అన్వేషించండి

Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?

Hyderabad Restaurants Hygiene Rating: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టాప్ హోటళ్లు, స్కూల్ క్యాంటీన్లలో బయటపడ్డ అక్రమాలు.. కేవలం సోదాలేనా? చర్యలుంటాయా?

Cyberabad Municipal Corporation Food Safety Scores:  తెలంగాణలో గత కొన్ని వారాలుగా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహిస్తున్న మెరుపు దాడులు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలతో సమాచారాన్ని అప్‌డేట్ చేస్తుండటంతో ప్రజల్లో విపరీతమైన అవేర్‌నెస్ వస్తోంది. మొదట్లో కేవలం బిర్యానీ పాయింట్లు, షావర్మా సెంటర్లకే పరిమితమైన ఈ తనిఖీలు.. ఇప్పుడు ఏకంగా వేలాది మంది పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల సెంట్రల్ కిచెన్ల  వరకు వెళ్లాయి. అక్కడ ఈగలు ముసరడం, కుళ్లిన కూరగాయలు వాడటం వంటి దారుణాలు బయటపడటంతో తల్లిదండ్రులు వణికిపోతున్నారు. అయితే, ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే.. ఈ సోదాల తర్వాత ప్రభుత్వం తీసుకునే శాశ్వత చర్యలు ఏమిటి?

హోటళ్లు మారడానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారు? 

సమాజంలో చిన్న హోటళ్లు లేదా బడ్జెట్ రెస్టారెంట్లు కొన్ని చోట్ల మెరుగైన మార్కులు సాధిస్తున్నప్పటికీ.. బ్రాండ్ ఇమేజ్ ఉండి, ప్లేట్ బిర్యానీకి వందల రూపాయలు వసూలు చేసే హైదరాబాద్‌లోని కొన్ని లగ్జరీ, ప్రముఖ హోటళ్ల కిచెన్లు అత్యంత నాసిరకంగా, అనారోగ్యానికి కారణమయ్యేలా ఉండటం షాక్‌కు గురిచేస్తోంది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి ఐటీ కారిడార్ ఏరియాల్లోని పలు టాప్ రెస్టారెంట్లలో కుళ్లిన మాంసం, కాలం చెల్లిన ఫుడ్ కలర్స్, ఫ్రీజర్లలో బొద్దింకలు, పురుగులు పట్టడం వంటి దారుణాలను టాస్క్ ఫోర్స్ బట్టబయలు చేసింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్   విడుదల చేసిన జూన్ 2026 నివేదిక ప్రకారం.. కొన్ని ప్రముఖ రెస్టారెంట్ల హైజీన్ స్కోర్ కేవలం 18% నుండి 35% మధ్యే ఉండటం ఇక్కడి తీవ్రతను సూచిస్తోంది.
 
 హైదరాబాద్ చివరి స్థానం 

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) విడుదల చేసిన తాజా  నివేదిక ప్రకారం.. దేశంలోని మెట్రో నగరాల్లో ఫుడ్ హైజీన్ రేటింగ్స్ పొందడంలో హైదరాబాద్ అత్యంత చివరి స్థానంలో నిలిచింది. నగరంలోని సుమారు 25 వేల లైసెన్స్డ్ హోటళ్లలో కేవలం 2 శాతం  361 హోటల్లు మాత్రమే ఈ రేటింగ్స్ కలిగి  ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు తనిఖీలు చేసి ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు  ఇవ్వడం లేదా స్వల్ప జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటున్నారు. అయితే అత్యంత శుభ్రమైన ఆహారాన్ని ప్రజలకు అందించేందుకు హోటళ్లపై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటారు? భవిష్యత్తులో ఎలాంటి స్పష్టమైన నిబంధనలు పెడతారు? అనే దానిపై ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు. కేవలం సోదాలు చేసి వదిలేస్తే.. అధికారులు వెళ్లిన రెండు రోజులకే హోటల్ యాజమాన్యాలు మళ్లీ పాత పద్ధతిలోనే అపరిశుభ్ర వాతావరణాన్ని కొనసాగిస్తున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.

ఫుడ్ హైజీన్ స్కోర్ కార్డ్ అమలు తప్పనిసరా? 

ఈ గందరగోళానికి చెక్ పెడుతూ, రెస్టారెంట్లు కచ్చితంగా దారికి వచ్చేలా ప్రభుత్వం సరికొత్త కార్యాచరణను  సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ హైజీన్ రేటింగ్ విధానం కేవలం  ఐచ్ఛికం గా మాత్రమే ఉంది. దీనివల్ల చాలా హోటళ్లు సర్టిఫికేషన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీనిని నియంత్రిస్తూ.. రాబోయే రోజుల్లో ప్రతి చిన్న, పెద్ద హోటల్ తమ ఎంట్రన్స్ వద్ద కస్టమర్లకు స్పష్టంగా కనిపించేలా  ఫుడ్ హైజీన్ స్కోర్ కార్డ్ లేదా స్టార్ రేటింగ్‌ను ప్రదర్శించడాన్ని ప్రభుత్వం  తప్పనిసరి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

నిబంధనలు పదే పదే ఉల్లంఘించే హోటళ్ల లైసెన్సుల రద్దు

ఈ సోదాల పర్వం ముగిసిన తర్వాత రెండో దశ యాక్షన్ ప్లాన్ కింద.. నిబంధనలు పదే పదే ఉల్లంఘించే హోటళ్ల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయడంతో పాటు, సదరు యాజమాన్యాలపై నాన్-బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చట్ట సవరణలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే, స్కూల్ కల్చర్, పబ్లిక్ మెస్‌లలో క్వాలిటీ కంట్రోల్ కోసం ప్రతి జోన్‌కు ఒక ప్రత్యేక మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. నిరంతర నిఘా, కఠినమైన జరిమానాలు మరియు డిజిటల్ రేటింగ్స్ సిస్టమ్‌ను అనుసంధానించడం ద్వారానే హైదరాబాద్ గ్యాస్ట్రోనమీ బ్రాండ్ ఇమేజ్ కాపాడటంతో పాటు ప్రజల ఆరోగ్యానికి పూర్తి భద్రత చేకూరుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget