అన్వేషించండి

ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్

హైదరాబాద్లో ఇటీవల వరుస దాడులతో కల్తీ మాఫీయా వెన్నులో వణుకు పట్టున్నారు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్. ఫుడ్ సేఫ్టీ అధికారుల సమన్వయంతో జరుగుతున్న ఈ దాడుల్లో సంచల విషయాలు వెలుగుచూస్తున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైదరాబాద్‌లో మూడు నెలలుగా HFAST టీమ్ కల్తీ ఆహారంపై దాడులు.
  • కుళ్ళిన మాంసం, పనీర్, పెరుగులో కల్తీలు గుర్తించి 121 టన్నులు సీజ్.
  • కల్తీ ఆహారంపై జరిమానాతో కఠిన చర్యలు; 8712661212కు ఫిర్యాదు.
  • జిమ్ ట్రైనర్ల మోసాలపై నిఘా; స్టెరాయిడ్స్ అమ్మేవారిని టాస్క్ ఫోర్స్ అరెస్టు.

హైదరాబాద్‌లో కల్తీగాళ్ల భరతం పట్టేందుకు ఒక ఫోన్ చేస్తే చాలు అంటున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్‌. ఏబీపీ దేశంతో మాట్లాడిన ఆయన కీలక విషయాలు వెల్లడించారు. 

ABP దేశం: హైదరాబాద్‌లో రెస్టారెంట్లు,హోటళ్లపై ఇటీవల జరుగుతున్న టాస్క్ ఫోర్స్ వరుస దాడుల ఉద్దేశ్యం ఏంటి? ఏం చెప్పబోతున్నారు.?

వైభవ్ గైక్వాడ్ , టాస్క్ ఫోర్స్ డీసీపీ: గత మూడు నెలలుగా హైదరాబాద్‌లో టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలసి హెచ్ ఫాస్ట్ ప్రత్యేక టీమ్ ఏర్పాటైంది. దీని ప్రధాన ఉద్దేశ్యం కల్తీ ఆహారం తయారు చేసేవారు, సరఫరా చేసేవాళ్లు, విక్రయించే వాళ్లు ఇలా వీరిపై ప్రత్యేక నిఘా పెట్టాలనే ఉద్దేశ్యంతో పని చేస్తున్నాం. సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో ఈ టీమ్ పనిచేస్తోంది. గత మూడు నెలల్లో కల్తీ ఆహారం సరఫరా చేస్తున్న హైదరాబాద్ రెస్టారెంట్లపై  185 క్రిమినల్ కేసులు నమోదు చేశాం. ఆహార తయారీలో నిబంధనలు పాటించని రెస్టారెంట్లపై 250 కేసులు నమోదు చేశాం. మూడు నెలల్లోనే 121 టన్నుల కల్తీ, కుళ్లిన ఆహారం సీజ్ చేశాం. రెస్టారెంట్లు, వేర్ హౌసెస్ కచ్చితంగా ఫుడ్ సేప్టీ రూల్స్ పాటించాలి. తక్కువ ధరకు నాణ్యత లేని, కల్తీ నూనెలు వాడటం, కుళ్లిన మాంసం వాడటం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ దాడుల ద్వారా వ్యాపారులను ఇబ్బంది పెట్టాలనేది మా ఉద్దేశ్యం కాదు. ప్రజలకు మంచి ఆహారం అందించాలనే లక్ష్యంతోనే ఈ వరుస దాడులు చేస్తున్నాం. 

ABP దేశం: ఇటీవల టాస్క్ ఫోర్స్ దాడుల్లో హైదరాబాద్‌లో వెలుగు చూసిన సంచలన విషయాలేంటి? రెస్టారెంట్ కిచెన్‌లలో మీరు షాకయ్యే పరిస్థితులు ఎదురయ్యాయా?

వైభవ్ గైక్వాడ్ , టాస్క్ ఫోర్స్ డీసీపీ: హైదరాబాద్ నగరవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే వెజ్, నాన్ వెజ్ కల్తీకి పాల్పడుతున్నవారిపై కేసులు బుక్ చేశాం. వెజ్ లో ముఖ్యంగా పన్నీర్ , పెరుగు, ఐస్ క్రీమ్ కల్తీ బాగా జరుగుతున్నట్లుగా గుర్తించాం. పామాయిల్ మిక్స్ చేసి, నకిలీ బ్రాండింగ్ చేస్తూ ఆహారపదార్దాలు అమ్ముతున్నారు. ఇప్పటే అనేకసార్లు వినియోగదారులకు, రెస్టారెంట్ ఓనర్లకు అవగాహాన కోసం మీటింగ్ లు పెట్టాం. నాన్ వెజ్ లో కుళ్లిన మాంసం మిక్స్ చేయడం, మటన్ లో బీఫ్ మిక్స్ చేసి అమ్మేస్తున్నట్లుగా గుర్తించాం. ఇలా ఆహారం తయారీ విధానంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. ఎప్పటికప్పుడు తనిఖీలు విస్కృతంగా చేస్తున్నాం. కల్తీని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాం.

ABP దేశం: మటన్,ఫిష్, రొయ్యలు మాంసంలో హానికరమైన కెమికల్స్, ఇంజెక్షన్లు కలిపి ఏడాదికిపైగా ఎందుకు నిల్వ ఉంచుతున్నారు? అంతలా ఎందుకు బరితెగిస్తున్నారు? లాభం వస్తున్నా ఎందుకు ఈ రకమైన కల్తీకి పాల్పడుతున్నారు?

వైభవ్ గైక్వాడ్ , టాస్క్ ఫోర్స్ డీసీపీ: కొందరు వ్యాపారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం రావాలి, త్వరగా వ్యాపారంలో ఎదగాలని ఇలా ఆహార కల్తీకి పాల్పడుతున్నారు. మార్కెట్ లో సాధారణంగా వినియోగదారులు చాలా మంది ఆహారం కొనేటప్పుడు తయారీ తేది, గడువు ముగింపు తేది, బ్రాండ్ ,ఇలా ఇవేవీ చూడటంలేదు. ఏది తక్కువ ధరలకు దొరికితే అవే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలా వినియోగదారుల బలహీనతను అవకాశంగా తీసుకుని తక్కువ ధరల్లో కల్తీ ఆహారపదార్థాలు అమ్మేస్తున్నారు నిర్వాహకులు. మార్కెట్ పోటీలో తట్టుకునేందుకు ఇలా బరితెగిస్తున్నారు. 

ABP దేశం: హైదరాబాద్‌లో రెస్టారెంట్స్‌లో ఆహార కల్తీ వెనుక ఎవరైనా మాఫియా ఉందా? వాస్తవాలేంటి.?

వైభవ్ గైక్వాడ్ , టాస్క్ ఫోర్స్ డీసీపీ: నగరంలో ఆహార కల్తీ వెనుక మాఫీయా ప్రమేయం ఉందని అనుకోవడంలేదు. హోటల్ నిర్వాహకులు వ్యక్తిగతంగానే కొందరు ఈ రకమైన కల్తీలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో రెస్టారెంట్ యజమానికి సైతం ఆహార కల్తీపై అవగాహన లేదనే విషయాలు మా దాడుల్లో గుర్తించాం. కొందరు రెగ్యూలర్‌గా సప్లయర్ మీద నమ్మకంతో ముడిసరుకు కొనుగోలు చేస్తున్నారు. ఆ ముడిసరుకులో కల్తీ జరిగిన విషయం హోటల్ నిర్వాహకులు సైతం గుర్తించలేని సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరు రెస్టారెంట్ యజమానులు కావాలనే తక్కువ ధరకు, నాణ్యతలేని ముడిసరుకు కొంటున్నారు. రెస్టారెంట్లలో ఎక్కువగా అపరిశుభ్ర వాతావరణం మా తనిఖీల్లో గుర్తించాం. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై ఇలా వీటిలో ఎక్కువగా వాడిన నూనెనే అనేకసార్లు మళ్లీ వాడుతున్నట్లుగా తేలింది. హెచ్ ఫాస్ట్ టీమ్ ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్‌పై రెగ్యూలర్‌గా ఫిర్యాదులు వస్తున్నాయి.

ABP దేశం: కల్తీకి పాల్పడుతున్నవారిపై చట్టపరంగా ఎటువంటి శిక్షలుంటాయి. కల్తీని గుర్తిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఓసారి కల్తీ చేస్తూ దొరికితే తిరిగి మరోపేరుతో వ్యాపారం కొనసాగించడంపై ఏమంటారు.?

వైభవ్ గైక్వాడ్ , టాస్క్ ఫోర్స్ డీసీపీ: హైదరాబాద్ నగరంలో చాలా రెస్టారెంట్‌లో అపరిశుభ్ర వాతావరణం, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు కిచెన్‌లలో చూశాం. కాక్రోచ్‌లు తిరుగుతూ, ఆహారపదార్థాలపై కాక్రోచెస్ వాలుతున్న దారుణ పరిస్థితులు చూశాం. గుట్కాలు తిని కిచెన్‌లో ఉమ్ముతున్నారు. ప్రముఖ రెస్టారెంట్ల పేర్లు చెప్పలేం కానీ, దాదాపు అన్ని రెస్టారెంట్లు మా తనిఖీల్లో నిబంధనలు పాటించనట్లుగా గుర్తించాం. వినియోగదారులు నాణ్యమైన ఆహారం పొందడటం వారి హక్కు. హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారం కట్టడి చేయడానికి, నగరవాసులకు మంచి , నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవడానికే హెచ్ ఫాస్ట్ టీమ్ పనిచేస్తుంది. 

మా తనిఖీలలో ఆహారం కల్తీ చేస్తూ పట్టుబడితే ఫుడ్ సేఫ్టీ యాక్ట్ లో భాగంగా వివిధ చట్టాలతోపాటు, బీఎన్ ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఫైన్ నుంచి జీవిత ఖైదు వరకూ శిక్షలున్నాయి. కల్తీ ఆహారం తిని ఏవరైనా చనిపోతే, అటువంటి ఆహారం అమ్మిన, తయారు చేసిన వారికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఎవరైనా రిపీటెడ్‌గా చేస్తున్నారో వాళ్ల లైసెన్స్ పూర్తిగా రద్దుకు సిఫార్సు చేస్తాము. హెచ్ ఫాస్ట్ టీమ్ తనిఖీలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. రిపీటెడ్ గా కల్తీ చేస్తున్నవారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. మీరు రెస్టారెంట్ లేదా స్ట్రీట్ ఫుడ్ తింటున్నప్పుడు అది కల్తీ ఆహారం అని అనుమానం వస్తే వెంటనే హెచ్ ఫాస్ట్ టీమ్ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి మీరు ఫిర్యాదు చేయవచ్చు. హెచ్ ఫాస్ట్ టోల్ ఫ్రీ నెంబర్- 8712661212. రెస్టారెంట్ లలో చాలా సందర్బాల్లో కల్తీని వెంటనే నిర్దారించలేం, వెంటనే ల్యాబ్‌కు పంపి కల్తీ ఏ స్థాయిలో జరిగిందో నిర్దారిస్తున్నాము. 

ABP దేశం: మీరు రెస్టారెంట్‌ల్లో ఆహారం తింటారా? మీ తనిఖీ తరువాత మీ వ్యక్తిగత అనుభం ఏంటి? క్లౌడ్ కిచెన్ లు విపరీతంగా పెరుగుతున్నాయి.. వాటిపై నిఘా ఎలా ఉండబోతోంది?

వైభవ్ గైక్వాడ్ , టాస్క్ ఫోర్స్ డీసీపీ: నా ఒక్కడికే కాదు, ప్రతీ ఒక్కరూ ఆహార కల్తీపై అవగాహనతో ఉండాలి. ప్రజలకు సైతం మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. తయారీ, గడువు ముగింపు తేదీలు కచ్చితంగా చూసిన తరువాతనే ఆహార పదార్థాలు కొనాలి. హైదరాబాద్ నగరంలో ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే, భవిష్యత్‌లో అవసరమైతే హద్దు మీరుతున్న రెస్టారెంట్ నిర్వాహకులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. క్లౌడ్ కిచెన్ లపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఈ కామర్స్ వెబ్ సైట్స్ ద్వారా ఆహారం సరఫరా చేస్తున్నవారిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం.

ABP దేశం: స్టెరాయిడ్స్ పేరుతో కొందరు జిమ్ ట్రైనర్లు ప్రాణాలు తీసున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్టెరాయిడ్స్ విషయంలో నగరంలో ఏం జరుగుతోంది.?

వైభవ్ గైక్వాడ్ , టాస్క్ ఫోర్స్ డీసీపీ: సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఇటీవల హానికరమైన స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. హైదరాబాద్ లో జిమ్ కల్చర్ ఎక్కువగా ఉంది. తక్కువ టైమ్ లో మజిల్ బిల్డ్ చేయాలి, సిక్స్ ప్యాక్ రావాలని తొందరపడేవారిని కొందరు జిమ్ ట్రైనర్స్ తప్పుదోవ పట్టిస్తున్నారు. హానికరమైన ఇంజెక్షన్లు , స్టెరాయిడ్స్ , ట్యాబ్‌లెట్స్ తీసుకోవాలంటూ యువతను ప్రేరేపిస్తున్నారు . ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్ నుంచి ఆర్డర్ చేస్తున్నారు. జిమ్ ఓనర్లు , జిమ్ ట్రైనర్ లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఇవి వాడితే మానసిక, శారీరక సమస్యలు తలెత్తడంతోపాటు ప్రాణాపాయ పరిస్థితులకు చేరుకుంటారు. వైద్యనిపుణుల సలహా మేరకు మాత్రమే ఇవి వాడాలి. హానికరమైన స్టెరాయిడ్స్ అమ్మకాలపై నిఘా కొనసాగుతోంది. 

Frequently Asked Questions

హైదరాబాద్‌లో టాస్క్ ఫోర్స్ దాడుల ఉద్దేశ్యం ఏమిటి?

కల్తీ ఆహారాన్ని తయారు చేసే, సరఫరా చేసే, విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడమే మా లక్ష్యం.

కల్తీ ఆహారం అనుమానం వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

కల్తీ ఆహారం అని అనుమానం వస్తే, వెంటనే హెచ్ ఫాస్ట్ టీమ్ టోల్ ఫ్రీ నెంబర్ 8712661212 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

కల్తీ ఆహారానికి పాల్పడేవారికి ఎలాంటి శిక్షలు ఉంటాయి?

ఫుడ్ సేఫ్టీ యాక్ట్, బీఎన్ ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు. జరిమానా నుండి జీవిత ఖైదు వరకు, మరణానికి కారణమైతే యావజ్జీవ కఠిన కారాగార శిక్ష కూడా ఉంటుంది.

హైదరాబాద్‌లో సాధారణంగా ఎలాంటి ఆహార కల్తీలను గుర్తించారు?

వెజ్‌లో పన్నీర్, పెరుగు, ఐస్ క్రీమ్ కల్తీ; నాన్ వెజ్‌లో కుళ్లిన మాంసం, మటన్‌లో బీఫ్ కలపడం గుర్తించారు. నాణ్యత లేని నూనెలు, నకిలీ బ్రాండింగ్ కూడా ఉపయోగిస్తున్నారు.

ఆహార కల్తీని నివారించడంలో వినియోగదారుల పాత్ర ఏమిటి?

వినియోగదారులు ఆహార పదార్థాలు కొనేటప్పుడు తయారీ, గడువు ముగింపు తేదీలు తప్పకుండా చూడాలి. చౌక ధరలకు లభించే ఆహారాన్ని కొనే ముందు జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget