అన్వేషించండి

Talliki Vandanam Scheme: ఇంట్లో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం తదుపరి విడత నిధుల జమ తేదీని ప్రకటించింది. ఈ పథకం దరఖాస్తు విధానం, అర్హతలు గురించి తెలుసుకుందాం.

Talliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం పథకం' 2026-27 విద్యా సంవత్సరానికి డబ్బులు విడుదలపై ప్రకటన చేసింది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులకు జూన్ 2026 లో నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. పేద, మధ్య విద్యార్థుల చదువును కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. ఇంట్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తుంది. స్కూల్ డ్రాప్ అవుట్ల తగ్గించడం కోసం రూ.15 వేలు నేరుగా తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు.  

తల్లి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15,000 జమ చేస్తారు. ఇందులో రూ.13,000  తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. రూ.2,000 స్కూల్, కాలేజీ నిర్వహణ కోసం 
తల్లి లేనిప పక్షంలో తండ్రి లేదా సంరక్షకుడి బ్యాంకు అకౌంట్ డబ్బులు జమ చేస్తారు. 

తదుపరి విడత ఎప్పుడు? 

జూన్ 2026లో తల్లికి వందనం డబ్బులు విడుదల చేస్తారు. వచ్చే విద్యాసంవత్సరం స్కూల్లు ప్రారంభమైన అయిన వెంటనే డీబీటీ ద్వారా డబ్బులు జమ చేస్తారు. ఈ డబ్బులను స్కూలు ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ కోసం ఉపయోగించాలని ప్రభుత్వం సూచిస్తుంది. 

అర్హతలు

  1. ఈ పథకానికి 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదవాలి. 
  2. ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్కూళ్లలో చదవాలి.
  3. కనీసం 75% హాజరు తప్పనిసరి
  4. తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి. 
  5. బ్యాంకు అకౌంట్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి
  6. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షల కంటే తక్కువ ఉండాలి.  
  7. కుటుంబంలో ఎంత మంది పిల్లలు అంత మందికి ఒక్కొక్కరికీ రూ. 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు.
  8. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, ప్రజా ప్రతినిధుల పిల్లలు అనర్హులు. 

తల్లికి వందనం పథకం దరఖాస్తు విధానం

  • ప్రస్తుతం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక విధానం అందుబాటులో లేదు.
  • ఈ పథకం కింద విద్యార్థి పేరు నమోదు చేయించుకోవడానికి వారి తల్లిదండ్రులు పాఠశాల హెడ్ మాస్టర్ లేదా గ్రామ సచివాలయం సిబ్బందిని సంప్రదించవచ్చు.
  • పాఠశాల డేటాను సేకరించి, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తుంది. 
  • లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడాలంటే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఆధార్‌తో NPCI లింకింగ్ అయి ఉండాలి.

సెలక్షన్ ప్రాసెస్

  • దరఖాస్తుదారు సమర్పించిన సర్టిఫికెట్లను పరిశీలించి అర్హతను గుర్తిస్తారు.
  • కుటుంబ ఆర్థిక స్థితి, విద్యార్థి హాజరు శాతం ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేస్తారు.  

అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? 

అప్లికేషన్ స్టేటస్ ను ఆధార్ నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్ https://gsws-nbm.ap.gov.in/ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు.

Frequently Asked Questions

తల్లికి వందనం పథకం ఎప్పుడు విడుదలవుతుంది?

తల్లికి వందనం పథకం కింద 2026-27 విద్యా సంవత్సరానికి డబ్బులు జూన్ 2026 లో విడుదల చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం స్కూల్స్ ప్రారంభమైన వెంటనే DBT ద్వారా డబ్బులు జమ అవుతాయి.

ఈ పథకం కింద ఎంత ఆర్థిక సహాయం అందిస్తారు?

ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందులో రూ.13,000 తల్లి బ్యాంక్ ఖాతాలో, రూ.2,000 స్కూల్ నిర్వహణకు జమ చేస్తారు.

తల్లికి వందనం పథకానికి అర్హతలు ఏమిటి?

1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్కూళ్లలో చదివేవారు, 75% హాజరు ఉన్నవారు, రూ. 2 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలు అర్హులు.

ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి?

ప్రస్తుతం ఆన్లైన్ దరఖాస్తు విధానం లేదు. విద్యార్థులు పాఠశాల హెడ్ మాస్టర్ లేదా గ్రామ సచివాలయం సిబ్బందిని సంప్రదించి పేరు నమోదు చేసుకోవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Andhra Pradesh Law and Order Issue: మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?
మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Embed widget