అన్వేషించండి

Sri Lankan Chilli Vada Recipe : శ్రీలంక స్పెషల్ మిర్చి వడ.. టేస్టీ, క్రంచీ స్నాక్ కోసం ఈ రెసిపీ ట్రై చేసేయండి

Mirchi Vada Recipe : సాయంత్రం అయితే మిర్చి బజ్జీలు తినేవారు చాలామందే ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా మిర్చి వడ గురించి విన్నారా? అయితే ఈ టేస్టీ రెసిపీ మీరు ట్రై చేయాల్సిందే.

Tea Time Special Crispy and Spicy Chilli Vada : సాయంత్రం అయిందంటే చాలు. చాలామంది తమకి ఇష్టమైన స్నాక్స్ లాగించేస్తారు. అలాంటి వాటిలో మిర్చి బజ్జీ ఒకటి. అయితే ఎప్పుడూ మిర్చి బజ్జీ కాకుండా.. వడగా తిన్నారా? టేస్టీగా, క్రిస్పీగా తినాలనుకుంటే ఈ శ్రీలంక స్పెషల్ రెసిపీని ట్రై చేయొచ్చు. చాలా సింపుల్​గా, ఇంట్లో చేసుకోగలిగే ఈ మిర్చివడను ఎలా చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

పెసరపప్పు - 150 గ్రాములు

వెల్లుల్లి - 2 రెబ్బలు

అల్లం - 1 అంగుళం

రవ్వ - 2 టేబుల్ స్పూన్లు

ఉప్పు - రుచికి తగినంత 

కారం - 1 టీస్పూన్

పసుపు - పావు టీస్పూన్

మిర్చి ఫ్లేక్స్ - 1 టీస్పూన్

మెంతుల ఆకులు - అర టీస్పూన్

గరం మసాలా - అర టీస్పూన్

ధనియాలు - 1 టేబుల్ స్పూన్ 

జీలకర్ర - 1 టీస్పూన్

కొత్తిమీర - అరకప్పు (తురుము)

నూనె - డీప్ ఫ్రైకి సరిపడేంత

పచ్చిమిర్చి - 10 (కారం తక్కువ ఉండేవి)

తయారీ విధానం

ముందుగా పెసరపప్పు నానబెట్టుకోవాలి. కనీసం రెండు గంటల ముందు నానబెట్టుకుంటే మంచిది. పెసరపప్పు నానిన తర్వాత.. ఓ రెండు స్పూన్లు తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పెసరపప్పులో అల్లం, వెల్లుల్లి వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత దీనిని ఓ పెద్ద మిక్సింగ్ గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో పక్కకి తీసిన పెసరపప్పు, రవ్వ, కారం, ఉప్పు, జీలకర్ర, మిర్చి ఫ్లేక్స్, మెంతి ఆకులు, గరం మసాలా, ధనియాలు (నలిపి వేయాలి), జీలకర్ర, కొత్తిమీర వేసి కలపాలి. 

పిండిని బాగా మెత్తగా, అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండిలో నీళ్లు వేయకూడదు. ఇప్పుడు పిండిని మూత వేసి పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత తురిమిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మరోసారి పిండిని బాగా కలపాలి. ఇప్పుడు మిర్చి తీసుకుని.. దానిపై ఈ మిశ్రమాన్ని చుట్టాలి. ఇలా అన్ని చుట్టుకున్న తర్వాత స్టౌవ్ వెలిగించాలి. మీడియం మంట మీద కడాయి పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె వేసుకోవాలి. 

నూనె బాగా కాగిన తర్వాత.. దానిలో ఈ మిర్చీలను వేసుకోవాలి. అవి క్రిస్పీగా, గోల్డెన్ కలర్ మారిన తర్వాత తీసేయాలి. అంతే టేస్టీ, క్రిస్పీ మిర్చి వడ రెడీ. వీటిని మీరు నేరుగా లేదా టమాటా కెచెప్​తో కలిపి తినేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా హాయిగా సాయంత్రం వేళల్లో పిల్లలకు స్నాక్స్​గా, ఛాయ్​తో పాటు మీకు కూడా సపోర్ట్​గా ఉండే టేస్టీ ఐటమ్ చేసేసుకోండి. 

మరిన్ని టేస్టీ రెసిపీల కోసం దీనిని క్లిక్ చేయండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget