DIY Hair Pack : మందార పువ్వు, కొబ్బరి పాలుతో హెయిర్ ప్యాక్.. జుట్టు రాలడాన్ని తగ్గించి మెరుపును పెంచుతుందా?
Healthy Hair Pack : మందారం, కొబ్బరి పాలు జుట్టుకు విడి విడిగా మంచి ప్రయోజనాలు అందిస్తాయి. ఈ రెండిటినీ కలిపి తలకు హెయిర్ ప్యాక్‌లా అప్లై చేస్తే కలిగే లాభాలు చూసేద్దాం.

- మందార పువ్వు, కొబ్బరి పాలతో జుట్టు సమస్యలకు ఇంటి చిట్కా.
- ఈ ప్యాక్ జుట్టుకు తేమ అందించి, మృదువుగా చేస్తుంది.
- జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, చుండ్రును తగ్గిస్తుంది.
- బలహీనమైన జుట్టును సంరక్షించి, సహజ మెరుపును అందిస్తుంది.
Hibiscus and Coconut Milk Hair Pack : జుట్టు రాలడం, పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలు ఈ రోజుల్లో చాలా కామన్‌గా ఉంటున్నాయి. మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. వాటికి ఇంట్లోనే కొన్ని సహజ పదార్థాలతో చెక్ పెట్టవచ్చు. ఖరీదైనా షాంపూలు, ట్రీట్మెంట్స్ మాదిరిగానే.. ఈజీగా తయారు చేసుకునే హెయిర్ ప్యాక్‌లు కూడా హెల్ప్ చేస్తాయి. అలాంటి వాటిలో మందార పువ్వు, కొబ్బరి పాలుతో చేసే హెయిర్ మాస్క్ ఒకటి. ఈ హెయిర్ ప్యాక్ ఏంటి? దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. దీనివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
హెయిర్ ప్యాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు
మందార పువ్వులు – 4 నుంచి 5
మందార ఆకులు – 8 నుంచి 10
కొబ్బరి పాలు – అర కప్పు
తయారీ విధానం
ముందుగా మందార పువ్వులు, ఆకులను శుభ్రంగా కడగాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు కొబ్బరి పాలతో కలిపి.. ఈ మిశ్రమాన్ని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. రెండూ బాగా బ్లెండ్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు సమానంగా పట్టించాలి.
ఈ ప్యాక్‌ను జుట్టుకు అప్లై చేసిన తర్వాత 30 నుంచి 45 నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం గోరువెచ్చని నీటితో, తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు ఈ ప్యాక్ ఉపయోగించవచ్చు.
లాభాలివే..
కొబ్బరి పాలలో ఉండే సహజ కొవ్వులు జుట్టుకు సహజంగా తేమను అందిస్తాయి. జుట్టును పొడిబారకుండా కాపాడతాయి. జుట్టు మృదువుగా మారుతుంది. రెగ్యులర్‌గా వాడితే జుట్టు సిల్కీగా, మెత్తగా మారుతుంది. అలాగే చిక్కులు తగ్గించి.. జుట్టు రాలడాన్ని దూరం చేస్తుంది. అలాగే మందారలో ఉండే కొన్ని పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో హెల్ప్ చేస్తాయి.
ఇది స్కాల్ప్ శుభ్రంగా ఉంచడంలో సహాయపడి.. చుండ్రు తీవ్రతను తగ్గించవచ్చు. జుట్టు నిర్జీవంగా కనిపించకుండా సహజమైన మెరుపును అందిస్తుంది. కొబ్బరి పాలు, మందారలోని పోషకాలు స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. పొడిబారిన జుట్టుకు తేమ అందించి.. స్ప్లిట్ ఎండ్స్ సమస్యను తగ్గిస్తుంది. బలహీనమైన జుట్టును సంరక్షించి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు కూడా దీనిని మీ హెయిర్ కేర్ రొటీన్లో చేర్చుకోండి.
ఇలాంటి హెయిర్ ప్యాక్‌లు జుట్టు సంరక్షణలో హెల్ప్ చేస్తాయి. అయితే తీవ్రమైన జుట్టు రాలే సమస్య, స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్లు లేదా ఇతర సమస్యలు ఉంటే కచ్చితంగా నిపుణులను సంప్రదించడం మంచిది.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
Before You Go
Simple Yoga for Body Fat | చెడు కొవ్వును సింపుల్ యోగాసనాలతో దూరం చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























