అన్వేషించండి

Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!

Pawan Kalyan Fan Niranjan Death News | వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ అరుదైన వ్యాధితో బాధపడుతూ మరణించాడు.
  • పవన్ నిరంజన్‌ను కలిసి, కోరికలు తీర్చి, ఆర్థికంగా అండగా నిలిచారు.
  • ఓజీ 2 అతిథిగా పవన్ మాటిచ్చాక, నిరంజన్ మృతి కలచివేసింది.

Pawan Kalyan Fan Nirajan Dies | హనుమకొండ: ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) మృతిచెందాడు. గత కొన్నేళ్లుగా యువకుడు నిరంజన్ ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. చిన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసే నిరంజన్ ఈ వ్యాధి కారణంగా శారీరక ఎదుగుదల లోపించి, ఆపై పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్‌ను పవన్ ఇటీవల కలిసి పరామర్శించారు. ఇటీవల నిరంజన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం అతడ్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి నిరంజన్‌ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.


Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!

తన అభిమాన నటుడు చూడాలనే వీరాభిమాని నిరంజన్ ఆఖరి కోరికను తెలుసుకున్న పవన్ కల్యాణ్ చలించిపోయారు. గత జూన్ నెలలోనే స్వయంగా హనుమకొండకు వెళ్లి మరీ అభిమాని నిరంజన్‌ను పరామర్శించారు. ఆ సమయంలో ఎంతో ఆత్మీయంగా నిరంజన్‌ను పలకరించారు పవన్. నిరంజన్ చేతిని ముద్దాడిన పవన్ తన అభిమానికి తిరుపతి నుంచి ప్రసాదం, పట్టువస్త్రాలు తెప్పించి అందించారు. రామ్ చరణ్ వద్ద ఉన్న కుక్కపిల్ల కావాలన్న అతడి కోరికను గంటల వ్యవధిలో నెరవేర్చి గొప్ప మనసు చాటుకున్నారు పవన్ కళ్యాణ్. నిరంజన్ కోరిక మేరకు ఆ కుటుంబానికి సైతం పవన్ కళ్యాణ్ ఆర్థికసాయం చేసి అండగా నిలిచారు.
Also Read: Pawan Kalyan: హనుమకొండలో పవన్ కల్యాణ్... అభిమాని చిరకాల వాంఛ నెరవేర్చిన ఏపీ డిప్యూటీ సీఎం


Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!

ఓజీ 2కి స్పెషల్ గెస్ట్‌ అని మాటిచ్చిన పవన్ కళ్యాణ్..
ఈ ఆత్మీయ కలయికలో పవన్ కల్యాణ్ తన అభిమాని నిరంజన్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ ఆసక్తికరమైన మాట చెప్పారు. 'OG 2' సినిమా తీస్తే.. ఆ సినిమాకు నువ్వే నా స్పెషల్ గెస్ట్ అని... మనమిద్దరం కలిసి ఆ సినిమా చూద్దాం అని నిరంజన్‌కు జనసేనాని మాటిచ్చారు.


Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!

తన అభిమాన నటుడిని చూడాలని ఎన్నో ఏళ్లుగా ఉన్న కల నేరవేర్చుకున్న నిరంజన్ కొన్నిరోజుల్లోనే ప్రాణాలు కోల్పోవడం పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులను కలచివేస్తోంది. నిరంజన్ మృతి పట్ల సోషల్ మీడియాలో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Frequently Asked Questions

పొనుగంటి నిరంజన్ ఎవరు? అతను ఎలా మరణించాడు?

నిరంజన్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో మంగళవారం రాత్రి మరణించాడు.

పవన్ కళ్యాణ్ నిరంజన్‌ను ఎప్పుడు, ఎక్కడ పరామర్శించారు?

పవన్ కళ్యాణ్ గత జూన్ నెలలో నిరంజన్‌ను హనుమకొండలోని అతని ఇంటి వద్దకు వెళ్లి స్వయంగా పరామర్శించారు.

పవన్ కళ్యాణ్ నిరంజన్‌కు ఎలాంటి సాయం అందించారు?

పవన్ కళ్యాణ్ ప్రసాదం, పట్టువస్త్రాలు అందించారు. రామ్ చరణ్ కుక్కపిల్ల కోరిక నెరవేర్చి, కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు.

నిరంజన్ మృతి పట్ల జనసేన వర్గాల స్పందన ఏమిటి?

నిరంజన్ మృతి పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులను కలచివేసింది. సోషల్ మీడియాలో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget