అన్వేషించండి

Human Bioluminescence:చీకటిలో మనుషులు కూడా మెరుస్తారు! ఆ సీక్రెట్ ఏంటో తెలుసా?

Human Bioluminescence: మనుషులు చీకటిలో మెరుస్తారనేది ఇప్పుడు కట్టుకథ కాదు. శాస్త్రీయ నిజం. మన కంటికి కనిపించని ఈ బయోలుమినిసెన్స్‌ వెనుక ఉన్న సీక్రెట్ గురించి చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మానవ శరీర ఉద్గార కాంతిని బయోఫోటాన్స్ అని పిలుస్తారు.
  • కణాల రసాయనిక చర్యల వల్ల ఇది ఉత్పన్నమవుతుంది, కంటికి కనిపించదు.
  • కాంతి తీవ్రత సమయాన్ని బట్టి మారుతుంది, ముఖం ఎక్కువగా మెరుస్తుంది.
  • వ్యాధులు, ఒత్తిడి గుర్తింపులో ఈ కాంతి భవిష్యత్తులో కీలక పాత్ర.

Human Bioluminescence: మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మెరిసే పురుగులు, లేదా సముద్ర గర్భంలోని కొన్ని వింత జీవులు మెరుస్తూ కనిపిస్తాయి. వాటిని సైన్స్ భాషలో బయోలుమినిసెన్స్ అంటారు. అయితే ఒక మినిషి కూడా ఇలాగే వెలుగును చిమ్ముతాడని ఎవరైనా చెబితే కొట్టి పారేస్తాం. లేదా చెప్పిన వాళ్లది పిచ్చివాగుడని కొట్టి పారేస్తాం. కానీ మనుషులు కూడా చీకటిలో మెరుస్తారని సైన్స్ చెబుతుంది.

అవును మీరు చదివింది నిజమే. మీరు ఈ ఆర్టికల్ చదివే సరికి మీ శరీరం నుంచి మీ కంటికి కనిపించని కాంతి ప్రసరిస్తోంది. ఈ వెలుగు మన కంటికి ఎందుకు కనిపించదు? ఇది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? మన ఆరోగ్యం ఈ కాంతితో ఎలా ముడిపడి ఉంది? 

సైన్స్ భాషలో ఇలా శరీరం నుంచి వచ్చే కాంతిని ఆల్ట్రా వీక్ ఫోటాన్ ఎమిషన్ లేదా బయోఫోటాన్స్ అంటారు. ఇది మన శరీరంలోని కణాలలో జరిగే రసాయనిక చర్యల వల్ల వెలువడే కాంతి. 2009లో జపాన్‌లోని టో హోకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు మసాకి కొబయోషి నాయకత్వంలో ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ కాంతిని కెమెరాలో బంధించారు. 

ఇది వేడి వల్ల వచ్చే ఇన్‌ఫ్రారెడ్‌ కిరాలు కాదు. ఇది మనం కళ్లతో చూడగలిగే విజిబుల్ లైట్, కానీ దీని తీవ్రత మన కంటి శక్తి కంటే వెయ్యి రెట్లు తక్కువగా ఉంటుంది. అందుకే చీకటి గదిలో మీరు ఎంత సేపు ఉన్నా మీ కాంతిని మీరు స్వయంగా చూడలేరు. 

మానవ శరీరం కాంతిని ఎలా ఉత్పత్తి చేస్తుంది?

మానవ శరీరంలో నిరంతరం జీవక్రియలు జరుగుతుంటాయి. మనం పీల్చే ఆక్సిజన్ కణాల స్థాయికి వెళ్లినప్పుడు, అక్కడ శ్వాసక్రియ ఫలితంగా ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ మన శరీరంలోని కొవ్వులు, ప్రోటీన్లతో కలిసినప్పుడు అవి ఒకరకమైన ఎగ్జైటెడ్‌ స్థితికి చేరుకుంటాయి. ఆ అణువులు తిరిగి సాధారణ స్థితికి వచ్చినప్పుడు అవి శక్తిని కాంతి రూపంలో అంటే ఫోటాన్ల రూపంలో బయటకు విడుదల చేస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే మన శరీరంలో ఒక చిన్న గ్లో స్టిక్ లాంటి ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. 

ఏ సమయంలో వెలుతురు కనిపిస్తుంది?

శాస్త్రవేత్తల ప్రయోగాలలో మరో ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది. మన శరీరం చిమ్మే కాంతి రోజంతా ఒకేలా ఉండదు. ఇది మన శరీరంలోని సర్కాడియన్ రిథమ్‌ లేదా జీవ గడియారంతో ముడి పడి ఉంటుంది. ఉదయం పూట కాంతి చాలా తక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం పెరుగుతూ ఉంటుంది. సాయంత్రం వేళలో శరీరం అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు కాంతి తీవ్రత తగ్గుతుంది. 

శరీరంలోని ఏ భాగాలు మెరుస్తాయి?

మసాకి కొబయాషి చేసిన పరిశోధనల ప్రకారం మన శరీరంలో అన్ని భాగాలు ఒకేలా మెరవవు. మన ముఖం శరీరం కంటే ఎక్కువ కాంతిని ప్రసరిస్తుంది. బుగ్గలు ఎక్కువ మెరుస్తాయి. రెండోస్థానంలో నొసలు ఉంటాయి. తర్వాత స్థానం మెడకు ఉంటుంది. 

ధాన్యం వెలుగును మారుస్తుందా?

ఇటలీలోని ఎల్‌ఎన్‌ఎఫ్‌ పరిశోధకులు చేసిన ఒక నూతన అధ్యయనం ప్రకారం, మనం చేసే ధ్యానం మన శరీర కాంతిపై ప్రభావం చూపుతుంది. బాక్స్ బ్రీతింగ్‌ అనే ప్రత్యేక శ్వాస ప్రక్రియను అనుసరించినప్పుడు, మన అర చేతుల నుంచి వెలువడే కాంతి ఉద్గారాల్లో ఒక క్రమపద్ధతి కనిపిస్తుంది. 

ధ్యానం చేస్తున్నప్పుడు మన శరీరం మరింత శాంతించి, ఆక్సిజన్ వినియోగం క్రమబద్ధం అవుతుంది. దీని వల్ల కాంతి ఉద్గారాల తీవ్రత తగ్గడమే కాకుండా, అవి మరింత ఒక క్రమమైన తరంగంలా మారుతాయని పరిశోధనలో తేలింది. 

ఇది ఆధ్యాత్మిక ఆరానా

చాలా మంది దీనిని చూసి ఆధ్యాత్మికవేత్తలు చెప్పే ఆరా లేదా తేజస్సు అని భ్రమపడుతుంటారు. అయితే భౌతిక శాస్త్రవేత్తలు దీనిని కొట్టి పారేస్తున్నారు. ఇందులో ఎలాంటి అతీంద్రియ శక్తి లేదని, కేవలం జీవ రసాయనిక ప్రక్రియ మాత్రమేనని అంటున్నారు. 

మన శరీరంలో కనిపించే తేజస్సు వైద్య రంగంలో ఆవిష్కరణకు కీలకం 

ఈ పరిశోధన కేవలం మనం మెరుస్తున్నామని చెప్పడానికే కాకుండా దీని వల్ల భవిష్యత్‌లో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. సాధారణ కణాల కంటే క్యాన్సర్ కణాలు విభిన్నమైన కాంతిని ఇస్తాయి. పోటాన్ ఎమిషన్ ద్వారా వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించవచ్చు. మన శరీరం ఎంత ఒత్తిడికి గురవుతుందో ఈ కాంతి ద్వారా తెలుసుకోవచ్చు. ఒక అవయవం ఎంత ఆరోగ్యంగా ఉందో, అది పని చేయడానికి సిద్ధంగా ఉందా లేదో తెలుసుకోవచ్చు. ఏదైనా మందు మన శరీరంపై ఎలా పని చేస్తుందో క్షణాల్లో తెలుసుకోవచ్చు.   

Frequently Asked Questions

మనిషి శరీరం నుండి వెలువడే కాంతికి సైన్స్ భాషలో ఏమని పేరు?

దీనిని ఆల్ట్రా వీక్ ఫోటాన్ ఎమిషన్ లేదా బయోఫోటాన్స్ అంటారు. మన శరీరంలోని కణాలలో జరిగే రసాయనిక చర్యల వల్ల ఈ కాంతి వెలువడుతుంది.

మనం మెరిసే కాంతిని మన కళ్ళతో ఎందుకు చూడలేము?

ఈ కాంతి తీవ్రత మన కంటి శక్తి కంటే వెయ్యి రెట్లు తక్కువగా ఉంటుంది. అందుకే చీకటి గదిలో కూడా మనం స్వయంగా ఈ కాంతిని చూడలేము.

మనిషి శరీరం నుండి వెలువడే కాంతి ఏ సమయంలో ఎక్కువగా ఉంటుంది?

ఈ కాంతి మన శరీరంలోని జీవ గడియారంతో ముడిపడి ఉంటుంది. సాయంత్రం వేళలో శరీరం అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఉదయం తక్కువగా, మధ్యాహ్నం పెరుగుతూ ఉంటుంది.

మనిషి శరీరంలోని ఏ భాగాలు ఎక్కువగా కాంతిని ప్రసరిస్తాయి?

ముఖం శరీరం కంటే ఎక్కువ కాంతిని ప్రసరిస్తుంది. ముఖ్యంగా బుగ్గలు ఎక్కువగా మెరుస్తాయి, ఆ తర్వాత నొసలు మరియు మెడ ఉంటాయి.

శరీర కాంతిని కొలవడం వల్ల వైద్య రంగంలో ఎలాంటి ఉపయోగం ఉంది?

దీని ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించవచ్చు. శరీరం ఎంత ఒత్తిడికి గురవుతుందో, అవయవాల ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఏదైనా మందు శరీరంపై ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget