అన్వేషించండి

Pawan Kalyan: హనుమకొండలో పవన్ కల్యాణ్... అభిమాని చిరకాల వాంఛ నెరవేర్చిన ఏపీ డిప్యూటీ సీఎం

Pawan Kalyan visits Hanamkonda: తెలంగాణలోని హనుమకొండకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచ్చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమాని చిరకాల వాంఛను నెరవేర్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పవన్ కళ్యాణ్ హనుమకొండలోని అభిమాని నిరంజన్‌ను పరామర్శించారు.
  • జన్యు వ్యాధితో బాధపడుతున్న నిరంజన్‌ను కలిసి ధైర్యం చెప్పారు.
  • కుక్కపిల్ల, క్యాంటిన్ ఏర్పాటు వంటి వాగ్దానాలు చేశారు.
  • అభిమానుల సందడి మధ్య వరంగల్ భద్రకాళి ఆలయానికి వెళ్లారు.

తెలంగాణలోని హనుమకొండకు ఇవాళ (బుధవారం - జూన్ 17) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విచ్చేశారు. జన్యుపరమైన వ్యాధితో, తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న అభిమాని నిరంజన్ (Pawan Fan - Hanumankonda Niranjan) కోరికను మన్నించి, అతని ఇంటికి వచ్చిన ఆయన... బాలుడిని పరామర్శించి అతడిలో ధైర్యాన్ని నింపారు.

ఒక్కసారైనా పవన్‌ను కలవాలని...
అభిమాని కోరిక తెలిసిన వెంటనే స్పందన!
హనుమకొండలోని హనుమాన్ నగర్‌కు చెందిన నిరంజన్ వయసు 17 ఏళ్ళు. కొన్ని ఏళ్లుగా అతను జన్యుపరమైన వ్యాధితో బాధ పడుతున్నాడు. వయసుతో పాటు మిగతా అందరి వ్యక్తుల తరహాలో అతని శరీరం పెరగలేదు. చిన్నారిలా ఉన్నాడు. ఎలాగైనా సరే తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను ఒక్కసారైనా కలవాలన్నది ఆ బాలుడి చిరకాల కోరిక. ఈ విషయం పవన్ దృష్టికి వెళ్లడంతో... ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్పందించారు.హనుమాన్ నగర్‌లోని బాలుడి నివాసానికి బుధవారం ఉదయం చేరుకున్నారు.
  
''నాకు చిన్నప్పటి నుంచి మీరంటే అభిమానం'' అని నిరంజన్ చెప్పిన మాటలు విని పవన్ కల్యాణ్ కదలిపోయారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని బాలుడికి కప్పి, కళ్యాణం అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. అలాగే, భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమకు ఆలయంలో పూజ చేయించి కుటుంబ సభ్యులకు అందజేస్తానని తెలిపారు. పవన్‌ను ఇమిటేట్ చేస్తూ నిరంజన్ గతంలో చేసిన డ్యాన్స్ వీడియోలు, ఫొటోలను జనసేనాని చూశారు. తనను చుట్టుపక్కల వారంతా చోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తారని నిరంజన్ చెప్పారు.

Also Read: TG T20 league - తెలంగాణ t20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ... టీజీ టీ20 మ్యాచ్ టికెట్ రేట్స్ నుంచి షెడ్యూల్స్, ప్రైజ్ మనీ వరకు... ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి

కుక్క పిల్ల బొమ్మ చూపించి పెంచుకోవాలని ఉందనినిరంజన్ చెప్పగా... కొని పంపుతానని పవన్ హామీ ఇచ్చారు. అయితే... కుక్కను పెంచుకోవడానికి ఇంటి యజమాని అనుమతి కావాలని నిరంజన్ తండ్రి చెప్పగా... స్వయంగా ఆ ఇంటి ఓనర్లను పిలిపించి పవన్ మాట్లాడారు. నిరంజన్ తల్లిదండ్రులు గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటిన్‌లో పని చేసే వాళ్ళమని చెప్పగా... వాళ్ళతో క్యాంటిన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకు చెప్పారు పవన్. బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు.

Also ReadDisha Patani Success Story - బీటెక్ సెకండియర్‌లో కాలేజ్ మానేసి సినిమాల్లోకి... 500 నుంచి 5వేల కోట్లకు... దిశా పటాని సక్సెస్ వెనుక ఏం జరిగిందో తెలుసా?

నిరంజన్ ఇంటికి చేరుకున్న పవన్, ఆ బాలుడిని ఆప్యాయంగా పలకరించారు. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కాసేపు బాలుడితో మాట్లాడారు. తన అభిమాన కథానాయకుడు తనతో కాసేపు గడపటంతో ఆ బాలుడు ఎంతో సంతోషించాడు. తన కళ్ల ముందే ఫెవరేట్ హీరో ఉండటంతో నిరంజన్ ఆనందానికి అవధుల్లేవు. సామాన్య అభిమాని కోసం బిజీ షెడ్యూల్ మధ్య సమయం కేటాయించి పవన్ కల్యాణ్ తమ ఇంటికి రావడంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

పవన్ రాకతో భారీగా వచ్చిన అభిమానులు
హనుమకొండకుపవన్ కల్యాణ్ వస్తున్నారన్న సమాచారం తెలియడంతో... ఆయనను చూసేందుకు హనుమాన్ నగర్ పరిసర ప్రాంతాలకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. దాంతో ఆ ప్రాంతం అంతా పవన్ నినాదాలతో మార్మోగిపోయింది. అభిమానులను అదుపు చేసేందుకు పవన్ భద్రతా సిబ్బంది, పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.

నిరంజన్ పరామర్శ పూర్తయిన వెంటనే వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి బయలుదేరి వెళ్లారు పవన్. ఆయన వెంట జనసేన పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ శంకర్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి తదితరులు ఉన్నారు.

Also ReadHimanshu Jangra On 370 Biryani Controversy - 370 బిర్యానీ ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్... కథలో కొంతే నిజమట - లేటెస్ట్ వీడియోలో హిమాన్షు జంగ్రా

Frequently Asked Questions

పవన్ కల్యాణ్ హనుమకొండకు ఎందుకు వెళ్లారు?

జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్‌ను పరామర్శించి, ధైర్యం చెప్పడానికి పవన్ కల్యాణ్ హనుమకొండకు వెళ్లారు. నిరంజన్ పవన్‌ను కలవాలనే చిరకాల కోరికను నెరవేర్చారు.

అభిమాని నిరంజన్ ఆరోగ్య పరిస్థితి ఏమిటి?

నిరంజన్ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతని వయస్సు 17 సంవత్సరాలు అయినప్పటికీ, ఇతరుల మాదిరిగా అతని శరీరం పెరగలేదు.

పవన్ కల్యాణ్ నిరంజన్‌కు, అతని కుటుంబానికి ఏమి సహాయం చేశారు?

పవన్ నిరంజన్‌కు తిరుమల వస్త్రం, అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమను పంపిస్తానని, నిరంజన్ తల్లిదండ్రులకు క్యాంటీన్ పెట్టించాలని చెప్పారు. కుక్క పిల్లను కొని పంపడానికి కూడా హామీ ఇచ్చారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget