అన్వేషించండి

Space Science Secretes: ఆ రెండు గ్రహాలపై వజ్రాల వాన! శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు? 

Space Science Secretes: సౌర కుటుంబంలోని మంచు గ్రహాలపై కురిసే వింతైన వజ్రాల వాన వెనుక ఉన్న రహస్యాల గురించి తెలుసా? 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలలో వజ్రాల వర్షం కురుస్తుంది.
  • అధిక పీడనం, ఉష్ణోగ్రతల వల్ల కార్బన్ వజ్రాలుగా మారుతుంది.
  • వజ్రాల వర్షం గ్రహాల వింత అయస్కాంత క్షేత్రాలకు కారణం.
  • ఈ ప్రక్రియ గ్రహాల అంతర్భాగాల అధ్యయనానికి సహాయపడుతుంది.

Space Science Secretes: విశ్వంలో మనకు తెలియని వింతలెన్నో ఉన్నాయి. భూమి మీద నీటి వర్షం కురవడం సహజం. కానీ మన సౌర కుటుంబంలోని మంచు గ్రహాలైన నెప్ట్యూన్‌, యురేనెస్‌ల మీద వజ్రాల వర్షం కురుస్తుందని మీకు తెలుసా? ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథ కాదు. శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించిన యథార్థం. ఈ వజ్రాల వాన మనం అనుకున్నదాని కంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు, పీడనాల వద్దే మొదలవుతుందని తేలింది. అసలు ఈ వజ్రాలు ఎలా ఏర్పడతాయి? అవి ఆగ్రహాల అయస్కాంత క్షేత్రాలను ఎలా మారుస్తున్నాయి? అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఇక్కడ చూద్దాం. 

వజ్రాల వాన అంటే ఏంటీ? 

నెప్ట్యూన్‌, యురేనస్‌ గ్రహాలను ఐస్‌ జెయింట్స్ అని పిలుపుస్తారు. వీటిలో ఘనమైన కోర్‌ చుట్టూ నీరు, అమ్మోనియం, హైడ్రోకార్బన్లతో కూడిన మందపాటి మంచు పొరలు ఉంటాయి. ఈ గ్రహాల లోపలి భాగంలో పీడనం, ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగతాయి. ఈ తీవ్రమైన పరిస్థితుల్లో, మీథేన్ వంటి హైడ్రోకార్బన్లలోని కార్బొన్, హైడ్రోజన్ విడిపోతాయి. ఆ విడిపోయిన కార్బన్‌ అణువులు తీవ్రమైన పీడనం వల్ల వజ్రాల స్పటికాలుగా మారి, వర్షంలా ఆ గ్రహం లోపలి పొరల్లో కురుస్తాయి. దీనినే శాస్త్రవేత్తలు వజ్రాల వాన అంటారు. 

దీన్ని ఎలా, ఎప్పుడు గుర్తించారు. 

వజ్రాల వాన కురుస్తుందని శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ఊహిస్తున్నప్పటికీ, దానిని ప్రయోగశాలలో మొదటిసారిగా 2017లో SLAC నేషనల్‌ యాక్సిలరేటర్ లాబొరేటరీ పరిశోధకులు గమనించారు. అప్పట్లో హై- పరవర్ లేజర్‌లను ఉపయోగించి కేవలం కొన్ని నానో సెకన్లపాటు మాత్రమే ఈ పరిస్థితులను సృష్టించగలిగారు. 

Also Read: భోజనం తర్వాత ఎంత సమయానికి నీళ్లు తాగాలి? మధ్య మధ్యలో వాటర్ తాగడం మంచిదా కాదా?

అయితే 2024లో ప్రచురితమైన పరిశోధనలో జర్మనీలోని యూరోపియన్‌ ఎక్స్‌ రే ఫ్రీ ఎలక్ట్రాన్‌ లేజర్‌ సహాయంతో శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సాధించారు. వీరు పాలీస్టెరిన్ అనే ప్లాస్టిక్ పొరను తీసుకొని, దానిని  వజ్రాల మధ్య ఉంచి విపరీతమైన పీడనానికి గురి చేశారు. ఆ తర్వాత ఎక్స్‌రే పల్స్‌ ద్వారా 2200 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి చేశారు. ఈ ప్రయోగంలో వజ్రాలు మనం గతంలో అనుకున్న దాని కంటే తక్కువ లోతులో తక్కువ పీడనం వద్దే ఏర్పడుతున్నాయని గుర్తించారు. 

అయస్కాంత క్షేత్రాల రహస్యం

భూమికి ఉండే అయస్కాంత క్షేత్రం చాలా క్రమబద్ధంగా, ఉత్తర, దక్షిణ ధ్రువాల నుంచి విస్తరించి ఉంటుంది. కానీ నెప్ట్యూన్‌, యురేనస్‌ గ్రహాల అయస్కాంత క్షేత్రాలు చాలా వింతగా, అసమానంగా ఉంటాయి. ఇవి గ్రహం మధ్యలో కాకుండా ఒక పక్కకు నెట్టివేసినట్టు కనిపిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఇంత వరకు అంతుచిక్కలేదు. 

తాజా పరిశోధనల ప్రకారం, ఆకాశం నుంచి వజ్రాలు కిందికి పడుతున్నప్పుడు, అవి తమతోపాటు వాయువులను, మంచును కూడా లాగుతూ కిందకు వెళ్తాయి. ఇది ఆ గ్రహంలోని విద్యుత్ ప్రసరణ చేసే మంచు పొరల్లో ఒకరమైన కదలికను కలిగిస్తుంది. ఈ కదలికలే ఒక డైనమోలాగా పని చేసి ఆగ్రహాలకు వింతైన అయస్కాంత క్షేత్రాలను సృష్టిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 

ఎక్కువ మంది చదివిన ఈ టాప్ ట్రెండింగ్‌లో వార్తలు మిస్ అవ్వొద్దు

1 జపాన్‌లో చేసింది దొంగపని - పైగా పోలీసులకు లంచం ఆఫర్ - భారతీయ పర్యాటకురాలికి ఏ శిక్ష పడిందంటే?
2 యూకేలో చదవాలంటే ఎంత ఖర్చవుతుంది? ఫీజులు, అద్దె, ఫుడ్ పూర్తి వివరాలు ఇవే
3 జంతువులకు నెలసరి వస్తుందా? ఇది మనుషులకే పరిమితమైందా?
4 బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హాఫ్‌ హెల్మెట్‌ మంచిదా? ఫుల్ హెల్మెట్‌ పెట్టుకుంటే బెటరా?
5 చెక్క మండిస్తే ఎరుపు రంగులో, LPG మంట నీలం రంగులో ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న సైన్స్‌ ఏంటి?

మన సౌర కుటుంబంలోని గ్రహాల లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ పరిశోధన దోహదపడుతుంది. విశ్వంలో నెప్ట్యూన్‌ కంటే చిన్నగా ఉండే మినీ- నెప్ట్యూన్స్‌ అత్యంత సాధారణమైన గ్రహాలు. అక్కడ కూడా ఇలాంటి వజ్రాల వాన కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రయోగశాలలో ప్లాస్టిక్ నుంచి వజ్రాలను తయారు చేసే ఈ పద్ధతిని భవిష్యత్‌లో మెడిసిన్, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో వాణిజ్యం పరంగా వాడుకోవచ్చు. 

Also Read: లక్షల కిలోల బరువు ఉండే మేఘాలు ఆకాశంలో ఎలా తేలుతాయి? వెనుక ఉన్న సైన్స్ ఇదే!

ప్రయోగశాలలో ఇవి నానో మీటర్ల పరిమాణంలో ఏర్పడినప్పటికీ, నెప్ట్యూన్‌ గ్రహం మీద ఇవి లక్షల క్యారెట్ల బరువు ఉండే పెద్ద వజ్రాలుగా మారే అవకాశం ఉంది. పై నుంచి వజ్రాలు కిందకు పడుతున్నప్పుడు అవి ఘర్షణ వల్ల వేడిని పుట్టిస్తాయి. ఇది ఆ గ్రహం లోప అదనపు ఉష్ణశక్తిగా మారుతుంది. భూమి మీద వర్షపు చినుకులు ఎలా పడతాయో, వేరే గ్రహాల మీద వజ్రాలు లేదా లోహలు వర్షం కూడా భౌతిక శాస్త్ర నియమాల ప్రకారమే జరుగుతుందని హార్వర్డ్ పరిశోధకులు వివరిస్తున్నారు.

Also Read: వేడి నీళ్లు కూల్ వాటర్ కంటే వేగంగా గడ్డకడతాయా? దీని వెనుక ఉన్న సైన్స్ మిస్టరీ ఏంటీ? 

Frequently Asked Questions

నెప్ట్యూన్ మరియు యురేనస్ గ్రహాలపై వజ్రాల వర్షం ఎలా కురుస్తుంది?

ఈ గ్రహాల లోపలి భాగంలో అధిక పీడనం మరియు ఉష్ణోగ్రతల వద్ద మీథేన్ వంటి హైడ్రోకార్బన్లలోని కార్బన్, హైడ్రోజన్ నుండి విడిపోయి, వజ్రపు స్పటికాలుగా మారుతుంది. ఈ వజ్రాలు వర్షంలా గ్రహం లోపలి పొరల్లో కురుస్తాయి.

వజ్రాల వర్షం కురుస్తుందని ఎప్పుడు, ఎలా గుర్తించారు?

శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ఊహిస్తున్నప్పటికీ, 2017లో SLAC లాబొరేటరీలో ప్రయోగశాలలో మొదటిసారిగా గుర్తించారు. 2024లో జరిగిన తాజా పరిశోధనలో, ప్లాస్టిక్ నుండి వజ్రాలను తక్కువ లోతులో, తక్కువ పీడనం వద్ద కూడా తయారు చేయవచ్చని నిరూపించారు.

వజ్రాల వర్షం గ్రహాల అయస్కాంత క్షేత్రాలను ఎలా ప్రభావితం చేస్తుంది?

వజ్రాలు కిందికి పడుతున్నప్పుడు, అవి వాయువులను, మంచును కూడా లాగుతూ వెళ్తాయి. ఇది గ్రహంలోని విద్యుత్ ప్రసరణ చేసే మంచు పొరల్లో కదలికను కలిగిస్తుంది. ఈ కదలికలు వింతైన, అసమానమైన అయస్కాంత క్షేత్రాలను సృష్టిస్తాయి.

ప్రయోగశాలలో వజ్రాల తయారీ పద్ధతిని భవిష్యత్తులో ఎలా ఉపయోగించవచ్చు?

ప్రయోగశాలలో ప్లాస్టిక్ నుంచి వజ్రాలను తయారు చేసే ఈ పద్ధతిని భవిష్యత్తులో మెడిసిన్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వాణిజ్యపరంగా వాడుకోవచ్చు. నెప్ట్యూన్ గ్రహం మీద లక్షల క్యారెట్ల బరువున్న వజ్రాలు ఏర్పడే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget