అన్వేషించండి

US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం

US Iran Conflict | హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడుల తర్వాత అమెరికా సైన్యం మెరుపు దాడులు చేసింది. ఇరాన్‌పై దాడి చేయడంతో పాటు ఆ దేశానికి ఉన్న చమురు అమ్మకాల అనుమతిని రద్దు చేసింది

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హర్మూజ్ నౌకల దాడులకు ప్రతిగా అమెరికా సైన్యం ఇరాన్‌పై దాడులు.
  • ఇరాన్ ఒప్పంద ఉల్లంఘన, ప్రాంతీయ భద్రతకు ముప్పుగా అమెరికా ఆరోపణ.
  • ఇరాన్ వైమానిక, నిఘా, క్షిపణి స్థావరాలపై దాడులు జరిగాయి.
  • అమెరికా చర్య కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనగా ఇరాన్ స్పందన.

US Airstrikes on Iran: పశ్చిమ ఆసియాలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య జూన్ నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగడంపై సందిగ్దత నెలకొంది. అమెరికా సైన్యం మంగళవారం నాడు ఇరాన్‌పై కొత్త దాడులను ప్రారంభించింది. అదే సమయంలో ఇరాన్ చమురు అంతర్జాతీయ విక్రయాలకు ఇచ్చిన మినహాయింపును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. హర్మూజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై దాడుల తర్వాత ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 

ఇరాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, ప్రాంతీయ భద్రతకు ముప్పు కలిగించిందని అమెరికా సైనిక కమాండ్ (CENTCOM) ఆరోపించింది. అదే సమయంలో, అమెరికా చర్యను కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనగా పేర్కొంటూ ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, తీరప్రాంత నిఘా వ్యవస్థలు, మిస్సైల్స్ సెంటర్, డ్రోన్‌ల ప్రయోగ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సైన్యం దాడులు చేస్తున్నట్లు ఓ అమెరికా అధికారి తెలిపారు. నాటో కూటమి శిఖరాగ్ర సమావేశం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టర్కీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు జరిగాయి.

ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడి

అమెరికా సైనిక కమాండ్ (CENTCOM) ప్రకారం.. అమెరికా సైన్యం ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, తీరప్రాంత నిఘా కేంద్రాలు, క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ ప్రయోగ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ నౌకాశ్రయాల మౌలిక సదుపాయాలపై, ఖేష్మ్‌, బందర్ అబ్బాస్‌, సిరిక్ లలో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధ్రువీకరించింది.

Also Read: Rawalakot Protest PoJK: పాకిస్తాన్‌కు పీఓకే షాక్.. భారత్‌లో కలుస్తామంటూ రావాలాకోట్‌లో వేలాది మంది నిరసనకారుల ర్యాలీ!

ఇరాన్ చమురు విక్రయాలపై ఆంక్షలు

ఇరాన్‌ చమురు విక్రయాలకు సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌ దేశానికి ఉన్న చమురు విక్రయాల లైసెన్స్‌ను అమెరికా (USA) రద్దు చేసింది. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతంలో ఇరాన్ అనుసరిస్తున్న తీరు, చేపడుతున్న చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని అమెరికా స్పష్టం చేసింది. ఈ కారణంతో ఇరాన్ చమురు లైసెన్స్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని ఓ అధికారి వెల్లడించారు.

అమెరికా తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంపై ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. వాషింగ్టన్ చర్యను తీవ్రంగా ఖండించింది. ఇది ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని ముమ్మాటికీ ఉల్లంఘించడమేనని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ, ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో తలెత్తే తీవ్ర పర్యవసానాలకు పూర్తిగా అమెరికా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.

Frequently Asked Questions

అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు ఎందుకు చేసింది?

హర్మూజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై దాడుల నేపథ్యంలో అమెరికా ఈ చర్య తీసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించింది.

అమెరికా దాడులలో ఇరాన్ లక్ష్యాలు ఏమిటి?

ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, తీరప్రాంత నిఘా కేంద్రాలు, క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ ప్రయోగ స్థావరాలు లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా తెలిపింది. ఖేష్మ్, బందర్ అబ్బాస్, సిరిక్‌లలో పేలుళ్లు వినిపించాయి.

అమెరికా దాడులపై ఇరాన్ ఎలా స్పందించింది?

అమెరికా చర్యను కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనగా ఇరాన్ తీవ్రంగా పేర్కొంది. ఇది ప్రాంతీయ భద్రతకు ముప్పు అని ఆరోపించింది.

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న మరో చర్య ఏమిటి?

ఇరాన్ చమురు అంతర్జాతీయ విక్రయాలకు గతంలో ఇచ్చిన మినహాయింపును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. ఇది కూడా ఉద్రిక్తతలకు కారణమైంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Temple Dating: దేవాలయాల్లో డేటింగ్ క్యాంపులు జనాభాను పెంచుతాయా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే డిస్కషన్!
దేవాలయాల్లో డేటింగ్ క్యాంపులు జనాభాను పెంచుతాయా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే డిస్కషన్!
US Iran War: ఇక పగటిపూటే దాడులు, వచ్చేవారం నుంచి భీకర దాడులు చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
ఇక పగటిపూటే దాడులు, వచ్చేవారం నుంచి భీకర దాడులు చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
US Russia Sanctions Bill: రష్యా ఆంక్షల బిల్లులో అమెరికా సవరణలు!సుంకాలు 100శాతానికి తగ్గింపు! భారత్‌కు ఉపశమనం లభిస్తుందా?
రష్యా ఆంక్షల బిల్లులో అమెరికా సవరణలు!సుంకాలు 100శాతానికి తగ్గింపు! భారత్‌కు ఉపశమనం లభిస్తుందా?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Embed widget