అన్వేషించండి

NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి

NMMSS Scholarship Registration | నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు చదువు కొనసాగించడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • NMMSS 2026-27 రిజిస్ట్రేషన్లు ప్రారంభం; 9-12 తరగతులకు అవకాశం.
  • ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల డ్రాపౌట్ తగ్గించడానికి ఆర్థిక సహాయం.
  • నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా ఆగస్టు 31 లోపు దరఖాస్తు.

విద్యా మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ విద్యార్థులకు స్కాలర్‌షిప్ అప్డేట్ ఇచ్చింది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMSS) కోసం విద్యా సంవత్సరం 2026-27 రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది. ఈ పథకం కింద 9వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు తొలిసారి స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 10 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమకు వస్తున్న స్కాలర్‌షిప్‌ను రెన్యూవల్ చేసుకోవడం కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తుకు చివరి తేదీని ఆగస్టు 31గా నిర్ణయించారు. దీని కోసం విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం NMMSS పథకం

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు చదువు కొనసాగించడానికి ఆర్థిక సహాయం అందించడం. ఈ స్కీమ్ ప్రత్యేకంగా 8వ తరగతి తర్వాత డ్రాపౌట్ కాకుండా, విద్యార్థులు తమ చదువును కొనసాగించేలా ప్రోత్సహిస్తుంది. కేంద్ర ప్రభుత్వపు ఈ పథకం ఒక ప్రధాన ఉద్దేశం బడి మానేయడం అంటే డ్రాప్‌అవుట్ సమస్యను తగ్గించడం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతుందో, వారికి ఈ స్కాలర్‌షిప్ ద్వారా చదువు కొనసాగించడంలో సహాయం లభిస్తుంది.

NMMSS కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

NMMSS కోసం ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందే (ఎయిడెడ్),  స్థానిక సంస్థల పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. వీరితో పాటు 10, 11, 12 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు తమ స్కాలర్‌షిప్‌ కోసం రెన్యూవల్ దరఖాస్తు చేసుకోవాలి అయితే రెన్యూవల్ కోసం విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు సంబంధించిన నిర్ణీత నిబంధనలను పూర్తి చేయాలి. దీంతో పాటు విద్యార్థులు NMMSS వంటి మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్ కాకుండా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్కాలర్‌షిప్ పథకాల కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే సంబంధిత స్కీమ్ అర్హతలను పూర్తి చేయాలి. 

ఆగస్టు 31 వరకు దరఖాస్తులకు ఛాన్స్

NMMSS 2026-27 కోసం కొత్తవి, రెన్యూవల్ రెండింటికీ చివరి తేదీ ఆగస్టు 31, 2026గా నిర్ణయించారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత సమయం లోపలే తమ దరఖాస్తును పూర్తి చేయాలి. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

NMMSS Scholarship 2026-27 ఇలా దరఖాస్తు చేయండి

స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయడానికి మొదట నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ https://scholarships.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లండి.

తొలి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ముందుగా New Registration ప్రక్రియను కంప్లీట్ చేయాలి.

రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వచ్చిన లాగిన్ వివరాల సహాయంతో పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.

ఆ తర్వాత అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్ పథకాలలో National Means cum Merit Scholarship Scheme (NMMSS) ని సెలక్ట్ చేసుకోవాలి. 

ఇప్పుడు దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన అవసరమైన సమాచారాన్ని నింపి, అవసరమైన పత్రాలను (డాక్యుమెంట్లను) అప్‌లోడ్ చేయండి.

అన్ని వివరాలు నింపిన తర్వాత ఒకసారి ఫామ్‌ను బాగా సరిచూసుకుని, ఆపై అప్లై ఆప్షన్ సబ్‌మిట్ చేయండి.

దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం కన్‌ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని మీ వద్ద ఉంచుకోవాలి. 

దరఖాస్తు తర్వాత రెండు దశల్లో వెరిఫికేషన్

NMMSS కోసం దరఖాస్తు చేసినంత మాత్రాన ప్రక్రియ పూర్తికాదు. విద్యార్థుల దరఖాస్తు ఫారమ్ వెరిఫికేషన్ కూడా అవుతుంది.  ఈ వెరిఫికేషన్ 2 దశల్లో పూర్తవుతుంది. ఇందులో మొదటి దశలో ఇన్స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ (INO) విద్యార్థుల అప్లికేషన్  వెరిఫై చేస్తారు. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 15 నాటికి పూర్తవుతుంది. ఆ తర్వాత రెండో దశలో డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ (DNO) దరఖాస్తును వెరిఫై చేస్తారు. దీనిని సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. 

 

Frequently Asked Questions

NMMSS పథకం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?

ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు చదువు కొనసాగించడానికి ఆర్థిక సహాయం అందించడం. 8వ తరగతి తర్వాత డ్రాపౌట్ సమస్యను తగ్గించడం కూడా దీని ఉద్దేశ్యం.

NMMSS స్కాలర్‌షిప్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందే పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 10 నుండి 12వ తరగతి విద్యార్థులు తమ స్కాలర్‌షిప్‌ను రెన్యూవల్ చేసుకోవచ్చు.

NMMSS స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?

కొత్త దరఖాస్తులు మరియు రెన్యూవల్స్ రెండింటికీ ఆగస్టు 31 చివరి తేదీగా నిర్ణయించారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత సమయం లోపలే దరఖాస్తు పూర్తి చేయాలి.

NMMSS స్కాలర్‌షిప్ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?

NMMSS స్కాలర్‌షిప్ కోసం విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) వెబ్‌సైట్ scholarships.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget