అన్వేషించండి

"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ

HYDRA News:హైకోర్టు కామెంట్స్‌పై స్పందించిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్పందించారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే ప‌ని చేస్తున్నానని అన్నారు. చెరువులు, ప్ర‌భుత్వ ఆస్తులు కాపాడుతున్నట్టు పేర్కొన్నారు.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైకోర్టు తొలగింపు ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.
  • రెండేళ్లలో 1.50 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులు కాపాడానన్నారు.
  • బడా కబ్జాదారుల అక్రమాలను అడ్డుకోవడంతో 63 కేసులు పడ్డాయన్నారు.
  • న్యాయస్థానాలపై నమ్మకముందని, విధులకు కట్టుబడి ఉంటానన్నారు.

HYDRA Commissioner Ranganath On High Court: తెలంగాణలో ఎప్పుడూ చర్చలకు కేంద్రంగా మారుతున్న హైడ్రాపై హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. హైడ్రా కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏం జరుగబోతోందా అన్న ఆసక్తి నెలకొంది. అయితే తనను తొలగించాలన్న హైకోర్టు ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. "నేను ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్‌గా రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21,48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించడం జరిగింది. మార్కెట్లో వీటి విలువ రూ. 1.50 లక్షల కోట్లు. ఆరు చెరువులను పూర్తి స్థాయిలో పున‌రుద్ధ‌రించాం. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఈ రెండు సంవత్సరాల లో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించింది హైడ్రా. నిజం వైపు నిజాయితీగా నిర్భయంగా, నిబద్ధతతో పని చేస్తాం కాబట్టే హైడ్రాకు ధైర్యం. ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్ట్‌లను తప్పుదోవ పట్టిస్తున్నారు." అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

లోతుకుంట భూమి విషయంలో ఏం జరిగిందో రంగనాథ్‌ వివరించారు. "లోతుకుంట భూమి విషయంలో దాదాపు పది వేల కోట్ల రూపాయల భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసింది. పర్మిషన్స్ లేకుండా హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ వందల చెట్ల‌ను ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా విధ్వంసం చేసింది. Save the Rocks Society, పర్యావరణవేత్తలతోపాటు స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ మీద హైడ్రా రంగంలో కి దిగింది. ఎక్కడో మూడు కిలోమీటర్ల అవతల ఉంద‌ని చెబుతూ లేని భూమిని చూపిస్తూ, ఈ బిల్డ‌ర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద కంటెంప్ట్ కేసు వేశారు. నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. వాటిని వేసింది బడా భూ కబ్జాదారులే. బ‌తుక‌మ్మ‌కుంట చెరువును మింగేయాలని చూసిన ఒక‌రు, లోతుకుంటలో రూ.వేల కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్‌లు కట్టాలని చూస్తున్నారు సంధ్యా శ్రీధర్‌రావు."అని ఆరోపణలు చేశారు.  

వేల సంఖ్యలో ఉన్న‌ సింగరేణి కార్మికుల ప్లాట్స్‌ను కొట్టేయాలని నల్ల మల్లారెడ్డి చూశారని రంగనాథ్‌ చెప్పుకొచ్చారు. "క్రిమినల్ మాఫియాగా చెలామణి అవుతూ రూ.వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్స్, ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖీం. వీరందరికీ నేను హైడ్రా కమిషనర్‌గా అడ్డు పడటమే నేను చేసిన తప్పు. వీళ్ళు  అందరూ వేసిన కేసులే నా మీద ఉన్న 63 కోర్ట్ ధిక్కార కేసులు. వాటిని నేను చట్టపరంగానే ఎదుర్కుంటాను. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం. చ‌ట్టాల ప‌ట్ల గౌర‌వంతో ప‌ని చేస్తూ వ‌స్తున్నాను. గతంలో, ఇప్పుడు, భవిష్యత్‌లో ప్ర‌భుత్వాలు ఏ బాధ్యతలు అప్పగించినా నేను నా వైపు నుంచి 100% ఫ‌లితాలు ఇవ్వట‌మే ల‌క్ష్యంగా ఉంటాను. అలాగే పని  చేస్తున్నాను, భవిష్యత్తులో కూడా  అదే నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేస్తాను." అని స్పష్టం చేశారు.  

Frequently Asked Questions

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని హైకోర్టు ఎందుకు ఆదేశించింది?

ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని రంగనాథ్ పేర్కొన్నారు. తనపై 63 కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు.

హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్ చేసిన ముఖ్యమైన పనులు ఏమిటి?

రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి రూ. 1.50 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులను రక్షించారు. 6 చెరువులను పునరుద్ధరించారు, వందల చెరువులు, వేల ఎకరాల భూమిని ఆక్రమణల నుండి విడిపించారు.

లోతుకుంట భూమి విషయంలో ఏం జరిగింది?

శాంతా శ్రీరామ్ అనే సంస్థ రూ.10 వేల కోట్ల విలువైన లోతుకుంట భూమిని ఆక్రమించుకోవాలని చూసింది. పర్యావరణవేత్తల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget