక చాలా బలమైన కారణం ఉంది. ఇందులో ఫిజిక్స్ కాన్సెప్టు దాగి ఉంది. విజిబుల్ స్పెక్ట్రమ్‌లో ఎరుపు రంగుకు అన్ని రంగుల కంటే ఎక్కువ వేవ్‌లెంగ్త్‌ ఉంది. వాతావరణం ఎలా ఉన్నా సరే ఇది చెక్కు చెదరదు. స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎరుపు రంగు ప్రమాదానికి సూచికగా బ్రెయిన్ రిజిస్టర్ చేసుకుంది. అందుకే దీన్ని వాడారు. 

విజిబిలిటీలో తర్వాత స్థానం ఎల్లోదే. దీనికి వేవ్‌లెంగ్త్‌ ఎరుపు కంటే కొంచెం తక్కువ, ఆకుపచ్చ కంటే ఎక్కువ. కంటికి చాలా త్వరగా చిక్కే రంగు ఇది. సిగ్నల్‌ మారబోతోంది అనడానికి ఇది పర్ఫెక్ట్ వార్నింగ్ కలర్. మొదట్లో రైల్వేలలో గో సిగ్నిల్‌ కోసం వైట్‌ లైట్ వాడే వారు. కానీ ఒకసారి వైట్‌లైన్స్‌ కలర్‌ ప్లేట్‌ ఊడిపోవడం వల్ల, డ్రైవర్‌ పొరబడి గ్రీన‌ అనుకొని ట్రైన్ నడపడం వల్ల పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఆ తర్వాత వైట్‌ ప్లేస్‌లో గ్రీన్‌ను ప్రవేశపెట్టారు. ఆకుపచ్చ రంగు కంటికి అహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా, ఎరుపునకు పూర్తిగా భిన్నమైన రంగు కావడం వల్ల దీనిని సులభంగా గుర్తించవచ్చు. 

Frequently Asked Questions

ప్రపంచంలో మొదటి ట్రాఫిక్ లైట్ ఎక్కడ, ఎప్పుడు ప్రారంభమైంది?

లండన్ నగరంలో 1868 డిసెంబర్ 9న జాన్ పీక్ నైట్ రూపొందించిన మొదటి ట్రాఫిక్ లైట్ ప్రారంభమైంది. ఇది గ్యాస్ ఆధారిత సెమాఫోర్ సిస్టమ్, దీనిని పోలీస్ కానిస్టేబుల్ మాన్యువల్‌గా ఆపరేట్ చేసేవారు.

మొదటి ట్రాఫిక్ సిగ్నల్ ఎందుకు పేలిపోయింది?

1869 జనవరి 2న, ప్రారంభించిన 24 రోజుల్లోనే భూగర్భ గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా మొదటి గ్యాస్ ఆధారిత ట్రాఫిక్ లైట్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు, దీంతో ప్రాజెక్టును నిలిపేశారు.

ప్రపంచంలో మొదటి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కడ ప్రారంభమైంది?

ప్రపంచంలోనే మొదటి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ సిగ్నల్ 1914 ఆగస్టు 5న అమెరికాలోని క్లీవ్‌లాండ్ నగరంలో ప్రారంభమైంది. జేమ్స్ హోగ్ అనే ఇన్వెంటర్ దీనిని డిజైన్ చేశారు, దీనిలో రెడ్, గ్రీన్ రంగులు మాత్రమే ఉండేవి.

ట్రాఫిక్ సిగ్నల్‌లో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులను ఎందుకు వాడతారు?

ఎరుపు రంగుకు ఎక్కువ వేవ్‌లెంగ్త్ ఉండటం వల్ల ఏ వాతావరణంలోనైనా స్పష్టంగా కనిపిస్తుంది, ప్రమాదాన్ని సూచిస్తుంది. పసుపు రంగు మార్పును హెచ్చరించడానికి, ఆకుపచ్చ రంగు ముందుకు వెళ్లడానికి ఉపయోగపడతాయి.

భారతదేశంలో మొట్టమొదటి ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది?

మెజారిటీ చారిత్రక ఆధారాల ప్రకారం, భారతదేశంలో మొట్టమొదటి ట్రాఫిక్ సిగ్నల్ 1928లో కోల్‌కతాలోని డల్హౌసీ స్క్వేర్, ఎస్ప్లానేడ్ కూడలి వద్ద ఏర్పాటు చేయబడింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ISRO Scientists Resign:ఇస్రోలో 100 మందికిపైగా శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామా చేశారు? కేంద్రం తీసుకున్న చర్యలు ఏంటి?
ఇస్రోలో 100 మందికిపైగా శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామా చేశారు? కేంద్రం తీసుకున్న చర్యలు ఏంటి?
UPSC Prelims 2026: యూపీఎస్సీ పరీక్ష ప్రక్రియలో ఏఐ వాడకం! పరీక్షకు ముందే 569 మంది దరఖాస్తులు తిరస్కరణ!
యూపీఎస్సీ పరీక్ష ప్రక్రియలో ఏఐ వాడకం! పరీక్షకు ముందే 569 మంది దరఖాస్తులు తిరస్కరణ!
NEET JEE Weightage Changes: NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
Telangana Breakfast Scheme: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget